ఈ స్కూటర్ ధర కేవలం రూ.58,992 మాత్రమే; స్పెషల్ ఏంటో తెలుసా?

భారత ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలోకి తాజాగా మరో కొత్త కంపెనీ ప్రవేశించింది. ఒకినావా అనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ మార్కెట్లో లో స్పీడ్ మోడల్ 'ఆర్30' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. దేశీయ విపణిలో కొత్త ఒకినావా ఆర్30 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.58,992 ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్‌లు స్వీకరిస్తున్నామని, కస్టమర్లు రూ.2,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

ఈ స్కూటర్ ధర కేవలం రూ.58,992 మాత్రమే; స్పెషల్ ఏంటో తెలుసా?

ఒకినావా ఆర్ 30 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో వేరు చేయగలిగిన 1.25 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ బ్యాటరీ సాయంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు. దీనిని పూర్తిగా ఛార్జ్ చేయటం కోసం సుమారు 4 నుండి 5 గంటల సమయం పడుతుందని కంపెనీ తెలిపింది. ఒకినావా ఆర్30 ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు.

ఈ స్కూటర్ ధర కేవలం రూ.58,992 మాత్రమే; స్పెషల్ ఏంటో తెలుసా?

ఒకినావా ఆర్ 30 ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని ఛార్జర్ ఆటో కట్-ఆఫ్ ఫంక్షన్‌తో వస్తుంది. బ్యాటరీ చార్జ్ అవగానే పవర్ సప్లయ్ ఆగిపోయి విద్యుత్ ఆదా అవుతుంది. ఇందులోని బ్యాటరీ 3 సంవత్సరాల వారంటీతో వస్తుంది, అలాగే 250 వాట్స్ బిఎల్‌డిసి ఎలక్ట్రిక్ మోటారును 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వారంటీతో (ఏది ముందుగా ముగిస్తే అది) లభిస్తుంది.

MOST READ:మొదటి రోజు భారీ బుకింగ్స్ నమోదు చేసిన కియా సోనెట్ ; ఎంతో తెలుసా ?

ఈ స్కూటర్ ధర కేవలం రూ.58,992 మాత్రమే; స్పెషల్ ఏంటో తెలుసా?

డిజైన్ మరియు ఫీచర్ల పరంగా, ఒకినావా ఆర్30 ఎలక్ట్రిక్ స్కూటర్ ఆప్రాన్, బాడీ-కలర్ ఫ్లోర్ మాట్స్, అల్లాయ్ వీల్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, స్టైలిష్ హెడ్‌ల్యాంప్ వంటి ఫీచర్లతో లభిస్తుంది. ఇది పెరల్ వైట్, గ్లోసీ రెడ్, మెటాలిక్ ఆరెంజ్, సీ గ్రీన్ మరియు సన్‌రైజ్ ఎల్లో అనే ఐదు ఆకర్షనీయమైన రంగులలో లభిస్తుంది.

ఈ స్కూటర్ ధర కేవలం రూ.58,992 మాత్రమే; స్పెషల్ ఏంటో తెలుసా?

ఒకినావా ఆర్30 ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని సస్పెన్షన్‌ను గమనిస్తే, ముందు భాగంలో సాంప్రదాయ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో డ్యూయెల్ షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి ఇరువైపులా డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. ఇందులో బ్రేక్ రీజనరేషన్‌తో ఈ-ఏబిఎస్ (ఎలక్ట్రానిక్ అసిస్టెడ్ బ్రేకింగ్ సిస్టమ్) ఉంటుంది.

MOST READ:కొత్త మహీంద్రా థార్ నడిపిన పృథ్వీరాజ్.. కారు గురించి అతను ఏమి చెప్పాడో తెలుసా ?

ఈ స్కూటర్ ధర కేవలం రూ.58,992 మాత్రమే; స్పెషల్ ఏంటో తెలుసా?

ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 150 కిలోల పేలోడ్‌ను మోయగలదు మరియు 7 డిగ్రీల వంపును అధిరోహించగలదు. ఆర్3 ఎలక్ట్రిక్ స్కూటర్ 735 మిమీ తక్కువ సీటు ఎత్తుతో వస్తుంది కాబట్టి ఇది అన్ని రకాల రైడర్లకు సౌకర్యవంతంగా ఉంటుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 160 మి.మీగా ఉంటుంది. ఫలితంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలాంటి నగర వీధుల్లోనైనా సులువుగా ప్రయాణించగలదు.

ఈ స్కూటర్ ధర కేవలం రూ.58,992 మాత్రమే; స్పెషల్ ఏంటో తెలుసా?

ఒకినావా ఆర్30 ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఒకినావా ఆర్30 ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క లేటెస్ట్ లో-స్పీడ్ సిరీస్ మోడళ్లలో ఒకటిగా విడులైంది. ఇది దేశీయ విపణిలో మిడ్-స్పెక్ ఆంపియర్ మరియు హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

MOST READ:ప్రపంచంలో నాల్గవ ధనవంతుడు కానున్న సిఈఓ : ఎవరో తెలుసా

Most Read Articles

English summary
Okinawa has introduced an all-new electric scooter in its low-speed category, called the R30. The new Okinawa R30 electric scooter is priced at Rs 58,992, ex-showroom. Bookings for the electric scooter is said to have begun for an amount of Rs 2,000. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X