Just In
- 17 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 1 day ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 1 day ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 1 day ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
మాజీ రాష్ట్రపతి కలాం సోదరుడు మహమ్మద్ ముత్తుమీర కన్నుమూత
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Movies
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డీలర్ల వద్దకు చేరుకుంటున్న కెటిఎమ్ 250 అడ్వెంచర్; మరికొద్ది రోజుల్లోనే విడుదల!
ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ కంపెనీ కెటిఎమ్, భారత మార్కెట్లో తమ సరికొత్త ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్ 'కెటిఎమ్ 250 అడ్వెంచర్'ను విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కంపెనీ ఇప్పటికే ఈ కొత్త మోడల్‌ను తమ అధీకృత డీలర్‌షిప్ కేంద్రాలకు పంపిణీ చేస్తోంది.

కెటిఎమ్ 250 అడ్వెంచర్‌ను కంపెనీ విక్రయిస్తున్న 390 అడ్వెంచర్ నుండి స్ఫూర్తి పొంది తయారు చేశారు. ఇది ఎంట్రీ లెవల్ అడ్వెంచర్-టూరర్ మోటార్‌సైకిల్‌గా భారత్‌లోకి ప్రవేశించనుంది. కొన్ని మెట్రో నగరాల్లో ఇప్పటికే ఈ మోడల్ కోసం బుకింగ్‌లు కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

తాజాగా, జిగ్‌వీల్స్ లీక్ చేసిన చిత్రాల ప్రకారం, ఓ డీలర్‌షిప్ స్టాక్‌యార్డులో ఉన్న కొత్త కెటిఎమ్ 250 అడ్వెంచర్ మోడల్‌ను గమనించవచ్చు. దీన్నిబట్టి చూస్తుంటే, అతి త్వరలోనే ఈ మోడల్ భారత మార్కెట్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. కెటిఎమ్ ఇప్పటికే ఈ మోడల్‌ను భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షించింది.
భారత్‌లో విడుదల కానున్న 250 అడ్వెంచర్, గతంలో కెటిఎమ్ అంతర్జాతీయ మార్కెట్లలో ఆవిష్కరించిన 250 అడ్వెంచర్ టూరర్ మాదిరిగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కెటిఎమ్ విక్రయిస్తున్న డ్యూక్ 250 నేక్డ్ మోటార్‌సైకిల్‌కు ఎగువన 250 అడ్వెంచర్ టూరర్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
MOST READ:మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

ప్రస్తుతం కెటిఎమ్ డ్యూక్ 250లో ఉపయోగిస్తున్న ఇంజన్‌నే రీట్యూన్ చేసి 250 అడ్వెంచర్‌లో ఉపయోగించారు. ఇందులోని 249సీసీ లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ 9000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 30 బిహెచ్‌పి పవర్‌ను మరియు 7500 ఆర్‌పిఎమ్ వద్ద 24 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

కెటిఎమ్ అందిస్తున్న పెద్ద అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లను తయారు చేస్తున్న స్టీల్-ట్రేల్లిస్ ఫ్రేమ్‌ను ఆధారంగా చేసుకొని దాని సబ్‌ఫ్రేమ్‌పై ఈ కొత్త 250 అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను తయారు చేసే అవకాశం ఉంది.
ఈ మోటార్‌సైకిల్‌లో ముందు వైపు 170 మిమీ ట్రావెల్‌తో కూడిన 43 మిమీ డబ్ల్యూపి అపెక్స్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుకవైపు 177 మిమీ ట్రావెల్‌తో ప్రీలోడ్ అడ్జస్టబల్ డబ్ల్యూపి అపెక్స్ మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఈ సస్పెన్షన్ సెటప్ 390 అడ్వెంచర్ మోడల్‌లో కనిపించే వాటికి సమానంగా ఉంటుంది.
MOST READ:బాగా దాహంగా ఉన్న ఏనుగు రోడ్డుపై ఏం చేసిందో తెలుసా.. అయితే వీడియో చూడండి

బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 320 మిమీ సింగిల్ డిస్క్ మరియు వెనుక భాగంలో 230 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ పరంగా చూస్తే, కెటిఎమ్ 250 అడ్వెంచర్ ఆఫ్-రోడ్ మోడ్‌తో డ్యూయల్-ఛానెల్ ఏబిఎస్‌ను మాత్రమే కలిగి ఉంటుంది.
కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోడల్‌లో ఉపయోగిస్తున్న ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌నే కొత్త 250 అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌లో కూడా ఉపయోగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, 250 అడ్వెంచర్‌లో ట్రాక్షన్ కంట్రోల్, రైడ్-బై-వైర్ మరియు క్విక్-షిఫ్టర్ వంటి కొన్ని కీలక ఫీచర్లు ఉండకపోవచ్చని సమాచారం.

ఇకపోతే, దీని ముందు భాగంలో 100/90-19 మరియు వెనుక భాగంలో 130/80-17 టైర్ ప్రొఫైళ్లను కలిగి ఉండి, ఎమ్ఆర్ఎఫ్ మోగ్రిప్ మీటియోర్ ఎఫ్ఎమ్2 ట్యూబ్‌లెస్ టైర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.
MOST READ:రూ. 1.26 కోట్ల రూపాలకు అమ్ముడైన 118 సంవత్సరాల పాత వెహికల్ నెంబర్.. ఎందుకో తెలుసా

కెటిఎమ్ 250 అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
తక్కువ ధరకే సౌకర్యవంతమైన అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్‌ను కోరుకునే కస్టమర్ల కోసం కెటిఎమ్ 250 అడ్వెంచర్ బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. ఈ విభాగంలో ఈ మోడల్‌కు నేరుగా ఎలాంటి పోటీ లేకపోయినప్పటికీ, ఇది బిఎమ్‌డబ్ల్యూ జి 310 జిఎస్, హీరో ఎక్స్‌పల్స్ 200 వంటి మోడళ్లకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది.
Source:zigwheels