మోటో గుజ్జి వి7 మోటార్‌సైకిల్ ఆవిష్కరణ; సరికొత్త ఫీచర్లు, వివరాలు

ఇటాలియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ మోటో గుజ్జి తమ కొత్త 2021 వి7 మోటార్‌సైకిల్‌ను అంతర్జాతీయంగా ఆవిష్కరించింది. ఈ కొత్త మోటో గుజ్జి వి7 ఇప్పుడు అప్‌డేట్ చేయబడిన ఇంజన్‌తో పాటుగా మరిన్ని కొత్త ఫీచర్లతో వచ్చింది.

మోటో గుజ్జి వి7 మోటార్‌సైకిల్ ఆవిష్కరణ; సరికొత్త ఫీచర్లు, వివరాలు

ఈ బ్రాండ్ మోటో గుజ్జి వి7 మోటార్‌సైకిల్‌ను మొట్టమొదటిసారిగా యాభై సంవత్సరాల క్రితం ప్రారంభించింది. ఇప్పటి వరకూ ఈ సిరీస్‌లో అనేక వెర్షన్లు అందుబాటులో వచ్చాయి. గతంలో ఈ మోటారుసైకిల్ వెర్షన్లను గుర్తించేదుకు మోడల్ పేరు పక్కన రోమన్ సంఖ్య ఉండేది. ఉదాహరణకు, వి7లో మూడవ తరాన్ని సూచించేందుకు V7 III అని బ్రాండింగ్ చేయబడి ఉండేది. అయితే కొత్త 2021 మోడల్‌లో కంపెనీ రోమన్ సంఖ్యను పూర్తిగా తొలగించి వేసింది.

మోటో గుజ్జి వి7 మోటార్‌సైకిల్ ఆవిష్కరణ; సరికొత్త ఫీచర్లు, వివరాలు

కొత్త 2021 మోటో గుజ్జి వి7 మోటార్‌సైకిల్ వి7 స్టోన్ మరియు వి7 స్పెషల్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో వి7 స్టోన్ అల్లాయ్ వీల్స్, పూర్తి-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు బ్లాక్-అవుట్ హార్డ్‌వేర్‌తో సహా మరింత ఆధునిక డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది నీరో రువిడో, అజ్జురో గియాసియో మరియు అరాన్సియోన్ రామ్ అనే మూడు శాటిన్-ఫినిష్ కలర్ స్కీమ్‌లలో లభిస్తుంది.

MOST READ:ఇకపై ఈ వెహికల్ నెంబర్స్ నిషేధం.. ఎందుకో తెలుసా ?

మోటో గుజ్జి వి7 మోటార్‌సైకిల్ ఆవిష్కరణ; సరికొత్త ఫీచర్లు, వివరాలు

ఇతపోతే, మోటో గుజ్జి వి7 స్పెషల్ వేరియంట్‌ను ఒరిజినల్ వి7 మోటార్‌సైకిల్‌కు నివాళిగా డిజైన్ చేశారు. ఇందులో స్పోక్ వీల్స్, డబుల్-పాడ్ అనలాగ్ క్లస్టర్ మరియు క్రోమ్-ఫినిష్డ్ ఎగ్జాస్ట్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఈ వేరియంట్ రెండు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది, అవి: బ్లూ ఫార్మల్ మరియు గ్రిజియో క్యాజువల్.

మోటో గుజ్జి వి7 మోటార్‌సైకిల్ ఆవిష్కరణ; సరికొత్త ఫీచర్లు, వివరాలు

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2021 మోటో గుజ్జి వి7లో సరికొత్త ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది బ్రాండ్ యొక్క లైనప్‌లో ఉన్న వి85 టిటి అడ్వెంచర్-టూరింగ్ మోటార్‌సైకిల్ నుండి గ్రహించారు. ఇది షాఫ్ట్-డ్రివెన్ ఫైనల్ డ్రైవ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది.

MOST READ:ఫ్యాన్సీ నెంబర్ కోసం 32 లక్షలు వేలం పాడాడు.. కానీ చివరికి ఏమైందంటే ?

