భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 లాంచ్ ఖరారు - ఫీచర్లు, అంచనా ధర, వివరాలు

ఇటాలియన్ మోటార్‌సైకిల్‌ బ్రాండ్ డ్యుకాటి ఈ ఏడాది మరో సరికొత్త మోడల్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనుంది. గ్లోబల్ మార్కెట్లలో అత్యంత పాపులర్ అయిన 'డ్యుకాటి పానిగేల్ వి2' మోడల్‌ను ఈ ఆగస్టులో దేశీయ విపణిలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. డ్యుకాటి డీలర్లు ఇప్పటికే లక్ష రూపాయల అడ్వాన్స్‌తో ఈ మోడల్ కోసం బుకింగ్‌లను కూడా స్వీకరిస్తున్నారు.

భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 లాంచ్ ఖరారు - ఫీచర్లు, అంచనా ధర, వివరాలు

ప్రస్తుతం డ్యుకాటి అందిస్తున్న ఎంట్రీ లెవల్ సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్‌ 959 పానిగేల్ (ప్రస్తుతం రూ. 15.30 లక్షలు, ఎక్స్-షోరూమ్ ధరకు విక్రయించబడుతోంది) స్థానాన్ని రీప్లేస్ చేస్తూ కొత్త పానిగేల్ వి2 మోటార్‌సైకిల్‌ను ప్రవేశపెట్టనుంది.

భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 లాంచ్ ఖరారు - ఫీచర్లు, అంచనా ధర, వివరాలు

కొత్త డ్యుకాటి పానిగేల్ వి2 కొద్దిపాటి మార్పుల చేర్పులతో వస్తుంది, ఇది మోటార్‌సైకిల్‌‌కు మరింత ఆకర్షణను జోడిస్తుంది. ఈ మోటార్‌సైకిల్ స్టైలింగ్, ఫ్రంట్ ఫెయిరింగ్ మరియు సింగిల్ సైడ్ స్వింగార్మ్‌లను ట్రాక్ వెర్షన్ డ్యుకాటి పానిగేల్ వి4 నుండి స్పూర్తి పొంది డిజైన్ చేశారు.

MOST READ: సౌరవ్ గంగూలీ లగ్జరీ కార్స్, చూసారా..!

భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 లాంచ్ ఖరారు - ఫీచర్లు, అంచనా ధర, వివరాలు

ఈ మోటార్‌సైకిల్‌‌లో డ్యుకాటి బ్రాండ్ యొక్క సిగ్నేచర్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, ఎయిర్ డ్యామ్‌లు మరియు వి-ఆకారపు డే టైమ్ రన్నింగ్ లైట్లు ఉన్నాయి. దీని కొత్త ఫెయిరింగ్ నిర్మాణం మరింత సమర్థవంతమైన ఎయిర్ డ్యామ్‌లను కలిగి ఉండి, ఇంజన్‌ను కూల్ చేయటంలో సహకరిస్తుంది.

భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 లాంచ్ ఖరారు - ఫీచర్లు, అంచనా ధర, వివరాలు

డ్యుకాటి పానిగేల్ వి2 మోటార్‌సైకిల్‌లో 4.3 ఇంచ్ టిఎఫ్‌టి డిస్‌ప్లేతో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రెగ్యులర్ సీట్ కన్నా 20 మిమీ ఎక్కువ పొడవు ఉండే సీట్, అండర్ స్లంగ్ ఎగ్జాస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇందులో బ్రెంబో నుంచి గ్రహించిన ఎమ్4.32 మోనోబ్లోక్ కాలిపర్లు మరియు ముందు భాగంలో డ్యూయెల్ డిస్క్‌లతో బ్రెంబో మాస్టర్ సిలిండర్లు మరియు వెనుక భాగంలో ఒకే డిస్క్ బ్రేక్‌లను ఉపయోగించారు. ఇది డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తుంది.

MOST READ: నగరిలో అంబులెన్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్.కె రోజా

భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 లాంచ్ ఖరారు - ఫీచర్లు, అంచనా ధర, వివరాలు

ఈ మోటార్‌సైకిల్‌‌లో 955 సిసి సూపర్‌క్వాడ్రో ఎల్-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 155 బిహెచ్‌పి శక్తిని మరియు 104 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిక్స్ స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 లాంచ్ ఖరారు - ఫీచర్లు, అంచనా ధర, వివరాలు

డ్యుకాటి పానిగేల్ వి2లో ఉపయోగించిన దాదాపు మొత్తం ఎలక్ట్రానిక్స్ పరికరాలను 959 మోడల్ గ్రహించారు. మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు గాను ఇందులోని ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను రీవర్క్ చేశారు.

