భారత్‌లో వచ్చే ఏడాది హోండా సిబిఆర్650ఆర్ విడుదల - వివరాలు

భారత మార్కెట్లో ప్రీమియం మోటార్‌సైకిళ్లకు క్రమక్రంగా డిమాండ్ జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలో, జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా, ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించిన తమ సరికొత్త 2021 సిబిఆర్650ఆర్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో కూడా విడుదల చేయాలని చూస్తోంది.

భారత్‌లో వచ్చే ఏడాది హోండా సిబిఆర్650ఆర్ విడుదల - వివరాలు

కొత్త 2021 హోండా సిబిఆర్605ఆర్ మోటార్‌సైకిల్ ఇప్పుడు మరింత క్లీన్ మరియు శక్తివంతమైన బిఎస్6 ఇంజన్‌‌ను కలిగి ఉంటుంది. అలాగే, ఇందులోని కొన్ని ఫీచర్లను కూడా అప్‌గ్రేడ్ చేశారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో హోండా తమ కొత్త 2021 సిబిఆర్650ఆర్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

భారత్‌లో వచ్చే ఏడాది హోండా సిబిఆర్650ఆర్ విడుదల - వివరాలు

ఈ కొత్త బిఎస్6 మోటార్‌సైకిల్ ఇప్పుడు మరింత షార్ప్ డిజైన్‌ను కలిగి ఉంటుంది, ఇందుకు ప్రధాన కారణం దీనిలో రీడిజైన్ చేయబడిన హెడ్‌ల్యాంప్ యూనిట్ మరియు కొత్త సైడ్ ఫెయిరింగ్‌లుగా చెప్పుకోవచ్చు. పాత మోడల్‌తో పోలిస్తే కొత్త సిబిఆర్650ఆర్ మోటార్‌సైకిల్‌కు మరింత స్పోర్టీయర్ ఛాస్సిస్ కూడా లభిస్తుంది.

MOST READ: అక్టోబర్ 8న ఎమ్‌జి గ్లోస్టర్ విడుదల: అంచనా ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

భారత్‌లో వచ్చే ఏడాది హోండా సిబిఆర్650ఆర్ విడుదల - వివరాలు

ఈ మోటార్‌సైకిల్ ముందు భాగంలో, ఇప్పుడు కొత్తగా 41 మిమీ షోయా స్పెషల్ ఫంక్షన్ బిగ్ పిస్టన్‌తో కూడిన అప్‌సైడ్ డౌన్ ఫోర్క్‌లు ఉంటాయి. అలాగే వెనుక వైపున ప్రో-లింక్ మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 310 మిమీ డ్యూయెల్ డిస్క్‌లు మరియు వెనుక భాగంలో 240 మిమీ రియర్ డిస్క్ బ్రేక్ ఉంటాయి.

భారత్‌లో వచ్చే ఏడాది హోండా సిబిఆర్650ఆర్ విడుదల - వివరాలు

ఇంజన్ విషయానికి వస్తే, ఇందులోని 649సిసి ఇన్‌లైన్ ఫోర్-సిలిండర్ బిఎస్6 కంప్లైంట్ ఇంజన్ ఇసియు, కామ్ లోబ్స్, ఇంటెక్ టైమింగ్, ఎగ్జాస్ట్ సిస్టమ్ మరియు క్రాంక్ షాఫ్ట్ కూడా పొందుతుంది. ఈ ఇంజన్ ఇప్పుడు గరిష్టంగా 12,000 ఆర్‌పిఎమ్ వద్ద 94 బిహెచ్‌పి పవర్‌ను మరియు 8500 ఆర్‌పిఎమ్ వద్ద 63 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ: టాటా హారియర్ డార్క్ ఎడిషన్‌లో కొత్త వేరియంట్స్ విడుదల; ధర, వివరాలు

భారత్‌లో వచ్చే ఏడాది హోండా సిబిఆర్650ఆర్ విడుదల - వివరాలు

అయితే, భారతదేశంలో విక్రయించిన ఇదివరకటి హోండా సిబిఆర్650ఆర్ బిఎస్4 వేరియంట్ గరిష్టంగా 86 బిహెచ్‌పిల పవర్‌ను మరియు 60 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేసేది. ఈ ఇంజన్ స్లిప్ అసిస్ట్ క్లచ్‌తో సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్‌లో స్విచ్ చేయగల హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ కూడా ఉంటుంది.

భారత్‌లో వచ్చే ఏడాది హోండా సిబిఆర్650ఆర్ విడుదల - వివరాలు

హోండా సిబిఆర్650ఆర్ మోడల్‌లోని ఏడు అంగుళాల ఎల్‌సిడి యూనిట్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా రైడర్‌ అనేక రకాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా, ఈ మోటార్‌సైకిల్‌లో సేఫ్టీ ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ మరింత మెరుగుపరచబడింది. ఇది సమీపంలో ఉన్న మరియు రాబోయే వాహనాలను హెచ్చరించడానికి ఆకస్మిక హార్డ్ బ్రేకింగ్‌ను యాక్టివేట్ చేస్తుంది. ఈ మోటార్‌సైకిల్‌లో స్టాండర్డ్ డ్యూయెల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది.

MOST READ: రెనో కార్లపై రూ.70,000 డిస్కౌంట్స్; ఏయే మోడల్‌పై ఎంతో తెలుసా?

భారత్‌లో వచ్చే ఏడాది హోండా సిబిఆర్650ఆర్ విడుదల - వివరాలు

భారత్‌లో హోండా సిబిఆర్650ఆర్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొత్త 2021 హోండా సిబిఆర్650ఆర్ మునుపటి తరం మోడల్ కంటే చాలా సన్నగా మరియు షార్ప్‌గా కనిపిస్తుంది. మార్కెట్లో దీని ధర రూ.7.5 లక్షల నుండి రూ.8.5 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా. మార్కెట్లో విడుదలైతే ఇది కవాసాకి నింజా 650 మరియు రాబోయే బెనెల్లి 600ఆర్ఆర్ వంటి మోడళ్లకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది.

Most Read Articles

English summary
Honda has globally revealed the 2021 CBR650R. This time around the CBR650R gets a more powerful BS6 engine with feature and mechanical updates. However, the company is expected to launch the BS6 CBR650R sometime during the first quarter of 2021 in the Indian market. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X