టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి రేస్ ఎడిషన్ 2.0 విడుదల: ధర, ఫీచర్లు మరియు ప్రత్యేకతలు

దక్షిణ భారత ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్స్ విపణిలోకి సరికొత్త టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి రేస్ ఎడిష్ 2.0 బైకును లాంచ్ చేసింది. ఆపాచే ఆర్‌టిఆర్ 200 4వి రేస్ ఎడిషన్ 2.0 ప్రారంభ వేరియం

By Anil Kumar

దక్షిణ భారత ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్స్ విపణిలోకి సరికొత్త టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి రేస్ ఎడిష్ 2.0(TVS Apache RTR 200 4V Race Edition 2.0) బైకును లాంచ్ చేసింది. ఆపాచే ఆర్‌టిఆర్ 200 4వి రేస్ ఎడిషన్ 2.0 ప్రారంభ వేరియంట్ ధర రూ. 95,185 లుగా ఉంది.

Recommended Video

2018 హోండా సిబిఆర్ 250ఆర్ రివీల్ | New Honda CBR 250 Details, Expected Launch & Price - DriveSpark
టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి రేస్ ఎడిషన్ 2.0 విడుదల

ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ వేరియంట్ ధర రూ. 1,07,885 లు అదే విధంగా కార్బోరేటర్ మరియు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ గల వేరియంట్ ధర రూ. 1,08,985 లుగా ఉంది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.

సరికొత్త రేస్ ఎడిషన్ 2.0 లో విడుదలైన అపాచే ఆర్‌టిఆర్ 200 4వి గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి రేస్ ఎడిషన్ 2.0 విడుదల

"యాంటీ-రివర్స్ టార్క్(A-RT)" అనే పేరుతో పిలిచే స్లిప్పర్ క్లచ్ టెక్నాలజీని టీవీఎస్ తమ కొత్త తరం అపాచే ఆర్‍‌టిఆర్ 200 4వి రేస్ ఎడిషన్ బైకులో అందించింది. దీనితో పాటు సరికొత్త టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి రేస్ ఎడిష్ 2.0 బైకులో రేసింగ్ ప్రేరిత బాడీ గ్రాఫిక్స్ మరియు అత్యుత్తమ ఏరోడైనమిక్స్ కోసం ఫ్లై స్క్రీన్ ఉన్నాయి.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి రేస్ ఎడిషన్ 2.0 విడుదల

అంతే కాకుండా, ఈ శ్రేణి స్లిప్పర్ టెక్నాలజీ పొందిన మొట్టమొదటి బైకు టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి రేస్ ఎడిషన్ 2.0 వెర్షన్. ఇందులో స్లిప్పర్ క్లచ్ పరిజ్ఞానం అందివ్వడంతో మోటార్ సైకిల్ పనితీరు మరింత మెరుగయ్యిందని టీవీఎస్ పేర్కొంది. గేర్లను మార్చేటప్పుడు ఉత్పన్నమయ్యే క్లచ్ ఫోర్స్ 22 శాతం వరకు దిగి వచ్చింది.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి రేస్ ఎడిషన్ 2.0 విడుదల

స్లిప్పర్ క్లచ్ టెక్నాలజీ అధిక వేగంలో గేర్లను తగ్గించేటపుడు భద్రతను మెరుగుపరచడం, మలుపుల్లో వెనుక చక్రం గాల్లోకి లేవడాన్ని మరియు బ్యాక్-బ్యాలెన్స్ టారక్ లిమిటెర్ ఎఫెక్ట్ సహాయంతో వెహికల్ స్టెబిలిటీని మెరుగుపరుస్తుంది.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి రేస్ ఎడిషన్ 2.0 విడుదల

సాంకేతికంగా టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి రేస్ ఎడిషన్ 2.0 బైకులో అదే 197.75సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది 8,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 20బిహెచ్‌పి(కార్బోరేటర్)/ 21బిహెచ్‌పి(ఇఎఫ్ఐ) పవర్ మరియు 7,000ఆర్‌‌పిఎమ్ వద్ద 18.1ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి రేస్ ఎడిషన్ 2.0 విడుదల

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి రేస్ ఎడిషన్ 2.0 విడుదల సందర్భంగా టీవీఎస్ మార్కెటింగ్ - ప్రీమియం టూ వీలర్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ మరియు టీవీఎస్ రేసింగ్ వైస్ ప్రెసిడెంట్ అరుణ్ సిద్ధార్థ్ మాట్లాతూ," రేసింగ్ ఔత్సాహికుల కోసం రేసింగ్ మోటార్ సైకిళ్లను నిర్మించాము- మా 35 ఏళ్ల రేసింగ్ అనుభవానికి టీవీఎస్ అపాచే సిరీస్ బైకులు సాక్ష్యం."

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి రేస్ ఎడిషన్ 2.0 విడుదల

"టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి రేసింగ్ ఎడిషన్ 2.0 లోని ఏ-ఆర్‌టి స్లిప్పర్ క్లచ్ ప్రతి రైడర్‌కు ఒక కొత్త రైడింగ్ అనుభూతిని కల్పిస్తుంది. 200సీసీ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో కస్టమర్లకు స్లిప్పర్ క్లచ్ టెక్నాలజీ పరిచయం చేసిన మొట్టమొదటి మోడల్ అపాచే ఆర్‌టిఆర్ అని ఆయన చెప్పుకొచ్చాడు".

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి రేస్ ఎడిషన్ 2.0 విడుదల

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి లభించే అన్ని వేరియంట్లను కూడా డైనమిక్ రేసింగ్ ప్రేరిత డీకాల్స్ అందివ్వడం జరిగింది. స్టైలిష్ బాడీ డీకాల్స్ ప్రతి రైడర్‌కు అద్భుతమైన రేసింగ్ ఫీల్ కలిగిస్తుంది.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి రేస్ ఎడిషన్ 2.0 విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రేసింగ్ మోటార్ సైకిళ్ల అభివృద్ది మరియు డిజైనింగ్ మరియు కొత్త టెక్నాలజీతో ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ వెర్షన్‌లో తమ బైకులు లాంచ్ చేయడంలో టీవీఎస్ ఎప్పుడూ ముందుంటుంది.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి రేస్ ఎడిషన్ 2.0 విడుదల

అపాచే ఆర్‌టిఆర్ 200 4వి రేస్ ఎడిషన్ బైకులో ఉన్న అత్యాధునిక ఏ-ఆర్‌టి స్లిప్పర్ టెక్నాలజీ సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్. అత్యంత సరసమైన ధరలో రేసింగ్ బైకులను అందించే లక్ష్యంతో ఇలాంటి అత్యాధునిక ఫీచర్లతో తమ బైకులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ విడుదల చేస్తోంది.

Most Read Articles

English summary
Read In Telugu: TVS Apache RTR 200 4V Race Edition 2.0 Launched In India; Prices Start At Rs 95,185
Story first published: Wednesday, March 7, 2018, 16:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X