మోటో గుజ్జి వి7 మోటార్‌సైకిల్ ఆవిష్కరణ; సరికొత్త ఫీచర్లు, వివరాలు

ఈ మోటార్‌సైకిల్‌లో ఉపయోగించిన 850 సిసి ట్విన్-సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 6800 ఆర్‌పిఎమ్ వద్ద 65 బిహెచ్‌పి పవర్‌ను మరియు 5000 ఆర్‌పిఎమ్ వద్ద 73 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పాత తరం మోడల్‌తో పోల్చితే, ఈ కొత్త ఇంజన్ ఇప్పుడు అధికంగా 13 బిహెచ్‌పిల శక్తిని మరియు 13 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. కొత్త 2021 మోటో గుజ్జి వి7 మోడల్ పాత మోడల్ కంటే 25 శాతం ఎక్కువ శక్తివంతమైనది.

మోటో గుజ్జి వి7 మోటార్‌సైకిల్ ఆవిష్కరణ; సరికొత్త ఫీచర్లు, వివరాలు

డిజైన్ పరంగా చూస్తే, కొత్త మోటో గుజ్జి వి7 గుండ్రటి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌తో రెట్రో-మోడ్రన్ రోడ్‌స్టర్ రూపాన్ని కలిగి ఉంటుంది. ఇందులోని ఇతర ఫీచర్లలో పొడవైన స్కల్ప్టెడ్ ఫ్యూయెల్ ట్యాంక్, గుండ్రటి టెయిల్ ల్యాంప్, డ్యూయల్ ఎగ్జాస్ట్ సెటప్, సింగిల్-పీస్ వైడ్ హ్యాండిల్ బార్, సింగిల్-పీస్ రిబ్బెడ్ సీట్ మరియు ఫార్వర్డ్-సెట్ ఫుట్‌పెగ్స్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:ఈ రూల్స్ సాధరణ వాహనాలకు మాత్రమే కాదు పోలీస్ వాహనాలకు కూడా వర్తిస్తాయి.. ఆ రూల్స్ ఏవో మీరూ చూడండి

మోటో గుజ్జి వి7 మోటార్‌సైకిల్ ఆవిష్కరణ; సరికొత్త ఫీచర్లు, వివరాలు

ఇంకా ఇందులో ఎంచుకోదగిన ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంది. ఈ కొత్త మోటార్‌సైకిల్ ఫ్రేమ్‌ను కూడా రీడిజైన్ చేశారు. దీని ముందు భాగంలో కయాబా నుండి గ్రహించిన లాంగ్-ట్రావెల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ మరియు వెనుక వైపు ట్విన్-షాక్ సస్పెన్షన్ సెటప్‌లు ఉంటాయి.

మోటో గుజ్జి వి7 మోటార్‌సైకిల్ ఆవిష్కరణ; సరికొత్త ఫీచర్లు, వివరాలు

ఈ మోటారుసైకిల్‌లోని బ్రేకింగ్ ఫీచర్లను గమనిస్తే, ఇందులో డ్యూయల్-ఛానల్ ఎబిఎస్‌ను సపోర్ట్ చేసే ఫ్రండ్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. పాత మోడల్‌లో ఉపయోగించిన 130/80 ప్రొఫైల్ వెనుక టైర్ స్థానంలో కొత్తగా మరింత వెడల్పాటి 150/70 ప్రొఫైల్ టైరును ఉపయోగించారు.

MOST READ:ఈ-రిక్షాలు ఇవ్వ‌నున్న‌ సోనూసూద్.. కానీ ఇవి వారికి మాత్రమే

మోటో గుజ్జి వి7 మోటార్‌సైకిల్ ఆవిష్కరణ; సరికొత్త ఫీచర్లు, వివరాలు

కొత్త 2021 మోటో గుజ్జి వి7 మోటారుసైకిల్ మునుపటి తరం మోడల్ కంటే గణనీయమైన అప్‌గ్రేడ్స్‌ని కలిగి ఉంది. అలాగే, ఇంజన్ పరంగా కూడా ఇది మునుపటి మోడళ్ల కన్నా మరింత శక్తివంతమైనదిగా ఉంది. ఇది ఈ విభాగంలో కవాసాకి డబ్ల్యూ 800, బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి, ట్రయంప్ బోన్‌విల్ మరియు యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 900 వంటి మోడళ్లకు పోటీగా ఉంటుంది.

Most Read Articles

English summary
Moto Guzzi Has Officially Unveiled The All-new V7 Motorcycle. Now Comes With New Features and Improved Engine. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X