ముంబైలో రివోల్ట్ ఆర్‌వి300, ఆర్‌వి400 ఎలక్ట్రిక్ బైక్స్ విడుదల; వివరాలు

ఢిల్లీకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ రివోల్ట్ అందిస్తున్న పాపులర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు ఆర్‌వి400 మరియు ఆర్‌వి300 మోడళ్లను ముంబై నగరంలో విడుదల చేసింది. ముంబైలో ఈ రెండు మోడళ్లను విడుదల చేయడమే కాకుండా, అంధేరీ వెస్ట్‌లో కస్టమర్ల కోసం ఓ ప్రత్యేకమైన రివోల్ట్ హబ్‌ను కూడా కంపెనీ ప్రారంభించింది.

ముంబైలో రివోల్ట్ ఆర్‌వి300, ఆర్‌వి400 ఎలక్ట్రిక్ బైక్స్ విడుదల; వివరాలు

రివోల్ట్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న రెండు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు ఆర్‌వి300 మరియు ఆర్‌వి400 కోసం కంపెనీ రెండు రకాల పేమెంట్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. అందులో ఒకటి నేరుగా ఈ మోటార్‌సైకిళ్ల మొత్తం ధరను ఒకేసారి చెల్లించడం. ఇకపోతే రెండవది నెలవారీ వాయిదాల ప్రకారం, చందా పద్దతిన వీటిని కొనుగోలు చేయటం.

ముంబైలో రివోల్ట్ ఆర్‌వి300, ఆర్‌వి400 ఎలక్ట్రిక్ బైక్స్ విడుదల; వివరాలు

రివోల్ట్ నెలవారీ చెల్లింపు పథకం ప్రకారం, ఆర్‌వి300 మోడల్ కోసం నెలవారీ చందా రూ.2,999 (36 నెలలు మరియు వెబ్‌సైట్‌లో రూ.2,999 వన్-టైమ్ బుకింగ్ అమౌంట్)గా ఉంటుంది. అలాగే, ఆర్‌వి400 మోడల్ కోసం నెలవారీ చందా రూ.3,999 (36 నెలలు మరియు వెబ్‌సైట్‌లో రూ.3,999 వన్-టైమ్ బుకింగ్ అమౌంట్)గా ఉంటుంది.

MOST READ:లాంగ్ డ్రైవ్ చేయాలనుకునే వారికి 5 ఉత్తమ పర్యాటక ప్రదేశాలు & ఉత్తమ బైక్‌లు ఇవే

ముంబైలో రివోల్ట్ ఆర్‌వి300, ఆర్‌వి400 ఎలక్ట్రిక్ బైక్స్ విడుదల; వివరాలు

అలా కాకుండా, ఈ రెండు మోటార్‌సైకిళ్లను వన్-టైమ్ పేమెంట్ ద్వారా కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఆర్‌వి300 కోసం రూ.89,999 మరియు ఆర్‌వి400 కోసం రూ.1.08 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై) చెల్లించాల్సి ఉంటుంది. ఈ వన్-టైమ్ పేమెంట్‌లోనే అపరిమిత బ్యాటరీ మార్పు సదుపాయం కూడా చేర్చబడి ఉంటుంది.

ముంబైలో రివోల్ట్ ఆర్‌వి300, ఆర్‌వి400 ఎలక్ట్రిక్ బైక్స్ విడుదల; వివరాలు

బైక్ యాజమాన్యానికి సంబంధించిన ఇతర ఖర్చుల విషయానికి వస్తే.. రిజిస్ట్రేషన్ ఖర్చు, భీమా (ఇన్సూరెన్స్), స్మార్ట్ కార్డ్ ఫీజు, 3 సంవత్సరాల పాటు 4జి కనెక్టివిటీ కోసం తప్పనిసరి వన్-టైమ్ పేమెంట్‌లు ఉంటాయి. అలాగే, వన్-టైమ్ పేమెంట్ ప్రణాళికలో 3 సంవత్సరాల మెయింటినెన్స్ మరియు 8 సంవత్సరాలు / 1,50,000 కిలోమీటర్ల వారంటీ చేర్చబడి ఉండదు. చందా ఆధారిత మై రివోల్ట్ ప్లాన్‌తో కొనుగోలు చేసే కస్టమర్లకు ఇది అందుబాటులో ఉంటుంది.

MOST READ:2 కి.మీ కార్ బోనెట్ మీద వేలాడుతూ వెళ్లిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ , ఎందుకో మీరే చూడండి

ముంబైలో రివోల్ట్ ఆర్‌వి300, ఆర్‌వి400 ఎలక్ట్రిక్ బైక్స్ విడుదల; వివరాలు

రివోల్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల విషయానికి వస్తే, ఆర్‌వి300 మోడల్‌లో 1.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 2.7 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను గరిష్టంగా గంటకు 65 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. పూర్తి చార్జ్‌పై ఇది 120 కి.మీ దూరణం ప్రయాణిస్తుంది.

ముంబైలో రివోల్ట్ ఆర్‌వి300, ఆర్‌వి400 ఎలక్ట్రిక్ బైక్స్ విడుదల; వివరాలు

టాప్-ఎండ్ మోడల్ అయిన ఆర్‌వి400 మోడల్‌లో 3.0 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 3.24 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను గరిష్టంగా గంటకు 85 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. పూర్తి చార్జ్‌పై ఇది 156 కి.మీ దూరణం ప్రయాణిస్తుంది.

MOST READ:హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి స్పోర్ట్ ట్రిమ్ వేరియంట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ముంబైలో రివోల్ట్ ఆర్‌వి300, ఆర్‌వి400 ఎలక్ట్రిక్ బైక్స్ విడుదల; వివరాలు

రివోల్ట్ అందిస్తున్న ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లలో అనేక ఫీచర్లు, పరికరాలు అమర్చబడి ఉంటాయి. ఇందులో ప్రధానంగా, ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడి టెయిల్ లైట్స్ ఉంటాయి. ఇంకా ఉందులో స్మార్ట్‌ఫోన్ యాప్ కనెక్టింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఇది జియోఫెన్సింగ్, వాహన స్థితి, లైవ్ వెహికల్ ట్రాకింగ్ వంటి ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

ముంబైలో రివోల్ట్ ఆర్‌వి300, ఆర్‌వి400 ఎలక్ట్రిక్ బైక్స్ విడుదల; వివరాలు

ముంబైలో రివోల్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత మార్కెట్లో కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడం క్రమక్రమంగా పెరుగుతోంది. రివోల్డ్ కూడా దశలవారీగా దేశంలోని మరిన్ని ఇతర నగరాలకు తమ నెట్‌వర్క్‌ను విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కంపెనీ ప్రవేశపెట్టిన కొత్త చందా ఆధారిత పేమెంట్ మోడల్‌లో రీపేమెంట్ స్థాయి చాలా తక్కువగా ఉండి, అన్ని రకాల కస్టమర్లకు అందుబాటులో ఉంది. తక్కువ మొత్తంలో ఈఎమ్ఐ చెల్లించి ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను సొంతం చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
Revolt electric motorcycles, the RV 400 and the RV 300 are now open for bookings in Mumbai. The company has launched both the motorcycle along with a new Revolt Hub in Andheri West area of the city. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X