హస్క్‌వర్ణ నుండి స్వార్ట్‌పిలెన్ 250 & విట్‌పిలెన్ 250 బైకులు

హస్క్‌వర్ణ మోటార్ సైకిల్ బ్రాండ్ గోవాలో జరుగుతున్న ఇండియా బైక్ 2019లో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇదే వేదిక మీద హస్క్‌వర్ణ స్వార్ట్‌పిలెన్ 250 మరియు విట్‌పిలెన్ 250 అనే రెండు సరికొత్త బైకులను ఆవిష్కరించింది.

హస్క్‌వర్ణ నుండి స్వార్ట్‌పిలెన్ 250 & విట్‌పిలెన్ 250 బైకులు

స్వీడన్ దేశానికి చెందిన హస్క్‌వర్ణ బ్రాండ్ ప్రత్యేకించి భారతీయ బైక్ ప్రియుల కోసం రెండు 250సీసీ మోటార్ సైకిళ్లను ఆవిష్కరించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి, స్వార్ట్‌పిలెన్ 401 మరియు విట్‌పిలెన్ 401 మోడళ్లను తీసుకొస్తుందని అందరూ భావించారు, కానీ 250 వేరియంట్లను తీసుకొచ్చి ఆశ్చర్యపరిచింది.

హస్క్‌వర్ణ నుండి స్వార్ట్‌పిలెన్ 250 & విట్‌పిలెన్ 250 బైకులు

హస్క్‌వర్ణ స్వార్ట్‌పిలెన్ 250

హస్క్‌వర్ణ స్వార్ట్‌పిలెన్ 250 బైక్ చూడటానికి డిజైన్ పరంగా అచ్చం హస్క్‌వర్ణ స్వార్ట్‌పిలెన్ 401 మాదిరిగానే ఉంటుంది. అదే స్క్రాంబ్లర్ స్టైల్ డిజైన్‌లో గుండ్రటి ఆకారంలో ఉన్న ఎల్ఈడీ డీఆర్ఎల్స్ హెడ్ ల్యాంప్, దీని పై భాగంలో డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌తో అత్యంత ఆకర్షణీయంగా ఉంది.

హస్క్‌వర్ణ నుండి స్వార్ట్‌పిలెన్ 250 & విట్‌పిలెన్ 250 బైకులు

కండలు తిరిగిన రూపంలో ధృడమైన ఫ్యూయల్ ట్యాంక్ మరియు వెనుక సింపుల్ డిజైన్ ఫినిషింగ్ కలదు. స్వార్ట్‌పిలెన్ 401 బైకులో వైర్-స్పోక్-వీల్స్ ఉండగా, స్వార్ట్‌పిలెన్ 250 బైకులో 8-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. స్క్రాంబ్లర్ డిజైన్ ఫీల్ కలిగించే డ్యూయల్-పర్పస్ టైర్లు ఇందులో వచ్చాయి.

హస్క్‌వర్ణ నుండి స్వార్ట్‌పిలెన్ 250 & విట్‌పిలెన్ 250 బైకులు

స్వార్ట్‌పిలెన్ అంటే స్వీడిష్ భాషలో "నలుపు బాణం" అని అర్థం, పేరుకు తగ్గట్లుగానే దీనిని దూసుకెళ్లే బాణంలా తీర్చిదిద్దారు. ఇండియా బైక్ వీక్ 2019లో ప్రదర్శించిన స్వార్ట్‌పిలెన్ 250 బైకును గన్‌మెటల్ గ్రే పెయింట్ ఫినిషింగ్‌ చేశారు, చాలా వరకు బాడీ పార్ట్స్ బ్లాక్ కలర్‌లో ఉన్నాయి.

హస్క్‌వర్ణ నుండి స్వార్ట్‌పిలెన్ 250 & విట్‌పిలెన్ 250 బైకులు

హస్క్‌వర్ణ విట్‌పిలెన్ 250

స్వీడన్ లాంగ్వేజ్‌లో విట్‌పిలెన్ అర్థం "తెలుపు బాణం". పేరుకు తగ్గట్లుగానే విట్‌పిలెన్ 250 మోటార్ సైకిల్‌ను వైట్ కలర్ పెయింట్ స్కీమ్‌లో ఆవిష్కరించారు. డిజైన్ పరంగా కెఫే రేసర్ స్టైల్లో ఉంటుంది.

