బజాజ్ డామినర్ 250 vs డామినర్ 400: రెండింట్లో ఏది బెస్ట్ బైక్?

బజాజ్ ఆటో ఇటీవల డామినర్ 250 స్మాలర్ ఇంజన్ వెర్షన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. సరికొత్త బజాజ్ డామినర్ 250 బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.60 లక్షలుగా ఉంది.

తొలి చూపులో బజాజ్ డామినర్ 250 బైక్ డామినర్ 400 బైకును సింపుల్‌గా వెనక్కినెట్టేస్తుంది. కానీ తీక్షణంగా గమనిస్తే రెండు బైకుల్లో పలు తేడాలు గమనించవచ్చు. మరి నిజంగా ఈ రెండింటి మధ్య ఉన్న అసలైన తేడాలు తెలుసుకోవాలని ఉందా..? అయితే ఇవాళ్టి డామినర్ 250 vs డామినర్ 400 కంపారిజిన్ స్టోరీ తప్పకుండా చదవాల్సిందే..

బజాజ్ డామినర్ 250 vs డామినర్ 400: రెండింట్లో ఏది బెస్ట్ బైక్?

డిజైన్

డిజైన్ పరంగా డామినర్ 250 మరియు డామినర్ 400 రెండు బైకులు దాదాపుగా ఒకేలా ఉంటాయి. బజాజ్ డామినర్ 250 పెద్ద ఇంజన్ కెపాసిటీతో లభించే డామినర్ 400 తరహాలో కండలు తిరిగిన రూపం, ఒకేతరహా ప్యానల్స్ మరియు డీకాల్స్ యధావిధిగా వచ్చాయి.

ఏదేమైనప్పటికీ ఇంజన్ పరంగా తక్కువ కెపాసిటీ ఉండటంతో, డామినర్ 250లో బాక్స్ ఆకారం తరహా స్వింగ్ ఆర్మ్, ఇరువైపులా పలుచటి టైర్లు వచ్చాయి.

బజాజ్ డామినర్ 250 vs డామినర్ 400: రెండింట్లో ఏది బెస్ట్ బైక్?

పోలిక పరంగా, బజాజ్ డామినర్ 400 బైకులో బీమ్-టైప్ స్వింగ్ ఆర్మ్ వచ్చింది. ముందు వైపున 110/70 R17 మరియు వెనుక వైపున 150/60 R17 కొలతలు గల టైర్లు ఉన్నాయి. డామినర్ 250లోని బ్లాక్ ఫినిషింగ్ అల్లాయ్ వీల్స్ తరహాలో ��ాకుండా డామినర్ 400లో డ్యూయల్ టోన్ స్టైలిష్ అల్లాయ్ వీల్స్ వచ్చాయి.

కలర్ విషయానికి వస్తే, బజాజ్ డామినర్ 250 బైక్ వైన్ బ్లాక్ మరియు కెనాన్ రెడ్ రంగుల్లో లభిస్తోంది. అయితే డామినర్ 400 వైన్ బ్లాక్ కలర్‌తో పాటు అరో గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో కూడా లభిస్తోంది.

బజాజ్ డామినర్ 250 vs డామినర్ 400: రెండింట్లో ఏది బెస్ట్ బైక్?

మీరు నమ్ముతారో నమ్మరో గానీ, డామినర్ 250 మరియు డామినర్ 400 కొలతలు పరంగా రెండూ ఒకేలా ఉంటాయి. పరిమాణం పరంగా రెండింటిలో తేడా లేదు. కొలతలు పరిశీలిస్తే, డామినర్ 250 బైక్ పొడవు 2156mm, వెడల్పు 836mm మరియు ఎత్తు 1112mm.

బజాజ్ డామినర్ 250 vs డామినర్ 400: రెండింట్లో ఏది బెస్ట్ బైక్?

సాంకేతికంగా అతి ముఖ్యమైన వీల్ బేస్ 1453mm మరియు 157mm గ్రౌండ్ క్లియరెన్స్ కూడా రెండు బైకుల్లో ఒకేలా ఉంది. మరి రెండింటి మధ్య ఉన్న అసలు తేడా ఏంటని అడిగితే బరువు ప్రధానమైన తేడా.. అవును, బజాజ్ డామినర్ 400 బరువు 184కిలోలు ఉండగా.. డామినర్ 250 బరువు సరిగ్గా నాలుగు కిలోలు తక్కువగా 180కిలోలుగా ఉంది.

రెండు బైకుల్లో ఫ్యూయల్ ట్యాంక్స్ చూడటానికి అచ్చం ఒకేలా ఉంటాయి. రెండింటిలో కూడా 13-లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం కలదు. డామినర్ 250 బైకులో ఇంజన్ సీసీ తక్కువగా ఉండటంతో డామినర్ 400 కంటే ఇది మెరుగైన మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది.

బజాజ్ డామినర్ 250 vs డామినర్ 400: రెండింట్లో ఏది బెస్ట్ బైక్?

ఇంజన్ వివరాలు

డామినర్ 400 మరియు డామినర్ 250 మధ్య అసలైన తేడా ఇక్కడే మొదలవుతుంది.. డామినర్ 250 బైకులో 248సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇంజన్ గరిష్టంగా 26బిహెచ్‌పి పవర్ మరియు 23.5ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బజాజ్ డామినర్ 250 vs డామినర్ 400: రెండింట్లో ఏది బెస్ట్ బైక్?

బజాజ్ డామినర్ 400 మరోవైపు... ఇందులో 373.3సీసీ కెపాసిటీ గల సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా బీఎస్4 ప్రమాణాలను పాటించే ఇంజన్ 39బిహెచ్‌పి పవర్ మరియు 35ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

తాజాగా సమాచారం మేరకు.. బజాజ్ డామినర్ 400 కోసం సరికొత్త బీఎస్6 ఇంజన్‌‌‌ను అభివృద్ది చేస్తున్నట్లు తెలిసింది. పవర్ మరియు టార్క్ దాదాపు ఒకేలా ఉంటాయని తెలుస్తోంది.

బజాజ్ డామినర్ 250 vs డామినర్ 400: రెండింట్లో ఏది బెస్ట్ బైక్?

ఫీచర్లు

డామినర్ 250 మరియు డామినర్ 400 రెండు బైకుల్లో దాదాపుగా ఒకే తరహా ఫీచర్లు ఉన్నాయి. స్ల్పిట్-డిజిటల్ డిస్ల్పే (ఒకటి ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మీద, మరొకటి ఫ్యూయల్ ట్యాంక్ మీద ఉంది), కండలు తిరిగిన ఆకారంలో ఉన్న బాడీ డీకాల్స్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్స్, రెండు వేర్వేరు సీట్లు మరియు ట్విన్-బ్యారెల్ ఎగ్జాస్ట్ పైపు వంటివి అదనపు ప్రత్యేకమైన ఫీచర్లుగా వచ్చాయి.

బజాజ్ డామినర్ 250 vs డామినర్ 400: రెండింట్లో ఏది బెస్ట్ బైక్?

సస్పెన్షన్ విషయానికి వస్తే రెండింటిలో వేర్వేరు సస్పెన్షన్ సిస్టమ్స్ ఉన్నాయి. డామినర్ 400 బైకులో ముందువైపున 43మీమీ అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున మోనో-షాక్ అబ్జార్వర్ కలదు.. బ్రేకింగ్ కోసం ముందు చక్రానికి 320మిమీ డిస్క్, వెనుక చక్రానికి 230మిమీ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. మెరుగైన బ్రేకింగ్ వ్యవస్థ కోసం డ్యూయల్-ఛానల్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను తప్పనిసరి ఫీచర్‌గా అందివ్వడం జరిగింది.

సరికొత్త బజాజ్ డామినర్ 250 విషయానికి వస్తే, ఇందులో 37మిమీ అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున మోనో-షాక్ అబ్జార్వర్ వచ్చింది. బ్రేకింగ్ కోసం ఫ్రంట్ వీల్‌కు 300మిమీ డిస్క్ బ్రేక్, వీల్‌కు 230మిమీ చుట్టుకొలత గల డిస్క్ బ్రేక్స్ మరియు ఇందులో కూడా మెరుగైన సేఫ్టీ కోసం డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ ఇందులో వచ్చింది.

బజాజ్ డామినర్ 250 vs డామినర్ 400: రెండింట్లో ఏది బెస్ట్ బైక్?

ధరలు

రెండింటి మధ్య తేడాలో మరో కీలకమైన అంశం.. ధర. డామినర్ 250 ధర రూ. 1.60 లక్షలుగా ఉంది, అయితే బీఎస్4 డామినర్ ధర రూ. 1.90 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఇదే వెర్షన్ బీఎస్6లో వస్తే ధర మరో 10 వేలు వరకూ పెరిగే ఛాన్స్ ఉంది.

బజాజ్ డామినర్ 250 vs డామినర్ 400: రెండింట్లో ఏది బెస్ట్ బైక్?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డామినర్ సిరీస్‌లో కొత్తగా వచ్చిన చేరిన మోడల్ డామినర్ 250. ఇది విపణిలో ఉన్న యమహా ఎఫ్‌జడ్25, కెటీఎమ్ 250 డ్యూక్ మరియు సుజుకి జిక్సర్ 250 మోడళ్లకు ధీటైన పోటీనిస్తుంది. డామినర్ 400 బైకును ధర కారణంగా ఎంచుకోలేని బైకర్లు డామినర్ 250 ఎంచుకోవచ్చు.

Most Read Articles

English summary
Bajaj Dominar 250 Vs Bajaj Dominar 400: Here Is A Brief Comparison Between The Siblings. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X