Just In
- 10 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 12 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 13 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 13 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డ్యుకాటి స్క్రాంబ్లర్ 1100 ప్రో, స్పోర్ట్ ప్రో విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు
ఇటాలియన్ ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ డ్యుకాటి, దేశీయ విపణిలో మరో రెండు కొత్త మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. డ్యుకాటి తమ ఫ్లాగ్‌షిప్ మోడళ్లయిన స్క్రాంబ్లర్ 1100 ప్రో మరియు స్క్రాంబ్లర్ 1100 స్పోర్ట్ మోడళ్లను విడుదల చేసింది. భారత మార్కెట్లో వీటి ధరలు ఇలా ఉన్నాయి:
-> డ్యుకాటి స్క్రాంబ్లర్ 1100 ప్రో - రూ.11.95 లక్షలు
-> డ్యుకాటి స్క్రాంబ్లర్ 1100 స్పోర్ట్ ప్రో - రూ.13.74 లక్షలు
(అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, ఇండియా)

డ్యుకాటి స్క్రాంబ్లర్ 1100 ప్రో కొత్త డ్యూయెల్-టోన్ "ఓషన్ డ్రైవ్" లివరీ కలర్‌లో లభ్యం కానుండగా, స్క్రాంబ్లర్ 1100 స్పోర్ట్ ప్రో "మ్యాట్ బ్లాక్" కలర్‌లో లభ్యం కానుంది. ఢిల్లీలోని ఎన్‌సిఆర్, ముంబై, పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, కోల్‌కతా మరియు చెన్నై నగరాలలోని అన్ని డ్యుకాటి డీలర్‌షిప్‌లలో ఈ కొత్త మోడళ్ల కోసం బుకింగ్‌లను ప్రారంభించామని, డెలివరీలు కూడా తక్షణమే ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.

ఈ రెండు కొత్త మోటార్‌సైకిళ్ళు స్టాండర్డ్ స్క్రాంబ్లర్ 1100 మాదిరిగానే ఒకేరకమైన ఇంజన్ స్పెసిఫికేషన్లను కలిగి ఉంటాయి. ఇందులోని 1,079 సిసి, ఎల్-ట్విన్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7250 ఆర్‌పిఎమ్ వద్ద 83.5 బిహెచ్‌పి పవర్‌ను మరియు 4750 ఆర్‌పిఎమ్ వద్ద 90.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
MOST READ:గ్రేట్.. పిల్లాడిని రక్షించడానికి ఈ బైక్ రైడర్ ఏం చేసాడో చూడండి

ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులోని స్లిప్పర్ క్లచ్ వెట్ మల్టీ-ప్లేట్ రకం, ఇది హైడ్రాలిక్ కంట్రోల్ మరియు సర్వో-అసిస్టెడ్ స్లిప్పర్ ఫంక్షన్‌ను కలిగి ఉండి, డౌన్-షిఫ్టుల సమయంలో వెనుక చక్రం లాక్ కాకుండా చేయటంలో సహకరిస్తుంది.

డ్యుకాటి స్క్రాంబ్లర్ 1100 ప్రోలో అనేక ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ఏబిఎస్ మరియు మూడు రైడింగ్ మోడ్‌లు (యాక్టివ్, సిటీ మరియు జర్నీ) ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లన్నీ పాత మోడల్ నుండి తీసుకోబడ్డాయి.
MOST READ:ఫోర్డ్ ఎండీవర్ స్పోర్ట్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

కొత్త డ్యుకాటి స్క్రాంబ్లర్ 1100 ప్రో మోడల్స్ మునుపటి మోడల్‌తో పోలిస్తే అనేక మార్పులను కలిగి ఉంటుంది. ఇందులో మెరుగైన సీట్ మరియు రీపొజిషన్ చేసిన నెంబర్ ప్లేట్ హోల్డర్ ఉన్నాయి. కొత్త స్క్రాంబ్లర్ 1100 ప్రో హెడ్‌ల్యాంప్‌పై బ్లాక్ మెటల్ 'ఎక్స్' రూపంలో రెట్రో టచ్‌ను పొందుతుంది మరియు కుడి వైపున కొత్త డ్యూయెల్ టెయిల్ పైప్ కూడా ఉంటుంది.

ఈ మోటార్‌సైకిళ్ళు రెండూ కూడా ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడి టర్న్ ఇండికేటర్లను కలిగి ఉంటాయి. స్క్రాంబ్లర్ ప్రోతో పోల్చుకుంటే స్పోర్ట్ ప్రో వేరియంట్‌లో పలు డిజైన్ మార్పులు ఉంటాయి. స్పోర్ట్ ప్రోలో మార్జోచి ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపు కయాబా మోనో-షాక్ సస్పెన్షన్ వంటి ప్రీమియం హార్డ్‌వేర్ ఉంటుంది.
MOST READ:బెంగళూరులో టెస్లా రీసర్చ్ సెంటర్ ప్రారంభించనుందా.. అయితే ఇది చూడండి

స్క్రాంబ్లర్ 1100 స్పోర్ట్ ప్రో కొత్తగా పెయింట్ చేసిన 1100 లోగోతో పాటు కొత్త మ్యాట్ బ్లాక్ కలర్ స్కీమ్‌తో లభిస్తుంది. ఇది కేఫ్ రేసర్ స్టైల్ బార్-ఎండ్ మిర్రర్‌లతో లో-సెట్ హ్యాండిల్‌బార్‌ను కలిగి ఉంటుంది. రెండు మోడళ్లకు ముందు భాగంలో పీరెల్లి ఎమ్‌టి 60 ఆర్‌ఎస్ 120/80 జెడ్‌ఆర్ 18 టైర్ మరియు వెనుకవైపు 180/55 జెడ్‌ఆర్ 17 టైర్‌ను అమర్చారు, వీటిని స్క్రాంబ్లర్ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు.

డ్యుకాటి భారత మార్కెట్లో పానిగేల్ వి2 ను విడుదల చేసిన తర్వాత, ఈ బ్రాండ్ నుండి వస్తున్న కొత్త స్క్రాంబ్లర్ 1100 మోడల్ దేశంలో విక్రయించబడే రెండవ బిఎస్6 కంప్లైంట్ డ్యుకాటి మోటార్‌సైకిల్ అవుతుంది.
MOST READ:రోడ్ రోలర్‌గా మారిన టివిఎస్ బైక్ [వీడియో]

డ్యుకాటి స్క్రాంబ్లర్ 1100 ప్రో, 1100 స్పోర్ట్ ప్రో విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
డ్యుకాటి బ్రాండ్ లైనప్‌లో స్క్రాంబ్లర్ 1100 ప్రో మరియు స్పోర్ట్ ప్రో మోడళ్లు కంపెనీ నుండి లభ్యం కానున్న ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిళ్లు. కొత్త డిజైన్ మార్పుల కారణంగా స్క్రాంబ్లర్ మోటార్‌సైకిల్ మునుపటి కన్నా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇవి రెండూ భారత మార్కెట్లో విక్రయించే అత్యంత శక్తివంతమైన స్క్రాంబ్లర్ మోటార్‌సైకిళ్లలో ఒకటిగా కొనసాగనున్నాయి.