ఆటో ఎక్స్‌పో 2018: విపణిలోకి కవాసకి నింజా H2 SX మరియు SX SE విడుదల

Written By:
Recommended Video - Watch Now!
UM Renegade Thor Electric Cruiser Bike India Launch Details, Price, Specifications - DriveSpark

ఆటో ఎక్స్‌పో 2018: జపాన్ సూపర్ బైకుల తయారీ దిగ్గజం కవాసకి విపణిలోకి అత్యంత ఖరీదైన నింజా హెచ్2 ఎస్ఎక్స్ మరియు ఎస్ఎక్స్ ఎస్ఇ బైకులను విడుదల చేసింది. వీటి ధరలు వరుసరా రూ. 21.80 లక్షలు మరియు రూ. 26.80 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నాయి.

కవాసకి నింజా హెచ్2 ఎస్ఎక్స్

కవాసకి తమ హెచ్2 మోటార్ సైకిల్ ఆధారంగా నింజా హెచ్2 ఎస్ఎక్స్ బైకును తీసుకొచ్చింది. మరియు లాంగ్ రైడింగ్స్ ప్రత్యేకంగా ఇందులో ఎన్నో అప్‍‌డేట్స్ నిర్వహించింది.

కవాసకి నింజా హెచ్2 ఎస్ఎక్స్

కవాసకి నింజా హెచ్2 ఎస్ఎక్స్ మరియు ఎస్ఎక్స్ ఎస్ఇ బైకుల్లో 998సీసీ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల ఇన్-లైన్ సూపర్ ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 199బిహెచ్‌పి పవర్ మరియు 136ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

కవాసకి నింజా హెచ్2 ఎస్ఎక్స్

అత్యధిక పవర్ మరియు టార్క్ ప్రొడ్యూస్ చేసే హెచ్2 మరియు హెచ్2ఆర్ బైకుల తరహాలో ఈ రెండు బైకులు లో మరియు మిడ్ రేంజ్‌లో అధిక పవర్ ఇచ్చేలా ఇంజన్‌ను ట్యూన్ చేశారు.

కవాసకి నింజా హెచ్2 ఎస్ఎక్స్

హెచ్2 ఎస్ఎక్స్ బరువు నింజా హెచ్2 కంటే 18కిలోలు అధికంగా ఉంటుంది. లాంగ్ డ్రైవ్ కోసం రూపొందించిన ఇందులో కొన్ని ప్రత్యేకమైన టూరింగ్ ఫీచర్లు ఉన్నాయి. అవి, ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్ మరియు కవాసకి ఆధునిక ఐఎమ్‌యు ఎలక్ట్రానిక్ ప్యాకేజ్ ఉన్నాయి.

కవాసకి నింజా హెచ్2 ఎస్ఎక్స్

నిజానికి కవాసకి నింజా హెచ్2 ఎస్ఎక్స్ మరియు హెచ్2 ఎస్ఎక్స్ ఎస్ఇ మధ్య పెద్ద వ్యత్యాసమేమీ లేదు. స్టాండర్డ్ వెర్షన్ హెచ్2 ఎస్ఎక్స్‌లో అనలాగ్ టాకోమీటర్ మరియు ఫుల్లీ-డిజిటల్ ఎల్‌సిడి డిస్ల్పే ఉంది.

కవాసకి నింజా హెచ్2 ఎస్ఎక్స్

అదే విధంగా కవాసకి హెచ్2 ఎస్ఎక్స్ ఎస్ఇ బైకులో టిఎఫ్‌టి ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, సరికొత్త ఎల్ఇడి లైట్లు మరియు ఎల్ఇడి కార్నరింగ్ లైట్లు ఉన్నాయి.

కవాసకి నింజా హెచ్2 ఎస్ఎక్స్

కవాసకి నింజా హెచ్2 ఎస్ఎక్స్ బైకులో పలు ఎలక్ట్రానిక్ ఫీచర్లు ఉన్నాయి. అందులో క్రూయిజ్ కంట్రోల్, కవాసకి ట్రాక్షన్ కంట్రోల్, కవాసకి లాంచ్ కంట్రోల్ మోడ్ మరియు టూరింగ్ స్పోర్ట్ రైడింగ్‌లో పలు రకాల డ్రైవింగ్ పరిస్థితులకు అనుగుణంగా కవాసకి క్విక్ షిఫ్టర్స్ ఉన్నాయి. ఈ స్పోర్ట్స్ టూరర్ బైకు రైడర్‌కు రిలాక్స్‌డ్ రైడింగ్ పొజిషన్ కల్పిస్తుంది.

కవాసకి నింజా హెచ్2 ఎస్ఎక్స్

కవాసకి నింజా హెచ్2 ఎస్ఎక్స్ బైకును పూర్తి స్థాయిలో దిగుమతి చేసుకుని విక్రయించనుంది. కవాసకి తమ స్టాండర్డ్ నింజా హెచ్2 ఎస్ఎక్స్ బైకును ఆటో ఎక్స్‌పో 2018లో ఆవిష్కరించలేదు. అయితే, ఇది కూడా దేశీయంగా లభ్యం కానుంది.

కవాసకి నింజా హెచ్2 ఎస్ఎక్స్

కవాసకి ఈ మధ్య కాలంలో ఇండియన్ మార్కెట్లోకి వుల్కన్ 650 క్రూయిజర్, జడ్900 మరియు జడ్ఎక్స్-10ఆర్ బైకులను లాంచ్ చేసింది.

కవాసకి నింజా హెచ్2 ఎస్ఎక్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కవాసకి నింజా హెచ్2 ఎస్ఎక్స్ హెచ్2 బైక్ ఆధారిత సూపర్‌ఛార్జ్‌డ్ స్పోర్ట్స్ టూరర్ మోటార్ సైకిల్. హెచ్2ఎస్ఎక్స్ బైకులో లాంగ్ డ్రైవ్ కోసం మరియు భద్రత పరంగా ఎన్నో రకాల ఎలక్ట్రానిక్ ఫీచర్లు ఉన్నాయి. హెచ్2 ఎస్ఎక్స్ మరియు ఎస్ఎక్స్ ఎస్ఇ మోటార్ సైకిళ్ల మీద దేశవ్యాప్తంగా ఉన్న కవాసకి డీలర్ల వద్ద ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

English summary
Read In Telugu: Auto Expo 2018: Kawasaki Ninja H2 SX And H2 SX SE Launched In India; Prices Start At Rs 21.80 Lakh
Story first published: Sunday, February 11, 2018, 13:05 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark