భారీగా పెరిగిన రివాల్ట్ మోటార్‌సైకిల్ ధరలు; కొత్త ధరల జాబితా

ప్రముఖ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ రివాల్ట్ ఇంటెలికార్ప్ విక్రయిస్తున్న తమ ఆర్‌వి300 మరియు ఆర్‌వి400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల ధరలు దేశవ్యాప్తంగా రూ.14,200 మేర పెరిగాయి. ఇందులో బుకింగ్ మొత్తం మరియు వన్-టైమ్ చెల్లింపు ధరలు ఉంటాయి.

భారీగా పెరిగిన రివాల్ట్ మోటార్‌సైకిల్ ధరలు; కొత్త ధరల జాబితా

దేశంలో రివాల్ట్ ఆర్‌వి300 మరియు రివాల్ట్ ఆర్‌వి400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల ధరలు పెరగడం ఇది రెండవసారి. ఈ రెండు మోడళ్లను కంపెనీ తొలిసారిగా 2019లో భారతదేశంలో విడుదల చేసింది. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 202 వీటి ధరలను మొదటిసారిగా పెంచారు. మొదటి ధరల పెంపు తర్వాత మార్కెట్లో ఆర్‌వి300 ధర రూ.84,999 మరియు ఆర్‌వి400 ధర రూ.1,03,999 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా మారాయి.

భారీగా పెరిగిన రివాల్ట్ మోటార్‌సైకిల్ ధరలు; కొత్త ధరల జాబితా

తాజాగా రివాల్ట్ ఆర్‌వి300 మరియు ఆర్‌వి400 ధరలను రూ.15,000 వరకు పెంచింది. అంతే కాకుండా, ఈ రెండు మోటార్‌సైకిళ్ల బుకింగ్ మొత్తాన్ని కూడా కంపెనీ పెంచింది.

రివాల్ట్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఆర్‌వి300 బుకింగ్ మొత్తం రూ.1,199 నుండి రూ.7,199కు పెరిగింది. ఈ ఎలక్ట్రిక్ మోటారుసైకిల్ ఇప్పుడు రూ.94,999 ప్రారంభ ధరతో లభిస్తుంది. ఇదివరకటి ధరతో పోల్చుకుంటే, ఇది రూ.10,000 పెంపును అందుకుంది.

MOST READ:మీకు తెలుసా.. 2021 డాకర్ ర్యాలీలో పాల్గొనే హీరో మోటార్‌స్పోర్ట్ టీమ్ ఇదే

భారీగా పెరిగిన రివాల్ట్ మోటార్‌సైకిల్ ధరలు; కొత్త ధరల జాబితా

అదేవిధంగా, ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్ అయిన రివాల్ట్ ఆర్‌వి400 బుకింగ్ మొత్తాన్ని కంపెనీ రూ.3,999 నుండి రూ.7,999కు పెంచింది. తాజా ధరల పెంపు తర్వాత ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ధర రూ.1.19 లక్షలకు చేరుకుంది. మునుపటి ధరతో పోలిస్తే ఇది రూ.15,000 పెంపును అందుకుంది.

భారీగా పెరిగిన రివాల్ట్ మోటార్‌సైకిల్ ధరలు; కొత్త ధరల జాబితా

రివాల్ట్ ఇండియా తమ రెండు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల ధరలను సవరించడంతో పాటుగా, వీటి ఈఎమ్ఐ ప్లాన్‌లలో కూడా మార్పులు చేసింది. మునుపటి 38 నెలల ప్లాన్‌ను కంపెనీ నిలిపివేసింది మరియు దాని స్థానంలో 24 నెలలు మరియు 36 నెలల ప్లాన్‌ను తీసుకొచ్చింది.

MOST READ:హ్యుందాయ్ కార్లపై ఇయర్ ఎండ్ ఆఫర్స్; రూ.1 లక్ష వరకూ తగ్గింపు!

భారీగా పెరిగిన రివాల్ట్ మోటార్‌సైకిల్ ధరలు; కొత్త ధరల జాబితా

రివాల్ట్ ఆర్‌వి400 యొక్క వినియోగదారులు 24 నెలల కాలపరిమితిని ఎంచుకున్నట్లయితే, నెలకు రూ.6,075 మరియు 36 నెలల కాలపరిమితిని ఎంచుకున్నట్లయితే, నెలకు రూ.4,399 చొప్పున ఈఎమ్ఐ చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా, ఎంట్రీ లెవల్ మోడల్ అయిన రివాల్ట్ ఆర్‌వి300 కోసం ఈఎమ్ఐ ధరలు వరుసగా 24, 36 నెలల కాలపరిమితి గాను నెలకు రూ.4,384, రూ.3,174 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

భారీగా పెరిగిన రివాల్ట్ మోటార్‌సైకిల్ ధరలు; కొత్త ధరల జాబితా

రివాల్ట్ ఆర్‌వి400 మరియు ఆర్‌వి300 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు ప్రస్తుతం భారతదేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఢిల్లీ, ముంబై, పూణే, హైదరాబాద్, అహ్మదాబాద్ మరియు చెన్నై నగరాలు ఉన్నాయి. ఈ మోడళ్లను మరిన్ని ఇతర మార్కెట్లలో విడుదల చేసేందుకు కూడా కంపెనీ ప్లాన్ చేస్తోంది.

MOST READ:నవంబర్ 2020లో లగ్జరీ కార్లకు కలిసిరాని లక్

భారీగా పెరిగిన రివాల్ట్ మోటార్‌సైకిల్ ధరలు; కొత్త ధరల జాబితా

ఇక రివాల్ట్ ఆర్‌వి 300 మరియు ఆర్‌వి 400 ఎలక్ట్రిక్ బైక్‌ల విషయానికి వస్తే, ఇవి రెండూ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌లతో పనిచేస్తాయి. ఆర్‌వి300లో ఎలక్ట్రిక్ బైక్‌లో 60వి 2.7 కిలో వాట్ అవర్ బ్యాటరీ ఉంటుంది. ఈ రివాల్ట్ ఆర్‌వి 300 ఒకే ఛార్జీతో 180 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఇందులో ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్స్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్ స్పోర్ట్ మోడ్‌లో గంటకు 85 కి.మీ వేగంతో ఉంటుంది.

భారీగా పెరిగిన రివాల్ట్ మోటార్‌సైకిల్ ధరలు; కొత్త ధరల జాబితా

రివాల్ట్ ఆర్‌వి 400 ఎలక్ట్రిక్ బైక్‌లో 72వి 3.24 కిలో వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 150 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఈ బైక్‌లో కూడా పైన పేర్కొన్న మూడు రైడింగ్ మోడ్స్ లభిస్తాయి.

MOST READ:తల్లిదండ్రులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి 1,100 కి.మీ ప్రయాణించిన కొడుకు

Most Read Articles

English summary
Revolt has increased the prices of its RV300 and RV400 electric motorcycles in India by Rs 14,200. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X