బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ధరలు లీక్

బజాజ్ ఆటో తమ పల్సర్ ఆర్ఎస్200 డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. అతి త్వరలో విపణిలోకి రానున్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ రేసింగ్ మోటార్ సైకిల్ ధరలను కూడా రివీల్ చేసింది.

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ధరలు లీక్

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 మోటార్ సైకిల్ యొక్క స్పోర్ట్ & రేసింగ్ వెర్షన్ ఆర్ఎస్200, ఇది మార్కెట్లో మోస్ట్ పాపులర్ బైకు. తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ మోటార్ సైకిల్ ధర రూ. 1.43 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది,.

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ధరలు లీక్

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వెర్షన్ ఆర్ఎస్200తో పోల్చితే దీని ధర వెయ్యి రూపాయలు ఎక్కువ. ధరను అత్యంత పోటీతత్వంతో నిర్ణయించడంతో కొత్త వెర్షన్ రానున్న నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉండే పాత వెర్షన్ ఆర్ఎస్200 బైకును విపణి నుండి శాస్వతంగా తొలగించే అవకాశం ఉంది.

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ధరలు లీక్

సరికొత్త బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ వేరియంట్ బైకులో అదే మునుపటి 199సీసీ కెపాసిటీ గల సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. బిఎస్-4 ప్రమాణాలను పాటించే ఈ ఇంజన్ గరిష్టంగా 24.5బిహెచ్‌పి పవర్ మరియు 18.6ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు, కానీ స్లిప్పర్ క్లచ్ ఫీచర్ ఇందులో మిస్సయ్యింది.

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ధరలు లీక్

కేటీఎమ్ డ్యూక్200 బైకును కూడా బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 ఫ్లాట్‌ఫామ్ మీదనే నిర్మించారు. కానీ, ఆర్ఎస్200 బైకుతో పోల్చుకుంటే డ్యూక్200 ధర చాలా ఎక్కువ. డ్యూక్200 25బిహెచ్‌పి మరియు 19.2ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఆర్ఎస్200 కంటే కాస్త ఎక్కువే కావడంతో పవర్‌ఫుల్ బైక్ అని నిరూపించుకుంది.

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ధరలు లీక్

ఇండియన్ మార్కెట్లోకి బజాజ్ పల్సర్ శ్రేణి మోటార్ సైకిళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది, అంతే కాకుండా విదేశాలకు కూడా అధిక సంఖ్యలో ఎగుమతి చేస్తున్నారు. ఆర్ఎస్200 మోడల్‌లో డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ పరిచయం కావడంతో చాలా మంది దీని విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు.

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ధరలు లీక్

బజాజ్ ఆర్ఎస్200 బైకులో బ్రేకింగ్ సిస్టమ్ విషయంలో బయటి నుండి ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ, ఇప్పటికే ఆర్ఎస్200 బైకులను కొనుగోలు చేసిన కస్టమర్లు తమ బైకుల్లో డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌ను ఫిట్ చేయించుకోవచ్చనే పుకార్లు వినిపిస్తున్నాయి.

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ధరలు లీక్

బజాజ్ ఆటో దిగ్గజం ఇటీవల బెంగళూరుకు చెందిన చిన్న-తరహా-రవాణా స్టార్టప్ కంపెనీ యూలూ (Yulu)తో భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకుంది. సుమారుగా 57.27 కోట్ల రూపాయలు ఈ అంకుర సంస్థలో పెట్టుబడి పెట్టింది, దశల వారీగా పెద్ద మొత్తంలో చిన్న వాహనాలను కొనుగోలు చేయనున్నారు.

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ధరలు లీక్

ఈ భాగస్వామ్యం క్రింద యూలూ సంస్థ కోసం బజాజ్ ఎలక్ట్రిక్ బైకులను కూడా ప్రత్యేకంగా అభివృద్ది చేయనుంది. యూలూ రవాణా సంస్థకు కావాల్సిన నూతన ఉత్పత్తుల పరిశోధన మరియు అభివృద్ది మీద బజాజ్ దృష్టిసారిస్తోంది.

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ధరలు లీక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కేవలం వెయ్యి రూపాయల ధరతోనే బ్రేకింగ్‌లో అత్యంత కీలకమైన టెక్నాలజీ డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌‌ను తమ మోస్ట్ పాపులర్ మోటార్ సైకిల్ ఆర్ఎస్200లో అందించారు. పోటీని ఎదుర్కొని సేల్స్ పెంచుకునేందుకు బజాజ్ ఈ బైకులో కీలక అప్‌గ్రేడ్స్ నిర్వహించింది. సరసమైన ధరలో లభించే ఆర్ఎస్200 మోడల్‌ను అతి త్వరలో బిఎస్-6 ‌ఇంజన్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నారు.

Most Read Articles

English summary
Bajaj Pulsar RS200 Dual Channel ABS Price Revealed Before Launch: Priced At Rs 1.4 Lakh Ex-Showroom. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X