ఇండియా బైక్ వీక్‌లో అదరగొట్టిన కెటిఎమ్‌ 390 అడ్వెంచర్

కెటిఎమ్ ఇండియా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 390 అడ్వెంచర్ మోటార్ సైకిల్‌ను దేశీయంగా ఆవిష్కరించింది. 2020 కెటిఎమ్ 390 అడ్వెంచర్ బైకును తొలిసారిగా ఐక్మా (EICMA) మోటార్ సైకిల్ షోలో ఆవిష్కరించారు. తాజాగా గోవాలో జరుగుతున్న ఇండియా బైక్ వీక్ 2019 ఈవెంట్లో ఈ బైకును ప్రదర్శించారు.

ఇండియా బైక్ వీక్‌లో అదరగొట్టిన కెటిఎమ్‌ 390 అడ్వెంచర్

కెటిఎమ్ ఇండియన్ మార్కెట్లోకి తీసుకొస్తున్న మొట్టమొదటి అడ్వెంచర్ బైక్ ఇదే, దీనిని డ్యూక్ 390 ఆధారంగా డెవలప్ చేశారు. అడ్వెంచర్ 390 బైకులో సాంకేతికంగా అదే 373సీసీ కెపాసిటీ గల సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు.

ఇండియా బైక్ వీక్‌లో అదరగొట్టిన కెటిఎమ్‌ 390 అడ్వెంచర్

డ్యూక్ 390 మరియు అడ్వెంచర్ 390 రెండు బైకుల్లో కూడా ఒకే ఇంజన్ ఉన్నప్పటికీ అడ్వెంచర్ అవసరాలకు అనుగుణంగా ఆఫ్-రోడింగ్ పవర్ ఔట్‍పుట్ లక్షణాలతో ఇంజన్‌ను ప్రత్యేకంగా ట్యూనింగ్ చేశారు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇంజన్ గరిష్టంగా 42బిహెచ్‍‍‌పి పవర్ మరియు 37ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఇండియా బైక్ వీక్‌లో అదరగొట్టిన కెటిఎమ్‌ 390 అడ్వెంచర్

అడ్వెంచర్ 390 బైకులో సస్పెన్ పరంగా ముందు వైపున ఇన్వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో-షాక్ అబ్జార్వర్ అందించారు. ఫ్రంట్ సస్పెన్షన్ 170ఎమ్ఎమ్ ట్రావెల్ కలిగి ఉండగా, రియర్ సస్పెన్షన్ 178ఎమ్ఎమ్ ఉంది.

ఇండియా బైక్ వీక్‌లో అదరగొట్టిన కెటిఎమ్‌ 390 అడ్వెంచర్

ప్రతి బైకులో అత్యంత కీలకమైన అంశం బ్రేకింగ్, ఇందులో రెండు వైపులా డిస్క్ బ్రేకులు మరియు మెరుగైన బ్రేకింగ్ సిస్టమ్ కోసం డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ టెక్నాలజీ స్టాండర్డ్ ఫీచర్‌గా అందించారు. 17-ఇంచుల ఫ్రంట్ వీల్‌కు 100/90 సెక్షన్ గల టైర్ మరియు 19-ఇంచుల రియర్ వీల్‌కు 130/80 సెక్షన్ కొలతల్లో ఉన్న టైర్లు ఉన్నాయి.

ఇండియా బైక్ వీక్‌లో అదరగొట్టిన కెటిఎమ్‌ 390 అడ్వెంచర్

సరికొత్త కెటిఎమ్ అడ్వెంచర్ 390 బైకులో ట్రాక్షన్ కంట్రోల్, స్విచబుల్ ఏబీస్(అవసరం లేనపుడు ఏబీస్ ఆఫ్ చేసుకునే టెక్నాలజీ), స్లిప్పర్ క్లచ్, పలు రకాల ఆఫ్-రోడింగ్ మోడ్స్‌తో పాటు మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

