రాయల్ ఎన్ఫీల్డ్‌కు పోటీగా విడుదలైన యుఎమ్ డ్యూటీ బైకులు

Written By:

ఆటో ఎక్స్‌పో 2018: యుఎమ్ మోటార్ సైకిల్స్ ఇండియన్ మార్కెట్లోకి రెనిగేడ్ డ్యూటీ సిరీస్ బైకులను లాంచ్ చేసింది. యుఎమ్ రెనిగేడ్ డ్యూటీ ప్రారంభ ధర రూ. 1.10 లక్షలు ఎక్స్‌-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నట్లు యుఎమ్ ప్రతినిధులు వెల్లడించారు.

రాయల్ ఎన్ఫీల్డ్‌కు గట్టి పోటీనిచ్చే యుఎమ్ రెనిగేడ్ డ్యూటీ బైకుల గురించి మరిన్ని వివరాలు ఇవాళ్టి కథనంలో...

యుఎమ్ రెనిగేడ్ డ్యూటీ

యుఎమ్ రెనిగేడ్ డ్యూటీ రెండు విభిన్న వేరియంట్లలో లభిస్తోంది అవి, డ్యూటీ ఎస్ మరియు డ్యూటీ ఏస్. సరికొత్త యుఎమ్ రెనిగేడ్ డ్యూటీ సిరీస్ బైకులు విపణిలో ఉన్న క్లాసిక్ 350, బజాజ్ అవెంజర్ సిరీస్ బైకులు మరియు సుజుకి ఇంట్రూడర్‌కు గట్టి పోటీనివ్వనున్నాయి.

Recommended Video - Watch Now!
Aprilia SR 125; Walkaround, Details, Specifications, Features - DriveSpark
యుఎమ్ రెనిగేడ్ డ్యూటీ

యుఎమ్ డ్యూటీ శ్రేణి బైకులు యుఎమ్ మోటార్ సైకిల్స్ ఇండియా లైనప్‌లో ఇది వరకే అందుబాటులో ఉన్న రెనిగేడ్ స్పోర్ట్ ఎస్ మోడల్ క్రింది స్థానాన్ని భర్తీ చేయనుంది. మరియు ఈ రెండు బైకులు రెనిగేడ్ డ్యూటీ ఎస్ మరియు రెనిగేడ్ డ్యూటీ ఏస్ బైకులు జూలై 2018 నుండి అమ్మకాలకు రానున్నాయి.

యుఎమ్ రెనిగేడ్ డ్యూటీ

యుఎమ్ రెనిగేడ్ డ్యూటీ మరియు రెనిగేడ్ ఏస్ బైకుల్లో 10-లీటర్ల కెపాసిటి గల ఇంధన ట్యాంక్ కలదు. ఈ రెండు కూడా లీటర్‌కు 41కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయి.

యుఎమ్ రెనిగేడ్ డ్యూటీ

యుఎమ్ డ్యూటీ బైకులో, గేర్ పొజిషన్ ఇండికేటర్ గల డిజిటల్ అనలాగ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. రెండు బైకుల్లో ఎల్ఇడి హెడ్ ల్యాంప్ మరియు టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. సస్పెన్షన్ కోసం ముందువైపున 41ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ట్విన్ హైడ్రాలిక్ స్ప్రింగ్ సస్పెన్షన్ కలదు.

యుఎమ్ రెనిగేడ్ డ్యూటీ

సాంకేతికంగా యుఎమ్ రెనిగేడ్ డ్యూటీ మోటార్ సైకిళ్లలో శక్తివంతమైన ఆఫ్-రోడ్ ఇంజన్‌ ఉంది. ఇందులోని శక్తివంతమైన 223సీసీ కెపాసిటి గల ఆయిల్‌తో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు.

యుఎమ్ రెనిగేడ్ డ్యూటీ

పవర్‌ఫుల్ ఇంజన్ 8,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 16బిహెచ్‌పి పవర్ మరియు 5,000ఆర్‌పిఎమ్ వద్ద 17ఎన్ఎమ్ టార్క్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ నుండి చైన్ డ్రైవ్ ద్వారా రియర్ వీల్‌కు అందుతుంది.

యుఎమ్ రెనిగేడ్ డ్యూటీ

యుఎమ్ డ్యూటీ సిరీస్ బైకుల్లో ముందు వైపున 120/80 ఆర్17 మరియు వెనుక వైపున 130/90 ఆర్15 కొలతల్లో ఉన్న టైర్లు ఉన్నాయి. రెండు బైకుల్లో 1360ఎమ్ఎమ్ వీల్ బేస్ మరియు 180ఎమ్ఎమ్ గరిష్ట గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది.

యుఎమ్ రెనిగేడ్ డ్యూటీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

యుఎమ్ రెనిగేడ్ డ్యూటీ ఎస్ మరియు డ్యూటీ ఏస్ బైకులు ఒకే మాదిరిగా ఉంటాయి. అయితే, రెండు బైకుల కలర్ థీమ్ వేర్వేరుగా ఉంటుంది. డ్యూటీ ఎస్ బైకును మిలిటరీ ప్రేరిత రంగులో మరియు డ్యూటీ ఎస్ బైకును స్పోర్టివ్ కలర్ స్కీమ్‌లో అందివ్వడం జరుగుతుంది.

యుఎమ్ డ్యూటీ సిరీస్ బైకులు విపణిలో ఉన్న బజాజ్ అవెంజర్ సిరీస్ బైకులకు మరియు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350కి ధర పరంగా గట్టి పోటీనివ్వనుంది.

English summary
Read In Telugu: Auto Expo 2018: UM Renegade Duty S & Duty Ace Launched At Rs 1.10 Lakh - Specs, Features & Images
Story first published: Saturday, February 10, 2018, 13:05 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark