ఇండియాలో క్లిక్ స్కూటర్ ఉత్పత్తులను నిలిపివేసిన హోండా, ఎందుకంటే..?

హోండా తన బ్రాండ్ అయిన క్లిక్ స్కూటర్‌ను అధికారికంగా నిలిపివేసింది. ఈ హొండా క్లిక్ స్కూటర్ బిఎస్ 6 కాలుష్య నియమాలకు అనుగుణంగా నవీనీకరించలేదు. హోండా క్లిక్ స్కూటర్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

ఇండియాలో క్లిక్ స్కూటర్ ఉత్పత్తులను నిలిపివేసిన హోండా, ఎందుకంటే..?

హోండా గత సంవత్సరం క్లిక్ స్కూటర్‌ను నిలిపివేస్తామని ప్రకటించింది. బిఎస్ 6 కాలుష్య నియమాలకు అనుగుణంగా హోండా క్లిక్ స్కూటర్‌ను అప్‌గ్రేడ్ చేయదని కంపెనీ కూడా అధికారికంగా తెలిపింది. అంతే కాకుండా ఈ స్కూటర్ పేరు వెబ్‌సైట్ నుండి తొలగించబడింది. క్లిక్ స్కూటర్ యొక్క మిగిలిన యూనిట్లను విక్రయించడానికి హోండా ప్రయత్నాలను కొనసాగిస్తోంది.

ఇండియాలో క్లిక్ స్కూటర్ ఉత్పత్తులను నిలిపివేసిన హోండా, ఎందుకంటే..?

భారతీయ మార్కెట్లో హోండా క్లిక్ స్కూటర్ కి డిమాండ్ బాగా తగ్గింది. హోండా క్లిక్ స్కూటర్ అమ్మకాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఈ కారణాల వల్ల క్లిక్ స్కూటర్‌ను నిలిపివేయాలని హోండా నిర్ణయించింది.

MOST READ: టోల్ ఆపరేటర్లకు జరిగిన నష్టాన్ని భరించనున్న నేషనల్ హైవే అథారిటీ

ఇండియాలో క్లిక్ స్కూటర్ ఉత్పత్తులను నిలిపివేసిన హోండా, ఎందుకంటే..?

హోండా క్లిక్ దేశీయ మార్కెట్లో ఎంట్రీ లెవల్ స్కూటర్. హోండా కంపెనీ యొక్క ఉత్పత్తులయిన డియో మరియు యాక్టివా స్కూటర్లు బాగా అమ్ముడవుతుంటే, కస్టమర్లను ఆకర్షించడంలో క్లిక్ స్కూటర్ మాత్రం విఫలమైంది.

ఇండియాలో క్లిక్ స్కూటర్ ఉత్పత్తులను నిలిపివేసిన హోండా, ఎందుకంటే..?

హోండా క్లిక్ స్కూటర్ లో 109.19 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 8 బిహెచ్‌పి పవర్ మరియు 8.94 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. హోండా కంపెనీ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారు చేయని వాహనాలను వెబ్‌సైట్ నుండి తొలగించింది.

MOST READ: భారత్‌లో నిలిపివేయబడిన టీవీఎస్ జుపిటర్ గ్రాండే స్కూటర్, ఎందుకో తెలుసా..?

ఇండియాలో క్లిక్ స్కూటర్ ఉత్పత్తులను నిలిపివేసిన హోండా, ఎందుకంటే..?

హోండా వెబ్‌సైట్‌లో జాబితా చేయబడిన మిగిలిన మోడళ్లు ఇప్పటికే బిఎస్ 6 కాలుష్య నియమాలకు అనుగుణంగా నవీకరించబడ్డాయి. హోండా ఆక్టా 125 స్కూటర్ ని కంపెనీ నియమిత గడువుకు ముందే బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయడం జరిగింది. భారతీయ మార్కెట్లో మొట్ట మొదటి బిఎస్ 6 ద్విచక్ర వాహన తయారీదారుగా ప్రసిద్ధి చెందింది.

ఇండియాలో క్లిక్ స్కూటర్ ఉత్పత్తులను నిలిపివేసిన హోండా, ఎందుకంటే..?

హోండా సిబి హార్నెట్ 160 ఆర్, ఎక్స్‌బ్లేడ్ మరియు సిబిఆర్ 250 ఆర్ బైక్‌లను కూడా హోండా అధికారిక వెబ్‌సైట్ నుండి తొలగించారు. బిఎస్ 6 కాలుష్య నియమానికి అనుగుణంగా హోండా సిబి హార్నెట్ 160 ఆర్ బైక్ అప్‌గ్రేడ్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. మిగిలిన రెండు మోడళ్లను నిలిపివేసే అవకాశం ఉంది.

MOST READ: లాక్‌డౌన్‌ లో కర్ఫ్యూ పాస్ పొందాలనుకుంటున్నారా, అయితే ఇలా చేయండి

ఇండియాలో క్లిక్ స్కూటర్ ఉత్పత్తులను నిలిపివేసిన హోండా, ఎందుకంటే..?

హోండా యునికార్న్, సిబి షైన్ బైక్‌లు మరియు యాక్టివా 6 జి మరియు డియో స్కూటర్లను బిఎస్ -6 కాలుష్య నిబంధనలకు అనుగుణంగా అప్డేట్ చేయబడ్డాయి. అమ్ముడుపోని బిఎస్ 4 బైక్‌లను డీలర్ల నుంచి తిరిగి తీసుకుంటామని హోండా కంపెనీ తెలిపింది.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda Cliq Officially Discontinued In India. Read in Telugu.
Story first published: Thursday, April 16, 2020, 13:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X