ఇండియా బైక్ వీక్‌లో అదరగొట్టిన కెటిఎమ్‌ 390 అడ్వెంచర్

ఇండియన్ రోడ్ల మీద అడ్వెంచర్ 390 మోడల్‌ను ఎన్నోసార్లు రహస్యంగా పరీక్షించారు, ప్రస్తుతం విడుదల సిద్దంగా ఉన్న బైకుల్లో ఇదీ ఒకటి. ఎక్కువ కెపాసిటీ ఉన్న ఇతర కెటిఎమ్ బైక్ డిజైన్ లక్షణాలను ఇందులో గుర్తించవచ్చు. పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్ల జోడింపుతో ఉన్న హెడ్‌ల్యాంప్ సెటప్, ఎల్ఈడీ లైట్లు మరియు రైడర్‌కు ఎన్నో అంశాలకు సంభందించిన సమాచారాన్నిచ్చే టిఎఫ్‌టి ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ డిస్ల్పే వంటి ఫీచర్లు ఉన్నాయి.

Most Read: 2020 స్కోడా ర్యాపిడ్ టీజర్ ఫోటోలు.. అసలైన మోడల్ ఇలా ఉంటుంది

ఇండియా బైక్ వీక్‌లో అదరగొట్టిన కెటిఎమ్‌ 390 అడ్వెంచర్

డ్యూక్ 390 బైకులో పోల్చుకుంటే, అడ్వెంచర్ 390 బైక్ కాస్త పెద్దగానే ఉంటుంది. 855ఎమ్ఎమ్ ఎత్తైన సీటు, 14.5-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ 200ఎమ్ఎమ్ మరియు 1430ఎమ్ఎమ్ వీల్‌బేస్ ఉంది(డ్యూక్ 390 వీల్‌బేస్ 1357ఎమ్ఎమ్)

Most Read: యమహా ఆర్15 వి3.0 బిఎస్ -VI వర్షన్ యొక్క స్థాపన

ఇండియా బైక్ వీక్‌లో అదరగొట్టిన కెటిఎమ్‌ 390 అడ్వెంచర్

గోవాలో జరుగుతున్న ఇండియా బైక్ వీక్ 2019లో పాల్గొన్న కెటిఎమ్ ప్రతినిధులు, అడ్వెంచర్ 390 మోటార్ సైకిల్ గురించి మాట్లాడుతూ, దీనిని 2020 జనవరిలో పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. బిఎస్-6 ఇంజన్‌తో వస్తున్న దీని మీద అతి త్వరలో బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.

Most Read: ఓఆర్ఎక్స్ఏ మాంటీస్ ఎలక్ట్రికల్ పెరఫామెన్స్ మోటార్ సైకిల్ రెవెల్ల్డ్

ఇండియా బైక్ వీక్‌లో అదరగొట్టిన కెటిఎమ్‌ 390 అడ్వెంచర్

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మరియు బిఎమ్‌డబ్ల్యూ జీ310 జీసీ మోడళ్లతో పాటు రాయల్ ఎన్పీల్డ్‌లోని ఇతర బైకులకు గట్టి పోటీనివ్వనున్న అడ్వెంచర్ 390 ధర సుమారుగా రూ. 3 లక్షల ఎక్స్-షోరూమ్‌తో లభించవచ్చు.

ఇండియా బైక్ వీక్‌లో అదరగొట్టిన కెటిఎమ్‌ 390 అడ్వెంచర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కెటిఎమ్ అడ్వెంచర్ 390 విపణిలో విడుదలయ్యేందుకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మోడల్. టెస్టింగ్ కోసం రోడ్డెక్కిన ప్రతిసారీ అప్పుడో ఇప్పుడో విడుదల అంటూ లెక్కలేనన్ని కథనాలు వచ్చాయి. అయితే, పుకార్లకు పుల్‌స్టాప్ పెడుతూ, అడ్వెంచర్ 390 మోడల్ విడుదలకు కెటిఎమ్ ఏర్పాట్లు ప్రారంభించింది.

Most Read Articles

English summary
KTM 390 Adventure Unveiled At India Bike Week 2019: Here Are All The Details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X