క్రూయిజర్ మోటార్‌సైకిల్ విభాగంపై కన్నేసిన ఎమ్‌వి అగస్టా, కొత్త బైక్ కోసం ప్లాన్స్!

రానున్న రెండేళ్లలో ఓ కొత్త క్రూయిజర్ మోటార్‌సైకిల్‌ను మార్కెట్‌కు పరిచయం చేస్తామని ప్రముఖ ప్రీమియం మోటార్‌సైకిళ్ల తయారీ కంపెనీ 'ఎమ్‌వి అగస్టా' పేర్కొంది. ఇప్పటి వరకూ స్పోర్ట్స్ బైక్ మరియు నేక్డ్ బైక్‌లను మాత్రమే విక్రయిస్తున్న ఎమ్‌వి అగస్టా బ్రాండ్‌కు ఇది తొలి క్రూయిజర్ బైక్ కానుంది. సరికొత్త డిజైన్, అధునాతన ఫీచర్లు మరియు లేటెస్ట్ టెక్నాలజీతో ఈ కొత్త బైక్‌ను డెవలప్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

క్రూయిజర్ మోటార్‌సైకిల్ విభాగంపై కన్నేసిన ఎమ్‌వి అగస్టా, కొత్త బైక్ కోసం ప్లాన్స్!

ఇటీవల తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఎమ్‌వి అగస్టా సీఈఓ టిమూర్ సర్డరోవ్‌తో నిర్వహించిన ప్రశ్నోత్తరాల సమావేశంలో ఆయన స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. తాము డెవలప్ చేస్తున్న కొత్త క్రూయిజర్ బైక్‌తో కొత్త మోటారుసైకిల్ విభాగాలలోకి ప్రవేశించడమే కాకుండా, భవిష్యత్తులో కంపెనీ ప్రణాళికలకు సంబంధించి కొన్ని వివరాలను కూడా ఆయన వెల్లడించారు.

క్రూయిజర్ మోటార్‌సైకిల్ విభాగంపై కన్నేసిన ఎమ్‌వి అగస్టా, కొత్త బైక్ కోసం ప్లాన్స్!

ఈ క్రూయిజర్ మోటార్‌సైకిల్ ఇంకా డెవలప్‌మెంట్ స్టేజ్‌లోనే ఉన్న నేపథ్యంలో, ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన వెల్లడి చేయలేదు. అయితే ఇది ఖచ్చితంగా బ్రాండ్ సిగ్నేచర్ డిజైన్‌ను కలిగి ఉంటుందని మేము అంచనా వేస్తున్నాము. ఇప్పటి వరకూ మార్కెట్లోకి వచ్చిన అన్ని ఎమ్‌వి అగస్టా మోటార్‌సైకిళ్లు కూడా రాడికల్ ఇటాలియన్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో రాబోయే క్రూయిజర్ మోటారుసైకిల్ కూడా ఇదే తరహా స్పూర్తితో తయారయ్యే అవకాశం ఉంది.

MOST READ: ఖాళీ రోడ్డుపై బైక్ స్టంట్స్ : ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు యువకులు [వీడియో]

క్రూయిజర్ మోటార్‌సైకిల్ విభాగంపై కన్నేసిన ఎమ్‌వి అగస్టా, కొత్త బైక్ కోసం ప్లాన్స్!

స్ట్రైకింగ్ డిజైన్‌తో రానున్న ఎమ్‌వి అగస్టా క్రూయిజర్ మోటార్‌సైకిల్ అనేక ఫీచర్లు మరియు ప్రీమియం విడి భాగాలతో నిండి ఉండొచ్చని అంచనా. బైక్‌ని స్మార్ట్‌ఫోన్‌తో జత చేయడానికి బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన సెకండ్ జనరేషన్ 5.5 ఇంచ్‌ల టిఎఫ్‌టి స్క్రీన్‌ను ఈ కొత్త బైక్‌లోనూ ఉపయోగించే ఆస్కారం ఉంది. కంపెనీ తమ లేటెస్ట్ మోడల్ మోటార్‌సైకిళ్లలో ఆఫర్ చేస్తున్న 'ఎమ్‌వి రైడ్' అనే కనెక్టింగ్ టెక్నాలజీ కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది.

క్రూయిజర్ మోటార్‌సైకిల్ విభాగంపై కన్నేసిన ఎమ్‌వి అగస్టా, కొత్త బైక్ కోసం ప్లాన్స్!

ఇది క్రూయిజర్ బాడీ స్టైల్ మోటార్‌సైకిల్ కావటంతో ఇందులో సరికొత్త సస్పెన్షన్ మరియు బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుందని అంచనా. బైక్ ముందు భాగంలో ఇరువైపులా సెమీ యాక్టివ్ సస్పెన్షన్‌గా పనిచేసే అప్ సైడ్ డౌన్ (యూఎస్‌డి) ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనో షాక్ సెటప్ ఉండే అవకాశం ఉంది. ఈ మోటార్‌సైకిల్‌ బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో నాలుగు-పిస్టన్ రేడియల్‌గా అమర్చిన ట్విన్ డిస్క్ బ్రేక్స్ మరియు వెనుక భాగంలో సింగిల్ డిస్క్ బ్రేక్ ఉంటాయని తెలుస్తోంది. ఈ మోటార్‌సైకిల్‌లో పెర్ఫార్మెన్స్ టైర్లను కూడా ఉపయోగించవచ్చని అంచనా.

MOST READ: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బైక్‌లు, కార్లు ఎలా ఉన్నాయో చూసారా ?

క్రూయిజర్ మోటార్‌సైకిల్ విభాగంపై కన్నేసిన ఎమ్‌వి అగస్టా, కొత్త బైక్ కోసం ప్లాన్స్!

ఇది క్రూయిజర్ బాడీ స్టైల్ కావడంతో, ఈ మోటారుసైకిల్ మంచి సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్‌ను ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగా, ఎత్తు పెంచబడిన వెడల్పాటి హ్యాండిల్ బార్, బాగా కుషన్ చేయబడిన సీట్, పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్, ఫార్వర్డ్-సెట్ ఫుట్‌పెగ్స్ మరియు లో సీట్ హైట్ వంటివి కొన్ని కీలక ఫీచర్లుగా చెప్పుకోవచ్చు.

క్రూయిజర్ మోటార్‌సైకిల్ విభాగంపై కన్నేసిన ఎమ్‌వి అగస్టా, కొత్త బైక్ కోసం ప్లాన్స్!

సర్డరోవ్ ఈ క్రూయిజర్ మోటారుసైకిల్ గురించి వివరాలను ప్రకటించడమే కాకుండా, భారత మార్కెట్లో ఎమ్‌వి అగస్టా భవిష్యత్తు గురించి కూడా మాట్లాడారు. భారత్‌లో కైనెటిక్ మోటోరాయల్‌తో తమకున్న భాగస్వామ్యాన్ని ముగిసిందని ఆయన ధృవీకరించారు. ప్రస్తుతం ఈ ఇటాలియన్ టూవీలర్ కంపెనీ భారత్‌లో తమ యూరో 5 / బిఎస్ 6 మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టడానికి కొత్త భాగస్వామి కోసం ఎదురు చూస్తోంది. అయితే, ఈ కొత్త భాగస్వామ్యానికి సంబంధించిన వివరాలను మాత్రం ఆయన వెల్లడి చేయలేదు.

MOST READ: కరోనా టెస్ట్ చేసుకోవడానికి ఇలా కూడా చేస్తారా..?

క్రూయిజర్ మోటార్‌సైకిల్ విభాగంపై కన్నేసిన ఎమ్‌వి అగస్టా, కొత్త బైక్ కోసం ప్లాన్స్!

ఎమ్‌వి అగస్టా క్రూయిజర్ మోటార్‌సైకిల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

పెర్ఫార్మెన్స్ ద్విచక్ర వాహన విభాగంలో అగ్రెసివ్‌గా కనిపించే నేక్డ్-స్ట్రీట్ మరియు సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిళ్ల తయారీలో ఎమ్‌వి అగస్టా బ్రాండ్ చాలా ప్రసిద్ధి చెందినది. ఈ కంపెనీ మోటార్‌సైకిళ్లలోని ఇతర కొత్త విభాగాలను అన్వేషించడం మరియు ఇప్పటికే దాని లైనప్‌లో అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లను జోడించడం కూడా జరిగింది. తాజా నివేదికల ప్రకారం, ఇప్పుడు ఈ ఇటాలియన్ బ్రాండ్ కొత్త క్రూయిజర్ మోటార్‌సైకిల్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇతర సెగ్మెంట్ల మాదిరిగానే ఈ క్రూయిజర్ సెగ్మెంట్లో కూడా ఎమ్‌వి అగస్టా మంచి సక్సెస్‌ను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Most Read Articles

English summary
MV Agusta is said to be launching a new cruiser motorcycle within the next two years. The upcoming motorcycle will be the brand's first cruiser bike offering and is expected to come equipped with a host of new features. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X