Just In
- 1 hr ago
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- 2 hrs ago
45 లీటర్ల ఇంధన ట్యాంక్‌లో 48 లీటర్ల పెట్రోల్.. దీనితో మొదలైన గొడవ.. చివరికి ఏమైందంటే
- 3 hrs ago
సూపర్ సోకో నుండి మూడు సరికొత్త ఎలక్ట్రిక్ టూవీలర్స్
- 4 hrs ago
చెన్నైలో కొత్త డీలర్షిప్ ప్రారంభించిన వోల్వో.. పూర్తి వివరాలు
Don't Miss
- Sports
యువరాజ్ సింగ్ ట్వీట్‌పై దుమారం.. ఈ లెక్కన కోహ్లీ 200 సెంచరీలు చేసేవాడా?
- News
చంద్రబాబు చచ్చిన పాముతో సమానం..ఎక్కడికెళ్ళినా పీకేదేం లేదు: విజయసాయి రెడ్డి ధ్వజం
- Finance
అయిదేళ్లలో 63% పెరగనున్న కుబేరులు, ప్రపంచంలోనే భారత్ టాప్
- Movies
ఈ సినిమా చేస్తే కొడతారని చెప్పింది.. అందుకే కాజల్‌కు ఫోన్ చేశా: మంచు విష్ణు
- Lifestyle
marriage life: పెద్దలు కుదిర్చిన పెళ్లితో లాభమా.. నష్టమా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హస్క్వర్నా నుంచి భారత్‌కు రానున్న స్వార్ట్‌పిలెన్, విట్‌పిలెన్ 401 బైక్స్
హస్క్వర్నా మోటార్‌సైకిల్స్ తమ పాపులర్ ఫ్యూచరిస్టిక్ మోటార్‌సైకిళ్లయిన స్వార్ట్‌పిలెన్ మరియు విట్‌పిలెన్ 401 మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి ఈ మోటార్‌సైకిళ్ళు గత ఏడాదే దేశంలో విడుదలవుతాయని భావించగా, ఆ సమయంలో కంపెనీ 250సీసీ విభాగంలో కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది.

తాజాగా, ఐఏబి నుండి వచ్చిన సమాచారం ప్రకారం, హస్క్వర్నా ఈ ఏడాది చివరి నాటికి భారత మార్కెట్లో తమ స్వార్ట్‌పిలెన్ 401 మరియు విట్‌పిలెన్ 401 మోడళ్లను విడుదల చేయనుంది. ఈ రెండు మోటార్‌సైకిళ్ళలో అనేక విడిభాగాలు ఒకేలా ఉంటాయి. అయితే, డిజైన్ మరియు ఫీచర్ల పరంగా మాత్రం కొద్దిపాటి తేడాలు ఉంటాయి.

స్వార్ట్‌పిలెన్ 401 (బ్లాక్ యారో అని పిలుస్తారు) స్క్రాంబ్లర్ స్టైల్‌లో ఉండే మోటార్‌సైకిల్ మరియు ఇది మోడ్రన్-రెట్రో డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లతో కూడిన గుండ్రటి హెడ్‌ల్యాంప్ మరియు పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లు ఈ మోటార్‌సైకిల్‌కు మోడ్రన్-రెట్రో డిజైన్ రూపాన్ని జోడిస్తుంది.
MOST READ:రూ. 5 లక్షల లోపు ధర కలిగిన మారుతి సుజుకి టాప్ 5 కార్లు ఇవే.. చూసారా

ఆఫ్-రోడ్ మరియు ఆన్-రోడ్ ప్రయోజనం కోసం స్వార్ట్‌పిలెన్ 401లో డ్యూయెల్ పర్పస్ నాబీ టైర్లు ఉంటాయి. ఇందులోని పెరిగిన మరియు విస్తృతమైన సింగిల్-పీస్ హ్యాండిల్‌బార్ మంచి అప్‌రైట్ రైడింగ్ పొజిషన్‌ను ఇస్తుంది. దీనిపై బ్యాగ్ మౌంట్ చేయడానికి ట్యాంక్ రాక్ కూడా ఉంటుంది.

హస్క్వర్నా 401 (సిల్వర్ యారో అని పిలుస్తారు) విషయానికి వస్తే, ఇందులోని అనేక పరికరాలు మరియు ఫీచర్లు దాని స్క్రాంబ్లర్ వేరియంట్ నుండి పొందుతుంది. అయితే, విట్‌పిలెన్ మాత్రం చూడటానికి కేఫ్-రేసర్ స్టైల్‌ను కలిగి ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్‌లో ఆన్-రోడ్ టైర్లు, లో-సెట్ క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్లు మరియు అగ్రెసివ్ రైడింగ్ పొజిషన్‌లు ఉంటాయి.
MOST READ:మమ్ముట్టి కార్ కలెక్షన్ : ఈ కార్లకు ఒక ప్రత్యేకత ఉంది, అదేంటో తెలుసా ?

స్వార్ట్‌పిలెన్ 401 మోటార్‌సైకిల్ డార్క్ గ్రే కలర్ ట్యాంక్ మరియు సిల్వర్ కలర్ టెయిల్ సెక్షన్ డిజైన్‌తో ఇది డ్యూయెల్-టోన్ పెయింట్ స్కీమ్‌ను కలిగి ఉంటుంది. విట్‌పిలెన్‌లోని పెయింట్ స్కీమ్ స్వార్ట్‌పిలెన్‌కు వ్యతిరేఖంగా ఉంటుంది. ఇందులో సిల్వర్ ట్యాంక్, గ్రే టెయిల్ సెక్షన్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

ఈ రెండు 401 మోటార్‌సైకిళ్లలో కెటిఎమ్ మోటార్‌సైకిళ్ల నుండి గ్రహించిన 373 సిసి సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 44 బిహెచ్‌పి పవర్‌ను మరియు 37 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్ మరియు స్లిప్పర్-అసిస్ట్ క్లచ్‌తో జతచేయబడి ఉంటుంది.
MOST READ:భారీగా పెరిగిన సెకండ్ హ్యాండ్ కార్ అమ్మకాలు.. కారణం ఏంటో తెలుసా

వీటిలోని సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో 43 మిమీ డబ్ల్యుపి అపెక్స్ యుఎస్‌డి ఫోర్కులు మరియు వెనుక భాగంలో డబ్ల్యుపి అపెక్స్ మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. అలాగే, బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు వైపు 300 మిమీ డిస్క్ మరియు వెనుకవైపు 230 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇవి రెండూ డ్యూయెల్-ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి. ఈ రెండు మోటార్‌సైకిళ్ళలో అంతర్జాతీయ-స్పెక్ మోడళ్లలో కనిపించే స్పోక్డ్ వీల్స్ స్థానంలో అల్లాయ్ వీల్స్‌ను ఆఫర్ చేసే అవకాశం ఉంది.

హస్క్వర్నా 401 మోటార్‌సైకిళ్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
హస్క్వర్నా మోటార్‌సైకిల్స్ తమ ఎంట్రీ లెవల్ మోడళ్లయిన స్వార్ట్‌పిలెన్ మరియు విట్‌పిలెన్ 250 లను గత ఏడాది డిసెంబర్‌లో భారత్‌లో విడుదల చేసింది. భారతదేశంలో కంపెనీ తమ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, ఈ రెండు మోడళ్లలో కంపెనీ పెద్ద సామర్థ్యం గల మోటార్‌సైకిళ్లను విడుదల చేసే అవకాశం ఉంది. ఇవి ఈ విభాగంలో డ్యూక్ 390 మరియు డొమినార్ 400 వంటి మోడళ్లకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది.