బిఎస్ 6 బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200.. చాలా కాస్ట్లీ గురూ!

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహనతయారీ సంస్థలలో బజాజ్ ఒకటి. బజాజ్ నుంచి విడుదలైన మోటార్ సైకిల్స్ అన్ని ఇండియన్ మార్కెట్లో గప్ప ప్రజాదరణ పొందాయి. ఇప్పుడు బజాజ్ కంపెనీ విఫణిలోకి కొత్త బిఎస్-6 బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ ని ప్రవేశపెట్టింది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

 బిఎస్ 6 పల్సర్ ఆర్ఎస్ 200.. చాలా కాస్ట్లీ గురూ!

బజాజ్ కంపెనీ విడుదల చేసిన బజాజ్ పల్సర్ ఆర్‌ఎస్ 200 బిఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తయారు చేయడం జరిగింది. బిఎస్-6 పల్సర్ మోటార్ సైకిల్స్ లో కొత్త నవీనీకరణలు ఎక్కువగా ఉండవు. ఇందులో ట్విన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఇడి టెయిల్ లాంప్, ఎల్‌ఇడి టర్న్ ఇండికేటర్స్ మరియు సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటివి ఉంటాయి.

 బిఎస్ 6 పల్సర్ ఆర్ఎస్ 200.. చాలా కాస్ట్లీ గురూ!

బజాజ్ పల్సర్ 9750 ఆర్‌పిఎమ్ వద్ద 24.5 బిహెచ్‌పి శక్తిని మరియు 8,000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 18.6 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ మునుపటి మాదిరిగానే ఉంటుంది. ఇది గంటకు 140.8 గంటలు గరిష్ట వేగాన్ని సాధించగలదు. బిఎస్-6 బజాజ్ పల్సర్ లో యాంత్రికపరమైన మార్పులు ఉంటాయి కానీ చూడటానికి బిఎస్-4 మోడల్ లాగ ఉంటుంది.

 బిఎస్ 6 పల్సర్ ఆర్ఎస్ 200.. చాలా కాస్ట్లీ గురూ!

బిఎస్-6 బజాజ్ పల్సర్ కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. త్వరలో బజాజ్ కంపెనీ ఈ బిఎస్-6 పల్సర్ ఆర్‌ఎస్ 200 డెలివరీ చేయనుంది.

 బిఎస్ 6 పల్సర్ ఆర్ఎస్ 200.. చాలా కాస్ట్లీ గురూ!

బజాజ్ యొక్క బిఎస్-6 పల్సర్ ధర దాదాపుగా రూ. 1.43 లక్షల వరకు ఉంటుంది. ఇది బిఎస్-4 మోడల్ కంటే 3000 రూపాయల ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. ఈ వరం చివరికల్లా మోటార్ సైకిల్స్ డీలర్షిప్ లను చేరుకునే అవకాశం ఉంది.

బిఎస్ 6 పల్సర్ ఆర్ఎస్ 200.. చాలా కాస్ట్లీ గురూ!

ప్రస్తుత బిఎస్-4 మోడల్‌ మూడు రంగు ఎంపికలలో లభిస్తుంది. అవి గ్రాఫైట్ బ్లాక్, రేసింగ్ బ్లూ మరియు రేసింగ్ రెడ్. కొత్తగా రాబోతున్న బిఎస్-6 మోడల్ పల్సర్ కూడా ఇదే రంగు ఎంపికలను కలిగి ఉండే అవకాశం ఉంటుంది.

బిఎస్ 6 పల్సర్ ఆర్ఎస్ 200.. చాలా కాస్ట్లీ గురూ!

కొత్త బిఎస్-6 బజాజ్ పల్సర్ లో బ్రేకింగ్స్ సిస్టమ్ ని గమనించినట్లైయితే 300 ఎంఎం ఫ్రంట్ డిస్క్ మరియు 230 ఎంఎం రియర్ డిస్క్ ఉంటుంది. ఇవి ట్యూబ్ లెస్ టైర్లతో కూడిన మోటార్ సైకిల్ రెండు వైపులా 17 అంగుళాల చక్రాలను కలిగి ఉంటాయి.

 బిఎస్ 6 పల్సర్ ఆర్ఎస్ 200.. చాలా కాస్ట్లీ గురూ!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బజాజ్ బిఎస్-6 వెర్షన్ మోటార్ సైకిల్ బిఎస్-4 కంటే కొంత ఎక్కువ ధరను కలిగి ఉన్నప్పటికీ, ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది వినియోదారుని అనుగుణంగా ఉండటమే కాకుండా మంచి డ్రైవింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది. బజాజ్ త్వరలో ఈ బైకులను డెలివరీ చేయనుంది.

Most Read Articles

English summary
BS6 Bajaj Pulsar RS200 costs only Rs 3,000 more than BS4 model. Read in telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X