హోండా యాక్టివా స్కూటర్ కొంటున్నారా..? మీకో ముఖ్యమైన సమాచారం

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ ఇండియన్ మార్కెట్లో సరికొత్త యాక్టివా 125 బిఎస్-6 స్కూటర్ డెలివరీలను అధికారికంగా ప్రారంభించింది. పండుగ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో బిఎస్-6 యాక్టివా 125 స్కూటర్లకు కస్టమర్లకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఈ స్కూటర్ల డెలివరీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

హోండా యాక్టివా స్కూటర్ కొంటున్నారా..? మీకో ముఖ్యమైన సమాచారం

జూన్ 2019లో హోండా టూ వీలర్ల తయారీ దిగ్గజం తమ బెస్ట్ సెల్లింగ్ యాక్టివా 125 స్కూటర్‌ను బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా సరికొత్త ఇంజన్‌తో ఆవిష్కరించింది. యూరో-6 నియమాలతో పోటీపడేలా భారత ప్రభుత్వం తీసుకొచ్చిన భారత్ స్టేజ్ (BS)-6 ప్రమాణాలను పాటించేలా ఎగ్జాస్ట్ పైప్ మరియు ఇంజన్ డిజైనింగ్‌లో పలుమార్పులు చేసి బిఎస్-6 ఇంజన్‌ను అభివృద్ది చేశారు.

హోండా యాక్టివా స్కూటర్ కొంటున్నారా..? మీకో ముఖ్యమైన సమాచారం

కర్భన రసాయన ఉద్గారాలను తగ్గించే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వం అత్యంత కఠినమైన ఉద్గార నియమాలను అమలు చేస్తోంది. ఇప్పటికే ఎన్నో వాహన తయారీ సంస్థలు 2020 ఏప్రిల్ నుండి అమల్లోకి రానున్న బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఇంజన్‌లను అప్‌గ్రేడ్ చేశాయి. అయితే మరికొన్ని సంస్థలకు మాత్రం ఇదొక సవాలుగా మిగిలింది.

హోండా యాక్టివా స్కూటర్ కొంటున్నారా..? మీకో ముఖ్యమైన సమాచారం

హోండా కంపెనీ యాక్టివా 125 బిఎస్-6 స్కూటర్‌ను జూన్ 12, 2019న అంటే ప్రభుత్వం ప్రకటించిన గడువుకు 10 నెలల ముందే బిఎస్-6 వెర్షన్‌ను ఆవిష్కరించింది. ఆ తర్వాత మూడు నెలల్లో పూర్తి స్థాయిలో మార్కెట్లోకి లాంచ్ చేసి దీని ధర రూ. 67,490 గా ఖరారు చేసింది. తాజాగా వీటి బుకింగ్స్ మరియు డెలివరీలను అధికారికంగా ప్రారంభించింది.

హోండా యాక్టివా స్కూటర్ కొంటున్నారా..? మీకో ముఖ్యమైన సమాచారం

హోండా యాక్టివా 125 బిఎస్-6 మోడల్ డిజైన్ పరంగా చూడటానికి మునుపటి వెర్షన్‌నే పోలి ఉంటుంది. ఫ్రంట్ డిజైన్‌లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ మరియు పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లను ఫ్రంట్ ఏప్రాన్‌కు ఇరువైపులా చక్కగా అందించారు. క్రోమ్ డిజైన్ ఎలిమెంట్లు స్కూటర్‌కు ఒక చక్కటి రూపాన్నిచ్చాయి. సైడ్ ప్రొఫైల్‌లో మ్యాట్-బ్లాక్ ఫినిషింగ్ గల 5-స్పోక్ అల్లాయ్ వీల్స్, క్రోమ్ మెటల్ బాడీ వర్క్స్ వంటివి ఉన్నాయి.

హోండా యాక్టివా స్కూటర్ కొంటున్నారా..? మీకో ముఖ్యమైన సమాచారం

ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ విధులన్నీ అనలాగ్ డిజిటల్ యూనిట్‌ చేసి పెడుతుంది. ఇందులో స్కూటర్ స్పీడ్, మిగిలి ఉన్న ఇంధనం, ఓడో మీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్ వివరాలు, ఎంత దూరంలో ట్యాంక్ ఖాలీ అవుతుంది వంటి ఎన్నో ఇతర వివరాలను ఇందులోనే తెలుసుకోవచ్చు.

హోండా యాక్టివా స్కూటర్ కొంటున్నారా..? మీకో ముఖ్యమైన సమాచారం

హోండా యాక్టివా 125 బిఎస్-6 స్కూటర్‌లో సాంకేతికంగా 125సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. పవర్‌ఫుల్ ఇంజన్ గరిష్టంగా 8.4బిహెచ్‌పి పవర్ మరియు 10.54ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హోండా యాక్టివా స్కూటర్ కొంటున్నారా..? మీకో ముఖ్యమైన సమాచారం

హోండా యాక్టివా 125 బిఎస్-6 స్కూటర్లో హోండా అభివృద్ది చేసిన సైలెట్ స్టార్ట్ ఫీచర్ ఉంది. స్టార్టర్ మోటార్ ఇంజన్‌లోని క్రాంక్‌షాఫ్ట్‌ను ముందుకు తిప్పడానికి ముందు కాస్త వెనక్కు తిప్పుతుంది. దీంతో ఇంజన్ స్టార్ట్ అయ్యే సందర్భంలో వచ్చే శబ్దం చాలా తక్కువగా ఉంటుంది. దీనికి తోడు కొత్తగా వచ్చిన ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ మరియు ఎగ్జాస్ట్ సిస్టమ్ స్కూటర్‌ను మరింత క్లీనర్ అండ్ గ్రీనర్‌గా మార్చేసింది.

హోండా యాక్టివా స్కూటర్ కొంటున్నారా..? మీకో ముఖ్యమైన సమాచారం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

స్కూటర్ల సెగ్మెంట్లో హోండా యాక్టివా విడుదలైన తొలినాళ్ల నుండే విప్లవాత్మక మోడల్‌గా రాణించింది. హోండా యాక్టివా తొలిసారిగా 2001లో ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యింది. నాణ్యత, నమ్మకం మరియు విశ్వసనీయత పరంగా మార్కెట్లో దీన్ని మించిన స్కూటర్ మరొకటి లేదనే చెప్పాలి. సుమారుగా 18 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ హోండా యాక్టివానే నెంబర్ వన్ స్కూటర్‌గా నిలిచింది. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందిస్తూ పోటీదారులకు ధీటైన జవాబు చెబుతూనే కస్టమర్లను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది.

Most Read Articles

English summary
Honda Activa 125 BS-VI Deliveries Commence Six Months Ahead Of BS-VI Deadline. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X