Just In
- 37 min ago
దేశంలోనే అతిపెద్ద మల్టీ-బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్‌ను ఓపెన్ చేసిన బాష్
- 1 hr ago
టీవీఎస్ ఎక్స్ఎల్ 100 విన్నర్ ఎడిషన్ లాంచ్ : ధర & వివరాలు
- 15 hrs ago
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- 16 hrs ago
షాకింగ్.. భారతదేశంలో ఉత్పత్తిని నిలిపివేసిన ఫోర్డ్, కారణం అదేనా?
Don't Miss
- News
గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తా .. టచ్ చేసి చూడు .. కొడాలి నానికి దేవినేని ఉమ సవాల్
- Sports
మ్యాచ్‌కే హైలైట్! స్టార్క్ షార్ట్ పిచ్ బంతికి.. గిల్ ఎలా సమాధానం ఇచ్చాడో చూడండి వీడియో
- Movies
Master box office: 6వ రోజు కూడా పవర్ఫుల్ కలెక్షన్స్.. విజయ్ మరో బిగ్గెస్ట్ రికార్డ్
- Lifestyle
ప్రతి రాశిచక్రం వారి చింతలను ఎలా నిర్వహించాలో తెలుసా? భాదల నుండి ఇలా భయటపడాలి
- Finance
మారుతీ సుజుకీ కార్ల ధరల షాక్, కార్లపై రూ.34,000 వరకు పెంపు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ద్విచక్ర వాహనాల అమ్మకాలలో కొత్త రికార్డ్ కైవసం చేసుకున్న తెలంగాణ
భారతదేశంలో ప్రముఖ వాహనతయారీదారుగా ప్రసిద్ధి చెందిన హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఇటీవల తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో దాదాపు 25 లక్షల యూనిట్ల అమ్మకాలను చేపట్టినట్లు ప్రకటించింది. కేవలం ఈ ఏడాది 2020 ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య మొత్తం 1 లక్ష స్కూటర్లు అమ్ముడయ్యాయని కంపెనీ ప్రకటించింది.

ఈ ఏడాది కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపించింది. ఈ కారణంగా దాదాపు అన్నాయి వాహన కంపెనీలు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. కరోనా వైరస్ ప్రబలంగా ఉన్న సమయంలో కూడా కంపెనీ గొప్ప సవాళ్ళను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రంలో అమ్మకాల పరంగా ఒక కొత్త మైలురాయిని చేరుకొని రికార్డుని సృష్టించింది.

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా నివేదిక ప్రకారం, తెలంగాణ ద్విచక్ర వాహన పరిశ్రమలో స్కూటర్ల సహకారం 33 శాతం పెరిగింది. భారతదేశంలోని మొత్తం అమ్మకాలతో పోలిస్తే ఇది దాదాపు 29 శాతం. తెలంగాణలో స్కూటర్ సెగ్మెంట్ మార్కెట్లో హోండాకు దాదాపు 72 శాతం వాటా ఉంది.
MOST READ:రూ. 41,500 జరిమానాతో సీజ్ చేయబడిన డ్యాన్స్ స్కార్పియో ; కారణం ఏంటో తెలుసుకోండి

తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా అమ్ముడైన మోడల్ 'హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా' బ్రాండ్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన యాక్టివా మోడల్. కంపెనీ ప్రకటించిన విధంగా హోండా యాక్టివా రాష్ట్రంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ద్విచక్ర వాహనమని హోండా తెలిపింది.

హోండా కంపెనీ రాష్ట్రంలో మొదటి 10 లక్షల కస్టమర్లను చేరుకోవడానికి దాదాపు 14 సంవత్సరాల కాలం పట్టింది. అయితే తర్వాత కేవలం ఆరు సంవత్సరాల కాలంలో 15 లక్షల మంది వినియోగదారులను చేర్చారు. కస్టమర్ టచ్ పాయింట్లను ఎక్కువగా పెంచడం ద్వారా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తన ఉనికిని చాటుకోగలిగింది. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో హోండా 430 కి పైగా టచ్ పాయింట్లను కలిగి ఉంది.
MOST READ:మీ ఫాస్ట్‌ట్యాగ్‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవాలా? అయితే ఇలా చేయండి!

దీని గురించి హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యాద్వీందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ, గత 5-6 సంవత్సరాల్లో తెలంగాణ ప్రాంతంలో యాక్టివాని ఎక్కువగా విస్తరించడం వల్ల ఎక్కువ అమ్మకాలను చేపట్టగలిగాము.

హోండా డియో మరియు హార్నెట్ 2.0 యొక్క యాక్టివా 20 వ యానివెర్సరీ ఎడిషన్ & రెప్సోల్ రేస్ ఎడిషన్స్ వంటి కొత్త మోడల్స్ లాంచ్ చేయడం ద్వారా మరింత ఎక్కువమంది కస్టమర్లను ఆకర్షించడానికి చాలా ఉపయోగకరంగా ఉంది. రాబోయే కొత్త సంవత్సరం 2021 లో మంచి అమ్మకాలను చేపట్టేలా దానికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధం చేస్తున్నాము.
MOST READ:ఈ రోడ్డుపై ప్రయాణించడానికి ధైర్యం కావాలి.. ఈ వీడియో చూడటానికి గుండె ధైర్యం కావాలి

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సంబంధిత ఇతర సమాచారం ప్రకారం సంస్థ తన లైనప్‌లో ఉన్న ఎంపిక చేసిన మోడల్స్ పై ఇయర్ ఎండ్ ఆఫర్స్ ప్రకటించింది. హోండా విక్రయించే చాలా బైక్స్ మరియు స్కూటర్లను ఇప్పుడు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ఇఎమ్ఐ స్కీమ్ కింద కొనుగోలు చేయవచ్చు.

హోండా కంపెనీ యాక్టివా యొక్క స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను ఇటీవల ఆవిష్కరించింది. ఇది దేశంలో 20 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ వెర్షన్‌లో హోండా చిన్న కాస్మెటిక్ మార్పులను మాత్రమే కలిగి ఉంది. కొత్త హోండా యాక్టివా 6 జి స్పెషల్ ఎడిషన్ స్టాండర్డ్ మరియు డీలక్స్ అనే రెండు వేరియంట్లలో విక్రయించబడుతుంది.
MOST READ:అటల్ టన్నెల్లో కొత్త రికార్డ్ ; ఏంటో అది అనుకుంటున్నారా.. ఇది చూడండి

ఈ స్కూటర్ యొక్క బేస్ వేరియంట్ ధర 66,816 రూపాయలు. ఈ కొత్త స్కూటర్లలో సౌందర్య నవీకరణలు మినహా ఎటువంటి మార్పులు చేయలేదు. స్పెషల్ ఎడిషన్ అదే బిఎస్ 6 109సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్తో పనిచేస్తుంది. ఇది 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 7.7 బిహెచ్‌పి శక్తిని, 5,250 ఆర్‌పిఎమ్ వద్ద 8.8 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.