టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ కొనుగోలు చేసేందుకు మరో కారణం

Written By:

దక్షిణ భారత ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ ఇటీవల విపణిలోకి సరికొత్త ఎన్‌టార్క్ 125 స్టైలిష్ మరియు పర్ఫామెన్స్ స్కూటర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, టీవీఎస్ ఇప్పుడు తమ ఎన్‌టార్క్ 125 స్పోర్టివ్ స్కూటర్‌లో మరో రెండు రంగులను పరిచయం చేసింది.

కస్టమర్లు ఇప్పుడు మునుపటి కలర్ ఆప్షన్‌లతో పాటు, మెటాలిక్ బ్లూక్ మరియు మెటాలిక్ గ్రే వంటి రంగుల్లో టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌ను ఎంచుకోవచ్చు.

రెండు కొత్త రంగుల్లో టీవీఎస్ ఎన్‌టార్క్ 125

ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదటి వారంలో విడుదలైన టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ప్రారంభ వేరియంట్ ధర రూ. 58,750 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. ప్రారంభంలో ఇది నాలుగు విభిన్న రంగుల్లో లభించేది అవి, మ్యాట్ రెడ్, మ్యాట్ వైట్, మ్యాట్ యెల్లో, మరియు మ్యాట్ గ్రీన్.

రెండు కొత్త రంగుల్లో టీవీఎస్ ఎన్‌టార్క్ 125

టీవీఎస్ తాజాగా మెటాలిక్ బ్లూ మరియు మెటాలిక్ గ్రే రంగులను పరిచయం చేయడంతో ఎన్‌టార్క్ 125 స్కూటర్ లభ్యమయ్యే రంగుల సంఖ్య ఆరు చేరుకుంది.

రెండు కొత్త రంగుల్లో టీవీఎస్ ఎన్‌టార్క్ 125

రెండు కలర్ ఆప్షన్స్‌లో కూడా స్కూటర్ ఫ్రంట్ డిజైన్‌లో బ్లాక్ ప్యానలింగ్ ఇంది. హెడ్ ల్యాంప్ కౌల్ మరియు ఏప్రాన్ అదే మునుపటి రంగులో లభిస్తోంది. కొత్త రంగుల్లో లభించే ఎన్‌టార్క్ 125 స్కూటర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

Recommended Video - Watch Now!
Honda Activa 5G Specifications, Key Features, Colours, First Look
రెండు కొత్త రంగుల్లో టీవీఎస్ ఎన్‌టార్క్ 125

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ కంపెనీ యొక్క తొలి 125సీసీ కెపాసిటి గల స్కూటర్. సులభంగా, సురక్షితంగా మరియు అత్యుత్తమ ఫీచర్లతో యువతతో పాటు అన్ని రకలా వయస్సున్న కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని పదునైన మరియు అగ్రెసివ్ డిజైన్ అంశాలతో టీవీఎస్ ఈ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌ను నిర్మించింది.

రెండు కొత్త రంగుల్లో టీవీఎస్ ఎన్‌టార్క్ 125

ఇండియాలో స్మార్ట్ కనెక్ట్ టెక్నాలజీ గల మొట్టమొదటి స్కూటర్ టీవీఎస్ ఎన్‌టార్క్ 125. దీంతో స్కూటర్‌ను బ్లూటూత్ ద్వారా స్మార్ట్ ఫోన్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. ఒక్కసారి స్మార్ట్ ఫోన్‌తో కనెక్ట్ అయితే, ఎల్‌సిడి డిస్ల్పేలో ఇన్‌కమింగ్ కాల్ డేటా మరియు మెసేజ్‌లను డిస్ల్పే చేస్తుంది.

రెండు కొత్త రంగుల్లో టీవీఎస్ ఎన్‌టార్క్ 125

స్మార్ట్ కనెక్ట్ ఫీచర్‌తో పాటు, టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌లోని ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌లో 55 అదనపు ఫీచర్లు ఉన్నాయి. అందులో, ల్యాప్ టైమర్, ఫోన్ బ్యాటరీ కెపాసిటి ఇండికేటర్, చివరగా పార్క్ చేసిన ప్రదేశాన్ని గుర్తుంచుకోవడం, సగటు వేగాన్ని లెక్కించే రికార్డర్, టాప్ స్పీడ్ రికార్డర్ మరియు విభిన్న రైడింగ్ మోడ్‌ల వివరాలను తెలియజేస్తుంది.

రెండు కొత్త రంగుల్లో టీవీఎస్ ఎన్‌టార్క్ 125

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌లో ఇంజన్ కిల్ స్విచ్, డ్యూయల్ సైడ్ హ్యాండిల్ లాక్, యుఎస్‌బి మొబైల్ ఛార్జర్, బయటపు వైపు ఉన్న ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, 22-లీటర్ల కెపాసిటి గల అండర్ సీట్ స్టోరేజ్ అంతే కాకుండా, న్యావిగేషన్ అసిస్ట్, టీవీఎస్ యాప్‌లో ఉన్న ఇన్ బిల్ట్ మ్యాప్‌మైఇండియా వంటి ఫీచర్లు ఉన్నాయి. న్యావిగేషన్ ఆన్ చేస్తే, ఎల్‌సిడి డిస్ల్పేలో టర్న్-బై-టర్న్ ఇండికేషన్స్ పొందవచ్చు. స్కూటర్ల ఈ ఫీచర్ రావడం ఇదే ప్రథమం.

రెండు కొత్త రంగుల్లో టీవీఎస్ ఎన్‌టార్క్ 125

సాంకేతికంగా టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌లో గాలితో చల్లబడే 125సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది, 9.27బిహెచ్‌పి పవర్ మరియు 10.4ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 95కిలోమీటర్లుగా ఉంది.

రెండు కొత్త రంగుల్లో టీవీఎస్ ఎన్‌టార్క్ 125

1.టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ ఫస్ట్ రైడ్ రివ్యూ చదవండి: ఈ రివ్యూలో ఇందులో ఉన్న బెస్ట్ అండ్ బ్యాడ్ ఏంటో తెలుసుకోండి...

2.అప్రిలియా ఎస్ఆర్ 125 ఫస్ట్ రైడ్ రివ్యూ: కొనవచ్చా.. కొనకూడదా?

3.టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 రేస్ ఎడిషన్ విడుదల: ధర రూ. 79,715 లు

4.కదిలే స్కూటర్ మీద హోమ్ వర్క్ చేస్తున్న పిల్లాడు: వీడియో

5.రాయల్ ఎన్ఫీల్డ్‌ బెస్ట్ సెల్లింగ్ బైక్ ఏదో తెలుసా...?

English summary
Read In Telugu: TVS NTorq 125 Now With Two New Colour Options — With Metallic Paint Scheme
Story first published: Saturday, April 14, 2018, 11:23 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark