బెనెల్లీ కొత్త షోరూమ్, ఇప్పుడు తమిళనాడులో కూడా!

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎక్కువగా వ్యాప్తి చెందటం వల్ల మనదేశంలో కూడా కరోనా లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ కరోనా సమయంలో వాహన తయారీ సంస్థలు తీవ్రమైన నష్టాన్ని చవి చూశాయి, అయితే కరోనా లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసిన తర్వాత వాహన అమ్మకాలు మెల్లిమెల్లిగా పుంజుకుంటున్నాయి.

బెనెల్లీ కొత్త షోరూమ్, ఇప్పుడు తమిళనాడులో కూడా!

ప్రస్తుతం చాలా కంపెనీల యొక్క అమ్మకాలు మునుపటి స్థాయికి చేరుకున్నాయి.ఈ క్రమంలో కొత్త బైక్‌ను లాంచ్ చేసిన తర్వాత బెనెల్లి దేశవ్యాప్తంగా మంచి అమ్మకాలను పొందుతోంది. ఈ అమ్మకాలను మరింత పెంచడానికి బెనెల్లి తమిళనాడులోని త్రిచిలో కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది, ఇక్కడ కంపెనీ తన ప్రస్తుత మోడళ్ల అమ్మకాలను ప్రారంభించింది.

బెనెల్లీ కొత్త షోరూమ్, ఇప్పుడు తమిళనాడులో కూడా!

బెనెల్లి ఇంపీరియల్ 400 అమ్మకాలను పెంచడానికి కంపెనీ ఈ చర్య తీసుకుంటోంది. కంపెనీ యొక్క బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలతో ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతున్న ఏకైక మోటార్ సైకిల్ ఈ ఇంపీరియల్ 400 బైక్. ప్రస్తుతం కంపెనీ యొక్క ఈ మోడల్ యొక్క అమ్మకాలు బాగా సాగుతున్నాయి.

MOST READ:ఖరీదైన లగ్జరీ కార్ కొనుగోలు చేసిన బాలీవుడ్ భామ.. ఈ కార్ ధర ఎంతంటే ?

బెనెల్లీ కొత్త షోరూమ్, ఇప్పుడు తమిళనాడులో కూడా!

ఈ డీలర్‌షిప్‌లో బెనెల్లీ సర్వీస్ కూడా చేయవలసి ఉంది. కంపెనీ ఈ డీలర్షిప్ ద్వారా అమ్మకాలను ప్రారంభిస్తుంది. బెనెల్లీ గతేడాది చండీగర్ లో ఒక డీలర్‌షిప్‌ను ప్రారంభించింది, తరువాత తమిళనాడు సమీపంలోని పుదుచ్చేరిలో ఒక షోరూమ్ మరియు తరువాత గుజరాత్‌లోని వాపిలో కూడా డీలర్షిప్ ప్రారంభించింది.

బెనెల్లీ కొత్త షోరూమ్, ఇప్పుడు తమిళనాడులో కూడా!

బెనెల్లీ ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన ఇంపీరియల్ 400 యొక్క బిఎస్ 6 వేరియంట్ ను జూలైలో మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. దీనిని రూ. 1.99 లక్షలకు ధరతో లాంచ్ చేశారు. ఈ బైక్ కోసం రూ. 6000 చెల్లించి బుక్ చేసుకునే సదుపాయాన్ని కూడా కంపెనీ కల్పించింది.

MOST READ:బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌నే తుక్కు తుక్కు చేసిన టయోటా ఫార్చ్యూనర్ [వీడియో]

బెనెల్లీ కొత్త షోరూమ్, ఇప్పుడు తమిళనాడులో కూడా!

బెనెల్లి ఇంపీరియల్ 400 బైక్ లో 374 సిసి, సింగిల్ సిలిండర్ ఇంజన్ అమర్చబడింది. దీనికి కొత్త క్యాటలిటిక్ కన్వర్టర్ జోడించబడింది. ఈ ఇంజిన్ 21 బిహెచ్‌పి శక్తిని మరియు 29 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ కొత్త నవీనీకరణలను పొందిన తర్వాత గరిష్ట శక్తి 500 ఆర్‌పిఎమ్ వద్ద ఉంది.

బెనెల్లీ కొత్త షోరూమ్, ఇప్పుడు తమిళనాడులో కూడా!

బెనెల్లి ఇంపీరియల్ 400 బైక్ చాలా ఆకర్షణీయమైన క్లాసిక్ డిజైన్ కలిగి ఉంది. బెనెల్లి ఇంపీరియల్ 400 చాలా సింపుల్ గా ఉండటమే కాకుండా వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ కి క్లాసిక్ లుక్ ఇవ్వడానికి గుండ్రటి హెడ్‌ల్యాంప్స్ కలిగి ఉంది. ఈ బైక్‌లో ట్విన్ పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లు ఉన్నాయి.

MOST READ:నడిరోడ్డుపై జరిగిన ఈ సంఘటన చూస్తే ఒళ్ళు ఝల్లుమంటుంది.. కావాలంటే ఈ వీడియో చూడండి

బెనెల్లీ కొత్త షోరూమ్, ఇప్పుడు తమిళనాడులో కూడా!

బెనెల్లీ ఇంపీరియర్ 400 బైక్ యొక్క ఇంపీరియర్ సస్పెన్షన్ విషయానికి వస్తే, ఇందులో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జర్వర్‌ను ఏర్పాటు చేయబడి ఉంది. ఈ బైక్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే, ఇది డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లతో ఎబిఎస్‌ను కూడా పొందుతుంది. ఇంపీరియల్ 400 ముందు 19 ఇంచెస్ మరియు వెనుక వైపు 18 ఇంచెస్ టైర్లను కలిగి ఉంది.

బెనెల్లీ కొత్త షోరూమ్, ఇప్పుడు తమిళనాడులో కూడా!

భారత మార్కెట్లో బెనెల్లి ఇంపీరియల్ 400 బైక్, జావా మరియు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. బెనెల్లి ఇప్పుడు కొత్త డీలర్షిప్లను ఓపెన్ చేయడం వల్ల అమ్మకాలు మునుపటికంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా రానున్న కొత్త సంవత్సరంలో మంచి అమ్మకాలను చేపట్టడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

MOST READ:దీని ముందు టెస్లా కూడా దిగదుడుపేనండోయ్.. ఎందుకో చూడండి

Most Read Articles

English summary
Benelli Has Launched New Bike Dealership In Trichy. Read in Telugu.
Story first published: Wednesday, December 30, 2020, 17:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X