ఎస్ఎక్స్ఆర్ 160 మ్యాక్సీ-స్కూటర్ ఆవిష్కరించిన ఎప్రిలియా
ఇండియన్ మార్కెట్లో ఎప్రిలియా ఇటీవల కాలంలోనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని విడుదల చేసింది. ఇప్పుడు ఈ బ్రాండ్, మరో ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆవిష్కరించింది. కొత్తగా ఆవిష్కరించిన ఎప్రిలియా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఆటో ఎక్స్‌పో 2020 లో ఎప్రిలియా బ్రాండ్, ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఆవిష్కరించింది. దీని పేరే ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 మాక్సి-స్కూటర్.

భారతీయ మార్కెట్లో ఇటాలియన్ బ్రాండ్ నుండి వచ్చిన మొదటి మాక్సి-స్కూటర్ ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160. కొత్త అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 మాక్సి-స్కూటర్ అనేక కొత్త ఫీచర్లు, పరికరాలు మరియు స్ట్రైకింగ్ డిజైన్‌లతో వస్తుంది.

కొత్త ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ఫ్రంట్ ఆప్రాన్‌లో డ్యూయల్-హెడ్‌ల్యాంప్స్ యూనిట్లతో వస్తుంది. ఈ రెండూ ఇంటిగ్రేటెడ్ ఎల్ఇడి డిఆర్ఎల్ లను అందుకుంటాయి. ముందు భాగంలో పెద్ద విండ్‌స్క్రీన్ ఉంటుంది. ఇది డ్యూయల్-టోన్ రెడ్ అండ్ బ్లాక్ స్కీమ్‌తో వస్తుంది. ఇది రైడర్ కి సౌకర్యవంతమైన సీటింగ్‌తో పాటు సొగసైన ఎల్‌ఇడి టైల్లైట్‌లను కలిగి ఉంటుంది.

ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 లో ఫీచర్లను గమనించినట్లయితే ఇందులో స్టైలిష్ అల్లాయ్ వీల్స్, డిస్క్ బ్రేక్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద అండర్-సీట్ స్టోరేజ్ తో పాటు బిఎస్ 6-కంప్లైంట్ ఇంజన్ ఉన్నాయి.

కొత్త 160 సిసి మాక్సి-స్కూటర్ గురించి అధికారిక గణాంకాలను ఎప్రిలియా ఇంకా వెల్లడించలేదు. ఏప్రిల్ 2020 లో అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 కోసం బుకింగ్స్ ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఆటో ఎక్స్‌పో 2020 లో ఆవిష్కరించబడిన ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 మ్యాక్సీ-స్కూటర్ ఈ సంవత్సరం ఏప్రిల్ చివరి నాటికి భారతీయ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ఇండియన్ మార్కెట్లో ఒకసారి లాంచ్ అయినా తరువాత ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 మాక్సి-స్కూటర్, సుజుకి బర్గ్మాన్ స్ట్రీట్ మరియు హోండా గ్రాజియా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