హస్క్‌వర్ణ నుండి స్వార్ట్‌పిలెన్ 250 & విట్‌పిలెన్ 250 బైకులు

హస్క్‌‌వర్ణ విట్‌పిలెన్ 250 బైక్ ఫ్రంట్ డిజైన్‌లో స్వార్ట్‌పిలెన్‌ బైకులో ఉన్నటువంటి అదే గుండ్రటి హెడ్‌ల్యాంప్ మరియు డిజిటల్ ఇంస్ట్రుమెంట్ యధావిధిగా వచ్చాయి. విట్‌పిలెన్ 401లో ఉన్నటువంటి వైర్-స్పోక్-వీల్స్ మాదిరిగా కాకుండా ఇందులో అల్లాయ్ వీల్స్ వచ్చాయి. అయితే ఇందులో పటిష్టమైన రోడ్-గ్రిప్ అందించే టైర్లు ఉన్నాయి.

హస్క్‌వర్ణ నుండి స్వార్ట్‌పిలెన్ 250 & విట్‌పిలెన్ 250 బైకులు

ఇంజన్ వివరాలు

హస్కవర్ణ స్వార్ట్‌పిలెన్ 250 మరియు విట్‌పిలెన్ 250 బైకులను డ్యూక్ 250 మోడల్ ఆధారంగా తీసుకొచ్చారు. రెండు బైకుల్లో కూడా 248.8సీసీ సామర్థ్యం గల లిక్విడ్-కూల్డ్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 31బిహెచ్‌పి పవర్ మరియు 24ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హస్క్‌వర్ణ నుండి స్వార్ట్‌పిలెన్ 250 & విట్‌పిలెన్ 250 బైకులు

కెటిఎమ్ డ్యూక్ 250 బైకులో ఉన్నటువంటి అదే 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కూడా బైకుల్లో అందించారు. హస్క్‌వర్ణ బైకుల బరువు 153 కిలోలు ఉండగా, కెటిఎమ్ డ్యూక్ 250 బైక్ బరువు 161 కిలోలు. కాబట్టి హస్క్‌వర్ణ బైకులు మరింత చలాకీగా, వేగంగా పరుగెడతాయని చెప్పవచ్చు.

హస్క్‌వర్ణ నుండి స్వార్ట్‌పిలెన్ 250 & విట్‌పిలెన్ 250 బైకులు

అతి తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువ స్పీడ్ అందుకోవడానికి హస్క్‌వర్ణ రెండు బైకుల్లో కూడా మెరుగైన గేరింగ్ సిస్టమ్ ఉన్నట్లు తెలుస్తోంది. కెటిఎమ్ భాగస్వామ్యంతో హస్క్‌వర్ణ ఇండియా కార్యకలాపాలు సాగించనుంది కాబట్టి హస్క్‌వర్ణ బైకులు కెటిఎమ్ షోరూముల్లోనే లభిస్తాయి.

హస్క్‌వర్ణ నుండి స్వార్ట్‌పిలెన్ 250 & విట్‌పిలెన్ 250 బైకులు

ఇండియాలో బజాజ్-కెటిఎమ్ ఇప్పటికే ఉమ్మడి భాగస్వామ్యంతో పనిచేస్తున్నాయి. బజాజ్-కెటిఎమ్-హస్క్‌వర్ణ బిజినెస్‌ చైన్‌లో హస్క్‌వర్ణ అత్యంత ఖరీదైన మోటార్ సైకిళ్లను విక్రయించనుంది. నిజంగా చెప్పాలంట.. హస్క్‌వర్ణ బైకులు కెటిఎమ్ ఉత్పత్తుల కంటే ఖరీదైనవి. వీటి సేల్స్ ఫిబ్రవరి 2020 నుండి ప్రారంభం కానున్నాయి.

హస్క్‌వర్ణ నుండి స్వార్ట్‌పిలెన్ 250 & విట్‌పిలెన్ 250 బైకులు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హస్క్‌వర్ణ కంపెనీ అత్యంత చాకచక్యంగా ఇండియన్ టూ వీలర్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఎంట్రీ లెవల్ మోటార్ సైకిళ్లయిన 250సీసీ బైకులతో కెటిఎమ్ డ్యూక్ సిరీస్ బైకులకు సరాసరి పోటీనివ్వనున్నాయి. అంతే కాకుండా డ్యూక్ 390 మోడల్ ధర చాలా ఎక్కువగా ఉంది, దీన్ని అవకాశంగా మలుచుకునేందుకు అత్యంత పోటీతత్వంతో కూడిన ధరల శ్రేణిలో స్వార్ట్‌పిలెన్ 401 మరియు విట్‌పిలెన్ 401 బైకులను కూడా విపణిలోకి లాంచ్ చేసే ఆలోచనలో ఉంది. ఏదేమైనప్పటికీ, ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో హస్క్‌వర్ణ కాస్త కొత్త గాలిని తీసుకొచ్చిందనే చెప్పాలి.

Most Read Articles

English summary
Husqvarna Svartpilen 250 & Vitpilen 250 Revealed At India Bike Week 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X