మోజో యుటి300 టీజర్ లాంచ్ చేసిన మహీంద్రా

Written By:

మహీంద్రా టూ వీలర్స్ విపణిలోకి సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్పోర్ట్స్ టూరర్ మోటార్ సైకిల్ లాంచ్ చేయడానికి సన్నద్దమవుతోంది. మహీంద్రా మోజో యుటి300 బైకులు డీలర్ల వద్ద పట్టుబడ్డాయని ఇది వరకే ఓ కథనంలో వివరించాము. అయితే, ఇప్పుడు మహీంద్రా అధికారికంగా సోషల్ మీడియా ఛానళ్లలో మోజో యుటి300 మోటార్ సైకిల్ విడుదలను సూచించే టీజర్లను విడుదల చేసింది.

Recommended Video - Watch Now!
TVS Zeppelin Cruiser Concept Walkaround, Specs, Details - DriveSpark

అతి తక్కువ ధరలో మహీంద్రా నుండి రానున్న మోజో యుటి300 స్పోర్ట్స్ టూరర్ మోటర్ సైకిల్‌ గురించి మరిన్ని వివరాలు...

మహీంద్రా మోజో యుటి300

మహీంద్రా విడుదల చేసిన టీజర్ ద్వారా యుటి300 ఓవరాల్ డిజైన్ రివీల్ అయ్యింది. అర్బన్ మరియు రూరల్ ఏరియాలకు అనుగుణంగా రూపొందించారు. అంతే కాకుండా మహీంద్రా మోజో యుటి300 రోజు వారి అవసరాలకు మరియు లాంగ్ రైడింగ్‌కు బాగా సెట్ అవుతుందని టీజర్ వివరించింది.

మహీంద్రా మోజో యుటి300

రెగ్యులర్ వెర్షన్ మోజో కంటే మోజో యుటి300 చౌకైన మోడల్. అయితే, ఇందులో అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు మరియు డ్యూయల్ ఎగ్జాస్ట్ పైపులు మిస్సయ్యాయి.

మహీంద్రా మోజో యుటి300

కానీ ట్విన్ హెడ్‌ల్యాంప్ సెటప్‌తో సహా ఓవరాల్ డిజైన్ రెగ్యులర్ మోజోనే పోలి ఉంటుంది. లాంగ్ రైడింగ్‌లో రైడర్‌తో పాటు పిలియన్‌కు కూడా సౌకర్యాన్ని కల్పించే ఉద్దేశ్యంతో విశాలమైన పిలియన్ సీటు ఇందులో అందివ్వడం జరిగింది.

మహీంద్రా మోజో యుటి300

మహీంద్రా మోజో యుటి300 బైకులో ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌కు బదులుగా కార్బోరేటర్ వచ్చింది. సాంకేతికంగా మోజో యుటి300లో 295సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు. 27బిహెచ్‌పి పవర్ మరియు 30ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మోజో యుటి300లో పిరెల్లీ డియాబ్లో రోస్సో II టైర్లు కూడా రాలేదు. వాటికి బదులుగా, ఎమ్ఆర్ఎఫ్ టైర్లు వచ్చాయి. ఫ్రంట్ ఫోర్క్స్ మరియు ఫ్రేమ్ మీద ఉన్న బంగారు వర్ణపు సొబగులు కూడా రావడం లేదు. అయితే, సరికొత్త కలర్ ఆప్షన్స్ పరిచయమయ్యే అవకాశాలు ఉన్నాయి.

మహీంద్రా మోజో యుటి300 బైకులో ముందు వైపున కన్వెన్షనల్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంది. బ్రేకింగ్ డ్యూటీ కోసం ఇరువైపులా డిస్క్ బ్రేకులు ఉన్నాయి. చీపెస్ట్ మోజో వెర్షన్‌లో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ కూడా వచ్చే ఛాన్స్ లేదు.

 మోజో యుటి300 టీజర్ లాంచ్ చేసిన మహీంద్రా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మహీంద్రా మోజో రెగ్యులర్ మోడల్ యొక్క చీపెస్ట్ వెర్షన్ మోజో యుటి300. కానీ, రెండింటి డిజైన్‌లో పెద్దగా మార్పులేమీ చోటు చేసుకోలేదు. మరికొన్ని వారాల్లో మహీంద్రా తమ మోజో యుటి300 బైకును రూ. 1.4 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విపణిలోకి లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

మహీంద్రా మోజో యుటి300 విపణిలో ఉన్న బజాజ్ డామినర్ 400 మరియు ఇటీవలె విడుదలైన రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350ఎక్స్ మోటార్ సైకిల్‌కు గట్టి పోటీనివ్వనుంది.

English summary
Read In Telugu: Mahindra Mojo UT300 Teased Ahead Of Launch
Story first published: Friday, March 2, 2018, 11:39 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark