భారత్‌లో హోండా హార్నెట్ 2.0 విడుదల - ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్‌ఎమ్ఎస్‌ఐ) భారత మార్కెట్లో మరో కొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. సరికొత్త "హోండా హార్నెట్ 2.0" (టూ పాయింట్ ఓ) మోడల్‌ను కంపెనీ విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ కొత్త మోడల్ ధర రూ.1.26 లక్షలు (ఎక్స్-షోరూమ్, గుర్గావ్)గా ఉంది.

భారత్‌లో హోండా హార్నెట్ 2.0 విడుదల - ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

కొత్త హోండా హార్నెట్ 2.0 కోసం కంపెనీ బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. సెప్టెంబర్ మొదటి వారం నుండే ఈ మోడల్ డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయి. ఇదివరకు కంపెనీ విక్రయించిన హోండా సిబి హార్నెట్ 160ఆర్ స్థానాన్ని ఈ కొత్త హార్నెట్ 2.0 రీప్లేస్ చేయనుంది.

భారత్‌లో హోండా హార్నెట్ 2.0 విడుదల - ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

హోండా హార్నెట్ 160ఆర్ మోడల్ ఇంకా బిఎస్6కి అనుగుణంగా అప్‌డేట్ కాలేదు, ఈ నేపథ్యంలో కంపెనీ ఈ మోడల్‌ను మార్కెట్ నుండి నిలిపివేసింది. హార్నెట్ 2.0 విడుదలతో కంపెనీ కొత్తగా 180-200సీసీ మోటార్‌సైకిల్ విభాగంలోకి ప్రవేశించింది.

MOST READ: భారత్‌లో ఆడి ఆర్ఎస్ క్యూ8 విడుదల, ధర తెలిస్తే షాక్ అవుతారు!

భారత్‌లో హోండా హార్నెట్ 2.0 విడుదల - ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

హోండా హార్నెట్ 2.0 మోటార్‌సైకిల్‌లో పిజిఎమ్-ఫై టెక్నాలజీతో తయారు చేసిన కొత్త బిఎస్6 కంప్లైంట్ 184సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8500 ఆర్‌పిఎమ్ వద్ద 17 బిహెచ్‌పి పవర్‌ను మరియు 6000 ఆర్‌పిఎమ్ వద్ద 16.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

భారత్‌లో హోండా హార్నెట్ 2.0 విడుదల - ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఈ మోటార్‌సైకిల్‌లోని పరికరాల విషయానికి వస్తే, ముందు భాగంలో తలక్రిందులుగా ఉండే అప్‌సైడ్ డౌన్ ఫోర్కులు (గోల్డ్ కలర్‌లో ఫినిష్ చేయబడి ఉంటాయి) మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 276 మిమీ డిస్క్ మరియు వెనుక భాగంలో 220 మిమీ డిస్క్‌లు ఉంటాయి, ఇవి సింగిల్-ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి.

MOST READ: కొత్త 2020 హోండా జాజ్ విడుదల - ధర, ఫీచర్లు, మార్పులు, వివరాలు

భారత్‌లో హోండా హార్నెట్ 2.0 విడుదల - ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

కొత్త 2020 హోండా హార్నెట్ 2.0 ముందు వైపు 110/70 మరియు వెనుక వైపు 140/70 టైర్ ప్రొఫైల్‌లతో కూడిన 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. కొత్త హోండా హార్నెట్ 2.0 అనేక ఫీచర్లు మరియు పరికరాలతో నిండి ఉండి, ఈ విభాగంలో చాలా ఆకర్షణీయమైన మోటార్‌సైకిల్‌గా నిలుస్తుంది.

భారత్‌లో హోండా హార్నెట్ 2.0 విడుదల - ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

స్పోర్టీ డిజైన్, అగ్రెసివ్ క్రీజ్ లైన్స్, స్టైలిష్ బాడీ కాంటౌర్స్ మరియు గ్రాఫిక్స్‌తో ఇది చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. హార్నెట్ 2.0లో షార్ట్ మఫ్లర్, కొత్త అల్లాయ్ వీల్స్ డిజైన్, అల్లాయ్ ఫుట్‌పెగ్స్, ఇంజన్ స్టాప్ స్విచ్, హజార్డ్ లైట్స్, ఆల్ రౌండ్ ఎల్‌ఈడి లైటింగ్ (ఎక్స్-ఆకారపు హెడ్‌ల్యాంప్, టెయిల్ లైట్స్ మరియు టర్న్ ఇండికేటర్స్) మరియు పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ: భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

భారత్‌లో హోండా హార్నెట్ 2.0 విడుదల - ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

కొత్త హోండా హార్నెట్ 2.0 మొత్తం నాలుగు రంగులలో లభిస్తుంది. అవి - పెరల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ సాంగ్రియా రెడ్ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ మరియు మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్.

భారత్‌లో హోండా హార్నెట్ 2.0 విడుదల - ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

హార్నెట్ 2.0 మోటార్‌సైకిల్‌ను మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా హెచ్ఎంఎస్ఐ ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ మరియు సీఈఓ అట్సుషి ఒగాటా మాట్లాడుతూ, "కొత్త యుగం కస్టమర్ల కలలు మరియు స్వారీ పట్ల వారి అభిరుచి నుండి ప్రేరణ పొంది రూపొందించిన ఈ సరికొత్త హోండా హార్నెట్ 2.0ను పరిచయం చేయడం మాకు సంతోషంగా ఉందని" అన్నారు.

MOST READ: స్కొడా ఎన్యాక్ ఐవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇంటీరియర్ స్కెచెస్ విడుదల

భారత్‌లో హోండా హార్నెట్ 2.0 విడుదల - ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

"కొత్త హార్నెట్ 2.0 దాని అధునాతన టెక్నాలజీ మరియు థ్రిల్లింగ్ పనితీరుతో యువ మోటార్‌సైకిల్ ఔత్సాహికులలో ఓ కొత్త బెంచ్ మార్కును సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఇది భారతదేశంలో విస్తృత శ్రేణి వినియోగదారులకు ఉపయోగపడేలా, హోండా యొక్క కొత్త యుగం పోర్ట్‌ఫోలియో విస్తరణకు సహకరిస్తుందని" ఆయన అన్నారు.

భారత్‌లో హోండా హార్నెట్ 2.0 విడుదల - ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

హోండా హార్నెట్ 2.0 విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత ద్విచక్ర వాహన మార్కెట్‌లోని 180 - 200 సిసి మోటారుసైకిల్ విభాగంలో హార్నెట్ 2.0 హోండాకు తొలి మోడల్ కావటం విశేషం. హోండా నుండి వచ్చిన ఈ లెటేస్ట్ నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ మోడల్ ఆకర్షణీయమైన ధరతో అదే సమయంలో అత్యంత స్పోర్టీ డిజైన్‌తో లభిస్తుంది. ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో వచ్చిన హోండా హార్నెట్ 2.0 ఈ విభాగంలో బజాజ్ పల్సర్ 180, టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Honda Motorcycles & Scooters India (HMSI) has launched their new Hornet 2.0 motorcycle in the Indian market. The new Honda Hornet 2.0 is offered with a price tag of Rs 1.26 lakh, ex-showroom (Gurugram). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X