Just In
- 10 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 12 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 13 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 13 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కెటీఎమ్ ఆర్సీ 200 బ్ల్యాక్ కలర్ వేరియంట్ విడుదల: ధర రూ. 1.77 లక్షలు
స్పోర్ట్స్ మోటార్ సైకిళ్ల తయారీ దిగ్గజం ఆస్ట్రియాకు చెందిన కెటీఎమ్ నేడు విపణిలోకి కెటీఎమ్ ఆర్సీ 200 బైకును బ్ల్యాక్ వేరియంట్లో లాంచ్ చేసింది. ఆర్సీ 200 సూపర్ స్పోర్ట్ మోడల్ యొక్క ఆల్-న్యూ బ్ల్యాక్ కలర్ వేరియంట్ ఇది వరకు లభించే ఇతర వేరియంట్లకు కొనసాగింపుగా వచ్చింది.

సరికొత్త కెటీఎమ్ ఆర్సీ 200 ఆల్-న్యూ బ్ల్యాక్ కలర్ వేరియంట్ ధర రూ. 1.77 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. దీని విడుదలతో కెటీఎమ్ ఆర్సీ 200 ఇప్పుడు బ్లాక్ మరియు వెయిట్ కలర్ ఆప్షన్‌లో లభ్యమవుతోంది.

ఆర్సీ 390 బైకు తరహాలో ఉన్నటువంటి కలర్ స్కీమ్ ఆర్సీ 200 బ్ల్యాక్ వేరియంట్లో అందివ్వడం జరిగింది. అయితే, రెండింటి మధ్య తేడా ఉండేందుకు ఆరేంజ్ మరియు వైట్ కలర్ సొబగులు కాస్త భిన్నంగా ఇవ్వడం జరిగింది. కెటీఎమ్ ఆర్సీ 200 టెయిల్ సెక్షన్లో వైట్ గ్రాఫిక్స్ ఉన్నాయి.

నూతన కలర్ స్కీమ్ మినహాయిస్తే, కెటీఎమ్ ఆర్సీ 200 బైకులో సాంకేతికంగా ఎలాంటి మార్పులు జరగలేదు. ఇందులో అందే మునుపటి 199.5సీసీ కెపాసిటి గల లిక్విడ్-కూల్డ్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 25బిహెచ్‌పి పవర్ మరియు 19.2ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

కెటీఎమ్ ఆర్సీ200 పూర్తిగా ట్రాక్-ఫోకస్ మోటార్ సైకిల్ మరియు ఇందులో ప్రీమియం బాడీ పార్ట్స్ ఉన్నాయి. సస్పెన్షన్ కోసం ముందు వైపున అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్ ఉంది. బ్రేకింగ్ డ్యూటీ కోసం రెండు చక్రాలకు డిస్క్ బ్రేక్ అందివ్వడం జరిగింది. అయితే, ఇండియన్ వెర్షన్‌లో ఏబీఎస్ ఫీచర్ మిస్సయ్యింది.

కెటీఎమ్ ఆర్సీ 200 బైకులో ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంటల్ క్లస్టర్, క్లిప్-ఆన్ హ్యాండిల్ బార్స్ మరియు అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. 2017 మోడల్ కెటీఎమ్ ఆర్సీ 200లో విశాలమైన రియర్ వ్యూవ్ మిర్రర్స్, మెరుగైన కుషనింగ్ గల రైడర్ మరియు పిలియన్ సీటు ఉంది.

కెటఎమ్ ఆర్సీ 200 బ్ల్యాక్ వేరియంట్ మీద దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కెటిఎమ్ డీలర్ల వద్ద బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కెటిఎమ్-బజాజ్ ఆటో భాగస్వామ్యపు ప్రెసిడెంట్ అమిత్ నంది మాట్లాడుతూ, "కెటిఎమ్ ఆర్సీ 200 స్వచ్ఛమైన రేస్ మెషీన్, కెటిఎమ్ ఇండియా ఆర్సీ విభాగంలో 200 మోటార్ సైకిల్ అత్యంత కీలక భూమిక పోషిస్తుందని చెప్పుకొచ్చాడు. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా తెలుపు రంగుకు తోడుగా ఇప్పుడు నలుగు రంగును జోడించినట్లు తెలిపాడు."

ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ వెర్షన్‌లో అందుబాటులో ఉండేందుకు కెటిఎమ్ ఇండియా ఆర్సీ 200 బైకును సరికొత్త బ్ల్యాక్ వేరియంట్లో లాంచ్ చేసింది. కొత్త వేరియంట్ చూడటానికి అచ్చం మునుపటి మోడల్‌నే పోలి ఉంటుంది. అయితే, చాలా అగ్రెసివ్ లుక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్ విభాగంలో కెటిఎమ్ ఆర్సీ 200 మంచి ఫలితాలు సాధిస్తోంది.