Just In
- 14 min ago
మా నాన్న పోలీస్.. నేను ఏమైనా చేస్తా.. కరోనా వేళ ఢిల్లీలో యువతి హల్చల్ [వీడియో]
- 28 min ago
డీలర్ల వద్దకు ఇసుజు డి-మ్యాక్స్ హై-ల్యాండర్ డబుల్ క్యాబిన్ పికప్ ట్రక్!
- 1 hr ago
ధర భారీగా పెరిగిన ఏ మాత్రం తగ్గని క్రేజ్.. ఇప్పటికే 50,000లకి పైగా బుకింగ్స్!
- 2 hrs ago
టూవీలర్స్ కోసం గ్రీన్ వెహికల్ రేటింగ్; పర్యావరణానికి మీ టూవీలర్ ఎంత సేఫ్?
Don't Miss
- News
బస్సుల్లో వచ్చి దొంగ ఓట్లు వేసుంటే.. తిరుపతి ఉపఎన్నిక పోలింగ్‌పై కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు
- Movies
ప్రతి ఇంట్లో ఇలాంటి కొడుకులుండాలి…సల్మాన్ బ్రదర్స్ ను ఆకాశానికెత్తేసిన బాలీవుడ్ హాట్ బ్యూటీ !
- Sports
RCB vs KKR: అతడు వంగడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు.. ఇది కేకేఆర్‌కు పెద్ద తలనొప్పే: వాన్
- Lifestyle
ఈ 7 రకాల క్యాన్సర్లు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది!
- Finance
కరోనా-లాక్‌డౌన్‌పై మరోసారి తేల్చి చెప్పిన నిర్మలా సీతారామన్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కెటిఎమ్ నుండి రానున్న కొత్త 500సీసీ బైక్; పూనేలో తయారీ!
ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ బ్రాండ్ కెటిఎమ్ భారత మార్కెట్ కోసం ఓ సరికొత్త 500సీసీ మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేస్తోంది. త్వరలోనే ఇది మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ కొత్త 500సీసీ బైక్ ట్విన్ సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంటుందని సమాచారం.

అంతేకాకుండా, ఇది కంపెనీ అందిస్తున్న పాపులర్ 890సీసీ బైక్ మాదిరిగానే కాన్ఫిగరేషన్‌ను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది. పూణేలో ఉన్న బజాజ్ ఆటో ప్లాంట్‌లో ఈ కొత్త 500సీసీ బైక్‌పై కంపెనీ ఇప్పటికే పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ అండ్ డి) చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

కెటిఎమ్ సబ్ బ్రాండ్ అయిన హస్క్వార్నా కూడా ఈ కొత్త 500సీసీ బైక్ అభివృద్ధిలో భాగం పంచుకోనుంది. ప్రస్తుతం కెటిఎమ్ మార్కెట్లో విక్రయిస్తున్న 390సీసీ బైక్‌కు ఎగువన ఈ కొత్త 500సీసీ బైక్‌ను ప్రవేశపెట్టనున్నారు మరియు మార్కెట్లో దీనిని ప్రీమియం మోటార్‌సైకిల్‌గా విక్రయించనున్నారు.
MOST READ:కేవలం 4 గంటల సమయంలో భారీగా పట్టుబడ్డ దొంగ వాహనాలు..ఇంకా ఎన్నో..మీరే చూడండి

కెటిఎమ్ మరియు హస్క్వార్నా మోటార్‌సైకిళ్లను బజాజ్ ప్లాంట్‌లో తయారు చేస్తున్న విషయం తెలిసినదే. భారత మార్కెట్లో కెటిఎమ్ విజయవంతంగా ఓ మంచి బ్రాండ్ ఇమేజ్‌ను దక్కించుకున్న నేపథ్యంలో, హస్క్వార్నా బ్రాండ్‌ను కూడా భారత కస్టమర్లు ఇష్టపడుతున్నారు. హస్క్వార్నా ఈ ఏడాది భారతదేశంలో రెండు 250సీసీ బైక్‌లను విడుదల చేసింది.

తాజా గణాంకాల ప్రకారం, నవంబర్ 2020 నెలలో కెటిఎమ్, హస్క్వార్నా బ్రాండ్లకు చెందిన 8,000 యూనిట్లకు పైగా మోటార్‌సైకిళ్లు అమ్ముడయ్యాయి. కాగా, ఈ రెండు బ్రాండ్లకు సంబంధించి కొత్త సంవత్సరంలో 1,80,000 బైక్‌లను ఉత్పత్తి చేయాలని కెటిఎమ్ లక్ష్యంగా పెట్టుకుంది.
MOST READ:సినిమా స్టైల్లో బస్సును కొండపై యు-టర్న్ చేసిన డ్రైవర్ [వీడియో]

కెటిఎమ్, హస్క్వార్నా మోటార్‌సైకిళ్ల ధరల పెంపు ఇదిలా ఉంటే, భారత మార్కెట్లో కెటిఎమ్ మరియు హస్క్వార్నా మోటార్‌సైకిళ్ల ధరలు ఈనెల ఆరంభంలో కంపెనీ పెంచింది. మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి ఈ రెండు బ్రాండ్ల మోటార్‌సైకిళ్ల ధరలు రూ.1,200 నుంచి రూ.8,500 మధ్యలో పెరిగాయి.

కెటిఎమ్ ఇండియా ప్రోడక్ట్ లైనప్‌లో అతి తక్కువ పెంపును అందుకుంది కెటిఎమ్ ఆర్‌సి 125. ఈ ఎంట్రీ లెవల్ ఫుల్ ఫెయిర్డ్ మోటార్‌సైకిల్ ధర రూ.1,279 మేర పెరిగి ఇప్పుడు రూ.1.61 లక్షల (ఎక్స్-షోరూమ్)కు చేరుకుంది. అలాగే, కెటిఎమ్ అందిస్తున్న 390 డ్యూక్ ధర గరిష్టంగా రూ.8,517 పెరిగి రూ.2.66 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
MOST READ:నిజంగా ఈ బైకర్స్ అదృష్టవంతులే సుమీ.. ఎందుకో వీడియో చూడండి

కాగా, డ్యూక్ 250 ధర రూ.4,738 పెరిగి, రూ.2.14 లక్షలకు చేరుకుంది. బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిల్, కెటిఎమ్ ఆర్‌సి 390 ధరను రూ.3,539 మేర పెరిగి రూ.2.56 లక్షలకు చేరుకుంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

కెటిఎమ్ డ్యూక్ 200 మరియు 390 అడ్వెంచర్ మోడళ్ల ధరలు వరుసగా రూ.1,923 మరియు రూ.1,442 రూపాయలు చొప్పున పెరిగాయి. తాజా ధరల పెంపు తర్వాత మార్కెట్లో కెటిఎమ్ 200 డ్యూక్ ధర రూ.1.78 లక్షలుగా ఉంటే కెటిఎమ్ అడ్వెంచర్ 390 మోటార్‌సైకిల్ ధర రూ.3.05 లక్షలుగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
MOST READ:మళ్ళీ బయటపడిన లంచం తీసుకుంటూ దొరికిన పోలీస్ వీడియో.. మీరు చూసారా ?

ఇక హస్క్వర్నా మోటార్‌సైకిల్ ధరల పెంపు విషయానికి వస్తే, ఈ రెండి మోడళ్లపై కంపెనీ రూ.1,790 ధరల పెంచింది. తాజా ధరల పెంపు తర్వాత మార్కెట్లో స్వార్ట్‌పిలెన్ 250 మరియు విట్‌పిలెన్ 250 మోడళ్ల ధర రూ.1.86 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉన్నాయి. ఇవి రెండూ ఒకే రకమైన ధరతో లభిస్తాయి.

కెటిఎమ్ డ్యూక్ 125 విడుదల
కెటిఎమ్ ఇండియా ఈనెల 5వ తేదీన భారత మార్కెట్లో తమ కొత్త 2020 డ్యూక్ 125 ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. మార్కెట్లో ఈ రిఫ్రెష్డ్ వెర్షన్ కెటిఎమ్ డ్యూక్ 125 ధర రూ.1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. - దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.
Source: Motoringworld