విపణిలోకి మహీంద్రా మోజో యుటి300 విడుదల:ధర రూ. 1.49 లక్షలు

Written By:
Recommended Video - Watch Now!
Bangalore City Police Use A Road Roller To Crush Loud Exhausts

మహీంద్రా టూ వీలర్స్ విపణిలోకి సరికొత్త మహీంద్రా మోజో యుటి300(Mahindra Mojo UT300) మోటార్ సైకిల్‌ను లాంచ్ చేసింది. మహీంద్రా మోజో యుటి300 ప్రారంభ వేరియంట్ ధర రూ. 1.49 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

మహీంద్రా మోజో యుటి300

మహీంద్రా మోజో యుటి300 డిజైన్ పరంగా చూడటానికి అచ్చం రెగ్యులర్ మోజో బైకునే పోలి ఉంటుంది. మహీంద్రా తొలిసారి పరిచయం చేసిన మోజో బైకును ఎక్స్‌టి300 అనే పేరుతో పిలుస్తోంది. అత్యంత సరసమైన వెర్షన్‌లో యుటి300 మోటార్ సైకిల్‌ను ప్రవేశపెట్టారు.

మహీంద్రా మోజో యుటి300

మోజో యుటి300 పేరులో యుటి బ్యాడ్జింగ్ అర్థం యూనివర్సల్ టూరింగ్ అని, ఎక్స్‌టి అనగా ఎక్స్‌ట్రీమ్ టూరర్ అని మహీంద్రా వెల్లడించింది. తొలిసారిగా పరిచయం చేస్తున్న నేపథ్యంలో మార్చి 2018 చివరి వరకు ప్రతి మోజో యుటి300 కొనుగోలు మీద రూ. 10,000 ల వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

మహీంద్రా మోజో యుటి300

ఓరిజినల్ మహీంద్రా మోజో బైకులో ఉన్న బిగ్గరగా అరిచే రెండు ఎగ్జాస్ట్‌కు బదులుగా యుటి300 లో సింగల్ సైడ్ ఎగ్జాస్ట్ సెటప్ అందివ్వడం జరిగింది. దీంతో ఎక్స్‌టి300తో పోల్చుకుంటే యుటి300 చాలా తేలికగా ఉంటుంది.

మహీంద్రా మోజో యుటి300

తక్కువ ధరకే అందించే రెగ్యులర్ మోజో బైకులో ఉన్న ఖరీదైన డియాబ్లో రోస్సో II టైర్లకు బదులుగా రెండు చక్రాలకు ఎమ్ఆర్ఎఫ్ టైర్లను అందించింది. అంతే కాకుండా, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, ట్విన్-పోడ్ హెడ్‌ల్యాంప్స్ మరియు గోల్డ్ కలర్ ఫినిషింగ్స్ ఇందులో మిస్సయ్యాయి.

మహీంద్రా మోజో యుటి300

బ్రేకింగ్ డ్యూటీ కోసం రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులను అందివ్వడం జరిగింది. అయితే, కనీసం సింగల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా అందివ్వలేదు. సస్పెన్ష్ కోసం ఎక్స్‌టి300లో ఉన్న అప్‌‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ బదులు యుటి300 బైకులో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక మోనో షాక్ అబ్జార్వర్ కలదు.

మహీంద్రా మోజో యుటి300

సాంకేతికంగా, మహీంద్రా మోజో యుటి300 బైకులో అదే 295సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ 4-వాల్వ్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ వచ్చింది. అయితే, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ స్థానంలో కార్బోరేటర్ ఫ్యూయల్ సిస్టమ్ వచ్చింది. మహీంద్రా తమ మోజో యుటి300 పవర్ మరియు టార్క్ వివరాలు వెల్లడించలేదు.

మహీంద్రా మోజో యుటి300

మోజో యుటి300 విడుదల సందర్భంగా మహీంద్రా టూ వీలర్స్ బిజినెస్ హెడ్ ప్రకాష్ వాకంకర్ మాట్లాడుతూ, "మహీంద్రా విన్నూత్న ఆవిష్కరణతో ధరకు తగ్గ విలువలు గల ఉత్పత్తులను కస్టమర్లకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపాడు. ఖరీదైన వెర్షన్ మోజో ఎక్స్‌టి300 యొక్క బడ్జెట్ ఫ్రెండ్లీ వెర్షన్ యుటి300 బైకును ప్రవేశపెట్టినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా ఉన్న 60 నగరాల్లో మోజో అందుబాటులో ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చాడు."

మహీంద్రా మోజో యుటి300

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మహీంద్రా ఒరిజినల్ మోజో ఎక్స్‌టి300 మోటార్ సైకిల్ ఎంచుకునే కస్టమర్లు చాలా తక్కువ. అయితే, టూరింగ్ బైకులను ఎంచుకునే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని తక్కువ ధరలో అందించేందుకు మోజో బడ్జెట్ ఫ్రెండ్లీ వెర్షన్‌ను ఖరీదైన ఫీచర్లను తొలగించి యుటి300 పేరుతో పరిచయం చేసింది.

అంతే కాకుండా, పరిచయపు ఆఫర్ క్రింద మోజో యుటి300 బైకు మీద ఏకంగా రూ. 10,000 లు డిస్కౌంట్ అందించింది. మార్చి 2018 చివరి వరకు కొనుగోలు చేసే ప్రతి మోజో యుటి300 మీద పది వేల రుపాయలు తగ్గింపు పొందవచ్చు. అంటే రూ. 1.39 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకే మోజో యుటి300 ను సొంతం చేసుకోవచ్చు. ఇది విపణిలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350 మరియు 350ఎక్స్ బైకులకు గట్టి పోటీనిస్తుంది.

English summary
Read In Telugu: Mahindra Mojo UT300 Launched In India; Priced At Rs 1.49 Lakh
Story first published: Monday, March 5, 2018, 18:15 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark