Just In
Don't Miss
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్త కలర్ ఆప్షన్‌లో విడుదల కానున్న కెటిఎం ఆర్‌సి 200 బైక్
కెటిఎం తన కొత్త ఆర్‌సి 200 బైక్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కొత్త కెటిఎం ఆర్‌సి 200 బైక్‌ను త్వరలో భారతీయ మార్కెట్లోకి విడుదల చేయనుంది. దేశీయ మార్కెట్లో విడుదల కానున్న ఈ కొత్త బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

పండుగ సీజన్లో ఆటోమొబైల్ అమ్మకాలు చాలా ఎక్కువగా ఉన్నందున, కెటిఎం త్వరలో తన కొత్త ఆర్‌సి 200 బైక్‌ను విడుదల చేస్తుంది. కొత్త కెటిఎం ఆర్‌సి 200 బైక్‌లు ఇప్పటికే డీలర్లకు చేరడం ప్రారంభించాయి. డీలర్ దగ్గరకి చేరుకున్న ఈ కెటిఎం ఆర్‌సి 200 బైక్‌లకు కొత్త కలర్ ఆప్షన్ కలిగి ఉన్నాయి.

కొత్త కెటిఎం ఆర్‌సి బైక్ ట్యాంక్ మరియు ఫెయిరింగ్ ఆరంజ్ మరియు మిగిలినది బ్లాక్ కలర్ లో ఉంది. అంతే కాకుండా ఇది గ్రాఫిక్స్ గ్రే మరియు వైట్ రంగుల కలయికలో కూడా ఉన్నాయి.
MOST READ:భారతదేశంలో దయనీయ స్థితిలో ఉన్న రోల్స్ రాయిస్ లగ్జరీ కార్లు, ఇవే

కొత్త కెటిఎం ఆర్‌సి 200 బైక్‌లో 199.5 సిసి, లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 24.6 బిహెచ్‌పి శక్తి మరియు 19.2 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ జతచేయబడింది. ఈ కొత్త కెటిఎం ఆర్‌సి 200 బైక్ ధర వెల్లడించలేదు. అయితే ఇది మునుపటి మోడల్ కంటే కొంచెం ఖరీదైనదిగా ఉండే అవకాశం ఉంటుంది.

కొత్త కెటిఎం ఆర్‌సి 200 బైక్ ఇటీవల భారతదేశంలో స్పాట్ టెస్ట్ కూడా జరిపింది. మార్కెట్లో ఉన్న ఇతర మోడల్‌తో పోలిస్తే ఇది మరింత దూకుడుగా ఉంటుంది. కెటిఎం ఆర్‌సి 200 బైక్ స్పాట్ టెస్ట్ పరీక్ష సమయంలో హాలోజెన్ హెడ్‌ల్యాంప్ మరియు మార్కెట్లో ఆర్‌సి 200 బైక్ ప్రొజెక్టర్ యూనిట్‌ను కలిగి ఉంది. స్పాట్ టెస్ట్‌లో కెటిఎం ఆర్‌సి 200 బైక్‌కు కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అమర్చారు.

ఇది 390 డ్యూక్ మోడల్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో డాష్ కావచ్చు. బైక్ యొక్క టెక్నాలజీ అంశాలను చూస్తే, ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు ఉండవని మేము ఆశిస్తున్నాము కొత్త కెటిఎం ఆర్‌సి 200 బైక్‌లు ఇప్పటికే డీలర్‌షిప్‌లో అందుబాటులో ఉన్నాయి మరియు త్వరలో విడుదల కావచ్చు.

ఈ కొత్త కెటిఎం ఆర్‌సి 200 బైక్ పండుగ సీజన్లో ఎక్కువ అమ్మకాలను కొనసాగించడానికి చాలా సహాయపడుతుంది. ఈ బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకుండా వాహనదారునికి మంచి రైడింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది. ఇది మునుపటికంటే ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది.
MOST READ:బెనెల్లీ ఇంపీరియల్ బైక్‌ను సొంతం చేసుకోవటానికి ఇదే బెస్ట్ ఆఫర్!