Just In
Don't Miss
- News
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు... డివిజన్ బెంచ్‌లో ముగిసిన విచారణ... తీర్పు రిజర్వ్..
- Sports
చారిత్రాత్మక విజయాన్నందుకున్న భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా!
- Movies
దీప్తి సునయన అలాంటిది కాదు.. నోయల్ సెన్సేషనల్ కామెంట్స్
- Lifestyle
ఈ హార్మోన్ల సమస్య ఉన్న మహిళలు బరువు తగ్గడం చాలా కష్టం...!
- Finance
Budget 2021: 10 ఏళ్లలో బడ్జెట్‌కు ముందు సూచీలు ఇలా, ఇన్వెస్టర్లకు హెచ్చరిక!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ ప్రారంభించిన బజాజ్
బజాజ్ ఆటో తమ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ బజాజ్ చేతక్‌ను జనవరి మధ్యలో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం పూనే మరియు బెంగళూరు నగరాల్లో మాత్రేమ అందుబాటులో ఉంది, దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.15 లక్షలుగా నిర్ణయించారు.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ మీద డెలివరీలు ప్రారంభ కావడంతో, బజాజ్ ప్రతినిధులు తొలి చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బెంగళూరులో ఫస్ట్ డెలివరీ ఇచ్చారు. బెంగళూరూలోని మేక్రి సర్కిల్ కెటిఎమ్ షోరూమ్‌లో కొత్త కస్టమర్లకు చేతక్ డెలివరీ చేశారు.

బ్లాక్ మరియు బ్లూ పెయింట్ స్కీమ్‌లో ఉన్న బజాజ్ చేతక్ టాప్ ఎండ్ "ప్రీమియం" వేరియంట్‌ను విక్రయించారు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ అర్బన్ మరియు ప్రీమియం అనే రెండు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. రెండులో ఒకే తరహా స్పెసిఫికేషన్స్ మరియు కాస్మొటిక్స్ పరంగా స్వల్ప తేడాలున్నాయి.

ప్యూర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రవేశపెట్టిన తొలి ఇండియన్ టూ వీలర్ల తయారీ కంపెనీగా బజాజ్ ఆటో నిలిచింది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ విపణిలో ఉన్న ఏథర్ 450ఎక్స్ మరియు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు సరాసరి పోటీనిస్తుంది.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో సాంకేతికంగా 4kW ఎలక్ట్రిక్ మోటార్ 3kWh సామర్థ్యం గల లిథియం-అయాన్ బ్యాటరీ అనుసంధానంతో లభిస్తుంది. ఇది సుమారుగా 16ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్‌తో ఇకో మోడ్‌లో 95కిమీలు మరియు స్పోర్ట్ మోడ్‌లో 85కిమీల మైలేజ్‌నిస్తుంది.

బజాజ్ కథనం మేరకు, చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 70కిమీలుగా ఉంది. చేతక్ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ అయ్యేందుకు నాలుగు నుండి ఐదు గంటల సమయం తీసుకుంటుంది. తొలి గంటలో 25శాతం ఛార్జింగ్ అవుతుంది.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూడటానికి సింపుల్, క్లీన్ మరియు ఎంతో నీట్‌గా ఉంటుంది. అనవసరం అనిపించే ఎలా హంగూఆర్భాటాలు లేవు. పాత కాలం నాటి చేతక్‌ను సూచించేలా మోడ్రన్ హంగులతో వచ్చింది. అయితే నూతన తరానికి కావాల్సిన అన్ని ముఖ్యమైన ఎలక్ట్రానిక్స్ మరియు ఫీచర్లను జోడించారు.

కనెక్టెడ్ టెక్నాలజీ ఫీచర్ అన్నింటిలోకెల్లా హైలెట్‌గా నిలిచింది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇండిగో మెటాలిక్, బ్రూక్లిన్ బ్లాక్, వెలుట్టో రోస్సో, సైబర్ వైట్, సిట్రస్ రష్ మరియు హజల్‌నట్ అనే విభిన్న రంగుల్లో ఎంచుకోవచ్చు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
1990ల కాలంలో బజాజ్ చేతక్ అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్, అయితే కాలక్రమేనా ఎదురైన పోటీని ఎదుర్కోలేక బజాజ్ చేతక్ ఉత్పత్తిని నిలిపివేశారు. అయితే, పేరుకు తగ్గట్లుగా దీని రాజసం ఇప్పటికీ తగ్గలేదు. దీంతో బజాజ్ ఆటో చేతక్ స్కూటర్‌ను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో, పాత డిజైన్ శైలిలో మరియు అత్యాధునిక ఫీచర్లతో రీలాంచ్ చేసింది. ఎట్టకేలకు కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. భవిష్యత్తులో మిగతా అన్ని మెట్రో నగరాల్లో అందుబాటులోకి తీసుకొస్తామని బజాజ్ తెలిపింది.