MOST READ: టెక్నికల్ గురూజీ లగ్జరీ కార్లు & బైక్‌లు, ఎలా ఉన్నాయో చూసారా ?

భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 లాంచ్ ఖరారు - ఫీచర్లు, అంచనా ధర, వివరాలు

పానిగేల్ వి సిరీస్‌లోని ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీలో ఎమ్‌యూ-అసిస్టెడ్ ట్రాక్షన్ కంట్రోల్ (డ్యుకాటి ట్రాక్షన్ కంట్రోల్ ఈవిఓ 2 అని పిలుస్తారు), వీలీ కంట్రోల్ మరియు కార్నరింగ్ ఏబిఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 లాంచ్ ఖరారు - ఫీచర్లు, అంచనా ధర, వివరాలు

డ్యుకాటి పానిగేల్ వి2 మోటార్‌సైకిల్‌ను పూర్తిగా విదేశాల్లో తయారు చేసి ఇండియన్ మార్కెట్‌కు దిగుమతి చేసుకుని విక్రయించే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో దీని ధర కూడా ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ అంచనా ప్రకారం, ఈ మోటార్‌సైకిల్‌ ధర సుమారు రూ.17 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకూ ఉండొచ్చని అంచనా.

MOST READ: మరోసారి వైరల్ అయిన మహేంద్ర సింగ్ ధోని వీడియో : అదేంటో తెలుసా !

భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 లాంచ్ ఖరారు - ఫీచర్లు, అంచనా ధర, వివరాలు

డ్యుకాటి పానిగేల్ వి2 భారత మార్కెట్లో విడుదలైతే ఇది ఈ సెగ్మెంట్లోని సుజుకి జిఎస్ఎక్స్-ఎస్ 1000ఎఫ్, అప్రిలియా ఆర్‌ఎస్‌వి4 ఆర్‌ఆర్, అప్రిలియా ఆర్‌ఎస్‌వి4 ఆర్‌ఎఫ్ మరియు కవాసకి నింజా హెచ్2 వంటి మోడళ్లతో పోటీ పడనుంది.

భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 లాంచ్ ఖరారు - ఫీచర్లు, అంచనా ధర, వివరాలు

ఈ ఇటాలియన్ బ్రాండ్ ఇటీవలే డ్యుకాటి పానిగేల్ వి2 వైట్ రోసో అనే స్పెషల్ వేరియంట్‌ను గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది. తెలుపు మరియు ఎరుపు పెయింట్ స్కీమ్‌తో రూపుదిద్దుకున్న ఈ వైట్ రోసో ఎడిషన్ రేస్ ట్రాక్ వెర్షన్ పానిగేల్‌ను తలపిస్తుంది. - ఈ మోడల్‌కు సంబంధించిన మరింత సమాచారం కోం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ: అందుబాటులోకి రానున్న టెస్లా స్మాల్ షార్ట్స్ ; చూసారా ?

భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 లాంచ్ ఖరారు - ఫీచర్లు, అంచనా ధర, వివరాలు

డ్యుకాటి పానిగేల్ వి2 ఇండియా లాంచ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఇది నిజంగా డ్యుకాటి అభిమానులకు శుభవార్తే! స్టైల్ అండ్ పెర్ఫార్మెన్స్ కలయికతో రూపొందిన డ్యుకాటి పానిగేల్ వి2 ఓ మంచి సాలిడ్ మోటార్‌సైకిల్. పెర్పార్మెన్స్ మోటార్‌సైకిల్ విభాగంలో విడుదల కానున్న డ్యుకాటి పానిగేల్ వి2 భారత మార్కెట్లో బ్రాండ్‌కు చక్కగా పనిచేస్తుందని మా అభిప్రాయం.

Most Read Articles

English summary
Italian motorcycle manufacturer, Ducati, has announced that it will launch the Panigale V2 in the Indian markets this August. Dealers have already started accepting bookings for an amount of Rs 1 lakh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X