హోండా యాక్టివా 6 జి లో చేసిన పెద్ద మార్పులు ఏవంటే.. ?

హోండా యాక్టివా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్. ఇండియన్ మార్కెట్లో చాలా మంది వినియోగదారులను ఆకర్షించడమే కాకుండా వాహనదారునికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. హొండా యాక్టివా చాలా రోజులనుంచి ఇండియన్ మార్కెట్లో ఉంది. కానీ ఇది నిరంతర వినియోగదారులను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడు కొత్త హంగులను రూపుదిద్దుకొంటుంది.

హోండా యాక్టివా 6 జి లో చేసిన మార్పులు ఏవంటే.. ?

ఇటీవల కాలంలో బిఎస్-6 హోండా 6 జి ఇండియన్ మార్కెట్లో విడుదలయింది. కొత్తగా విడుదలయిన హోండా యాక్టివా బిఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుకూలంగా ఉంటుంది. హోండా యాక్టీవా స్కూటర్ లో బిఎస్-6 నిబంధనలకు అనుగుణంగా తయారు చేసినప్పుడు దీనికి చేసిన పెద్ద మార్పులు ఎలా ఉన్నాయో వీడియోలో చూడవచ్చు.

హోండా యాక్టివా 6 జి లో చేసిన మార్పులు ఏవంటే.. ?

బిఎస్-6 నిబంధనలకు అనుగుణంగా తయారు చేసిన ఈ హోండా యాక్టివా కొన్ని కొత్త మార్పులను కలిగి ఉంది. మనం వీడియోలో గమనించినట్లయితే ఈ కొత్త బిఎస్-6 స్కూటర్ లో చేసిన మొదటి మార్పు సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ. స్కూటర్ యొక్క గేర్ మెషింగ్, గేర్ ఎంగేజ్మెంట్ సౌండ్స్ తొలగించే ఎసిజి స్టార్టర్ మోటారు కూడా ఇందులో ఉంది.

హోండా యాక్టివా 6 జి లో చేసిన మార్పులు ఏవంటే.. ?

యాక్టివా యొక్క 6 జి వెర్షన్ లో ఇప్పుడు టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ వస్తుంది. ఇది స్కూటర్ యొక్క రైడింగ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా ఫ్రంట్ వీల్ ఇప్పుడు 12 అంగుళాల పరిమాణంలో ఉంది.

హోండా యాక్టివా 6 జి లో చేసిన మార్పులు ఏవంటే.. ?

బిఎస్-6 హోండా యాక్టీవా స్కూటర్ లో చేసిన మరో మార్పు ఇంజిన్ స్టార్ట్ స్టాప్ స్విచ్. ఇది మునుపటి వెర్షన్లో లేదు. యాక్టీవ 5 జి స్కూటర్ తో పోలిస్తే యాక్టీవ 6 జి చాలా అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

హోండా యాక్టివా 6 జి లో చేసిన మార్పులు ఏవంటే.. ?

కొత్త హోండా స్కూటర్ లో ఫ్యూయెల్ సిస్టం కూడా బాగా మార్పులకు లోనై ఉంది. ఇది మునుపటి మోడల్ కంటే కూడా 10 శాతం ఎక్కువ ఇంధన సామర్త్యాన్ని కలిగి ఉంటుందని చెప్పవచ్చు.

హోండా యాక్టివా 6 జి లో చేసిన మార్పులు ఏవంటే.. ?

బిఎస్-6 హోండా స్కూటర్ లో బిఎస్-6 కంప్లైంట్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8 బిహెచ్‌పి మరియు 9 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ విధంగా ఉండటం వల్ల ఇది మునుపటికంటే కూడా ఎక్కువ ఇంధన సామర్త్యాన్ని కలిగి ఉంటుంది.

హోండా యాక్టివా 6 జి లో చేసిన మార్పులు ఏవంటే.. ?

ఇందులో ఇతర నవీనీకరణలను ఒకసారి పరిశీలిస్తే ఇందులో ఆల్-మెటల్ బాడీ, లాంగ్ వీల్ బేస్, రివైజ్డ్ టెయిల్ లాంప్, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి కూడా కొంత కొత్త నవీనీకరణలను పొందాయి. కొత్త హోండా యాక్టివా 6 జి రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఒకటి స్టాండర్డ్ మరియు ట్రెండు డీలక్స్ వేరియంట్లు.

హోండా యాక్టివా 6 జి లో చేసిన మార్పులు ఏవంటే.. ?

హోండా 6 జి యొక్క రెండు వేరియంట్ల ధరలను పరిశీలిస్తే, స్టాండర్డ్ యాక్టీవా 6 జి ధర 63,412 (ఎక్స్-షోరూమ్) రూపాయలు, అదే విధంగా హొండా 6 జి డీలక్స్ వేరియంట్ ధర 64,912 (ఎక్స్-షోరూమ్) రూపాయలు.

భారతదేశంలో 2001 లో ప్రారంభించినప్పటి నుంచి అత్యధికంగా అమ్ముడైన స్కూటర్ హోండా యాక్టీవా. దీనిపై వినియోదారులకు ఉన్న అత్యంత విస్వాసం వల్ల ఇది మంచి అమ్మకాలను చేపడుతుంది. ఈ స్కూటర్ పురుషులకు మాత్రమే కాకుండా స్త్రీలకు కూడా ఉపయోగపడుతుంది.

హోండా యాక్టివా 6 జి లో చేసిన మార్పులు ఏవంటే.. ?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:

ఇండియన్ మార్కెట్లో విడుదలయినప్పటి నుంచి ఎక్కువ అమ్మకాలను చేపడుతున్న హోండా యాక్టీవా కొత్త బిఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుకూలంగా మార్చడం చేత మునుపటికంటే కూడా ఎక్కువ అమ్మకాలను చేపడుతుందని భావించవచ్చు. ఇది మునుపటి కంటే చాలా అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda Activa 6g: TVC details 6 BIG changes. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X