అధికారిక వెబ్ సైట్ నుంచి తొలగించబడిన హోండా మోటార్ సైకిల్స్, ఎందుకంటే..?

భారతప్రభుత్వ నిబంధనల ప్రకారం 2020 ఏప్రిల్ 1 నుంచి ఇండియన్ మార్కెట్లో బిఎస్ 4 వాహనాల యొక్క అమ్మకాలు నిలిపివేయాలి. చాలా కంపెనీలు తమ బ్రాండ్ వాహనాలకు గడువుకు ముందే బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారు చేశారు. కానీ కొన్ని కంపెనీలు కొన్ని అనివార్య కారణాల వల్ల తమ వాహనాలను బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారుచేయలేకపోయింది. ఈ కారణంగా తమ వాహనాలను నిలిపివాల్సిన పరిస్థితి నెలకొంది.

అధికారిక వెబ్ సైట్ నుంచి తొలగించబడిన హోండా మోటార్ సైకిల్స్, ఎందుకంటే.. ?

హోండా కంపెనీ హోండా సిబి హార్నెట్ 160 ఆర్, ఎక్స్‌బ్లేడ్ మరియు సిబిఆర్ 250 ఆర్ బైక్‌లను బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా నవీనీకరించలేదు. కాబట్టి కంపెనీ ఈ వాహనాలను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది.

అధికారిక వెబ్ సైట్ నుంచి తొలగించబడిన హోండా మోటార్ సైకిల్స్, ఎందుకంటే.. ?

బిఎస్ 6 కాలుష్య నియమానికి అనుగుణంగా హోండా సిబి హార్నెట్ 160 ఆర్ బైక్ అప్‌గ్రేడ్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. మిగిలిన రెండు మోడళ్లను నిలిపివేసే అవకాశం ఉంది. హోండా యొక్క సిబి హార్నెట్ 160 ఆర్ బైక్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటి. హోండా సిబి హార్నెట్ 160 ఆర్ భారత మార్కెట్లో ఎక్కువ సంఖ్యలో అమ్మకాలను కలిగి ఉంది.

MOST READ: అంబానీ యొక్క రోల్స్ రాయిస్ కార్స్ చూసారా..!

అధికారిక వెబ్ సైట్ నుంచి తొలగించబడిన హోండా మోటార్ సైకిల్స్, ఎందుకంటే.. ?

హొండా ఎక్స్‌బ్లేడ్ మరియు సిబిఆర్ 250 ఆర్ బైకులు రెండూ భారత మార్కెట్లో అంతగా అమ్ముడు కాలేదు. దీనివల్ల ఎక్స్‌బ్లేడ్ మరియు సిబిఆర్ 250 ఆర్ అనే రెండు మోడళ్లు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతే కాకుండా వీటిని బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా నవీనీకరించలేదు.

అధికారిక వెబ్ సైట్ నుంచి తొలగించబడిన హోండా మోటార్ సైకిల్స్, ఎందుకంటే.. ?

హోండా సిబిఆర్ 250 ఆర్ మొదటిసారి 2012 లో భారత మార్కెట్లో లాంచ్ అయింది. అప్పటి భారతీయ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించిన కవాసాకి నింజా 250 ఆర్ బైక్‌తో పోటీ పడటానికి హోండా మోటార్‌సైకిల్ కంపెనీ ఈ బైక్‌ను విడుదల చేసింది.

MOST READ: భారతదేశంలో అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 10 కార్లు ఇవే

అధికారిక వెబ్ సైట్ నుంచి తొలగించబడిన హోండా మోటార్ సైకిల్స్, ఎందుకంటే.. ?

హోండా సిబిఆర్ 250 ఆర్ బైక్‌లో 249 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 269 బిహెచ్‌పి శక్తిని మరియు 22.9 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

అధికారిక వెబ్ సైట్ నుంచి తొలగించబడిన హోండా మోటార్ సైకిల్స్, ఎందుకంటే.. ?

హోండా మోటార్‌సైకిల్ ఇప్పటికే తన ప్రధాన ద్విచక్ర వాహనాలను కొత్త ఇంజిన్‌తో అప్‌గ్రేడ్ చేసింది. కానీ ఏవియేటర్ మరియు గ్రాజియా స్కూటర్లలో కొత్త ఇంజిన్‌ను ఇంకా ప్రవేశపెట్టలేదు. ఈ స్కూటర్లను కూడా బిఎస్ 6 ప్రమాణాలకు అనుకూలంగా నవీనీకరించనట్లైతే వీటిని కూడా నిలిపివేసే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇప్పుడు హోండా తన అధికారిక వెబ్‌సైట్‌లో ఏవియేటర్ మరియు గ్రాజియాతో సహా రెండు స్కూటర్ల ఉత్పత్తులను నిలిపివేసింది.

MOST READ: త్వరలో ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టనున్న బజాజ్ - కెటిఎమ్ ఎలక్ట్రిక్ స్కూటర్, చూసారా.. !

Most Read Articles

English summary
Honda CB Hornet, Xblade, CBR250R removed from official website. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X