న్యూ బజాజ్ డామినర్ 250 టీజర్ వీడియో వచ్చేసింది.. విడుదల ఎప్పుడంటే?

బజాజ్ ఆటో సరికొత్త బజాజ్ డామిన్ 250 (D250) విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. అతి త్వరలో విడుదల కానున్న డామినర్ 250 మోటార్ సైకిల్ టీజర్ వీడియోను రిలీజ్ చేసింది. బజాజ్ డీలర్లు ఇప్పటికే డామినర్ 250 బైక్ మీద అనధికారికంగా బుకింగ్స్ కూడా ప్రారంభించారు.

న్యూ బజాజ్ డామినర్ 250 టీజర్ వీడియో వచ్చేసింది.. విడుదల ఎప్పుడంటే?

బజాజ్ విడుదల చేసిన టీజర్ వీడియో డామినర్ 250 బైకుని చూపించలేదు, అయితే అతి త్వరలోనే దీనిని మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు వీడియో ద్వారా ప్రకటించింది. బజాజ్ డీ250 మోడల్‌ను ఇప్పటికే పలుమార్లు అత్యంత రహస్యంగా ఇండియన్ రోడ్ల మీద పరీక్షించింది. డిజైన్ పరంగా చూడటానికి అచ్చం డామినర్ 400 తరహాలోనే ఉంటుంది.

బజాజ్ డామినర్ 250 ఇంజన్ విషయానికి వస్తే, కెటిఎమ్ 250 డ్యూక్ బైకులోని 249సీసీ కెపాసిటీ గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను అందిస్తున్నారు. కెటిఎమ్ భాగస్వామ్యంతో వచ్చిన హస్క్‌వర్నా ఇటీవల విడుదల చేసిన స్వార్ట్‌పిలెన్ మరియు విట్‌పిలెన్ బైకుల్లో కూడా ఇదే ఇంజన్ వచ్చింది.

న్యూ బజాజ్ డామినర్ 250 టీజర్ వీడియో వచ్చేసింది.. విడుదల ఎప్పుడంటే?

బజాజ్ ఆటో ఈ 250సీసీ మోటార్ సైకిల్‌ను డామినర్ పేరుతో లాంచ్ చేస్తున్నట్లు పేర్కొంది. అయితే కొంత మంది ఆటో ఇండస్ట్రీ నిపుణులు మాత్రమే దీనిని పల్సర్ సబ్-బ్రాండ్ పేరుతోనే తీసుకొస్తుందనే జోస్యం చెబుతున్నారు.

న్యూ బజాజ్ డామినర్ 250 టీజర్ వీడియో వచ్చేసింది.. విడుదల ఎప్పుడంటే?

డామినర్ 250 మరియు డామినర్ 400 రెండు మోడళ్లు కూడా డిజైన్ పరంగా ఒకేలా ఉంటాయి. కొలతల పరంగా డామినర్ 250 చూడటానికి కాస్త చిన్నదిగా ఉంటుంది. అదే విధంగా కొన్ని ఫీచర్లు ఇందులో మిస్సయ్యే ఛాన్స్ ఉంది.

న్యూ బజాజ్ డామినర్ 250 టీజర్ వీడియో వచ్చేసింది.. విడుదల ఎప్పుడంటే?

బజాజ్ సంస్థ డామిన్ 250 మోడల్‌ను అత్యంత పోటీత్వంతో కూడిన ధరతో లాంచ్ చేసే అవకాశం ఉంది. డామినర్ 400 కంటే దీని ధర చాలా తక్కువగా ఉంటుంది. డామినర్ 250 ధరల శ్రేణి రూ. 1.5 లక్షల నుండి రూ. 1.60 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌‌గా ఉండవచ్చు. డామినర్ 400 కంటే రూ. 32,000 వరకూ తక్కువగా ఉండవచ్చు.

న్యూ బజాజ్ డామినర్ 250 టీజర్ వీడియో వచ్చేసింది.. విడుదల ఎప్పుడంటే?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బజాజ్ డామినర్ 250 మోటార్ సైకిల్ మార్కెట్లో హైప్ క్రియేట్ చేస్తోంది. డామినర్ 400 కంటే దీనిని సేల్స్ అధికంగా ఉండే అవకాశం ఉంది. బజాజ్ డామినర్ 250 మోడల్ పూర్తి స్థాయిలో ఇండియన్ మార్కెట్లోకి విడుదలైతే, విపణిలో ఉన్న కెటిఎమ్ 250 డ్యూక్, హస్క్‌వర్నా సార్ట్‌పిలెన్ 250, విట్‌పిలెన్ 250, యమహా ఎఫ్‌జడ్ 25 మరియు సుజుకి జిక్సర్ 250 మోడళ్లకు సరాసరి పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
New Bajaj Dominar 250 Teaser Video Released Ahead Of Launch: Watch It Here! Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X