భారతదేశంలో రివాల్ట్ ఇంటెల్లికార్ప్ కొత్త సేల్స్ పాయింట్స్ ఇవే

పూణేకి చెందిన ఎలక్ట్రిక్ మోటార్ వాహన తయారీ సంస్థ రివాల్ట్ ఇంటెల్లికార్ప్ ఈ ఏడాది మార్చి చివరినాటికల్లా భారతదేశంలో కొన్ని కొత్త షోరూంలను ప్రారంభించడానికి సన్నాహాలను సిద్ధం చేస్తుంది. భారతదేశంలో రివాల్ట్ ఇంటెల్లికార్ప్ ప్రారంభించనున్న కొత్త షోరూంలు అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబై, మరియు చెన్నై. ఈ షోరూంల ద్వారా తమ ఉనికిని విస్తరించడానికి సిద్ధంగా ఉంది.

భారతదేశంలో రివాల్ట్ ఇంటెల్లికార్ప్ కొత్త సేల్స్ పాయింట్స్ ఇవే

రివాల్ట్ ఆర్‌వి 300 మరియు రివాల్ట్ ఆర్‌వి 400 మోటార్‌సైకిల్‌కు పేరుగాంచిన ఈ సంస్థ ప్రస్తుతం పూణే మరియు ఢిల్లీలో మాత్రమే ఉంది. ఫిబ్రవరి 29 న అహ్మదాబాద్‌లో ఒక షోరూంను ప్రారంభిస్తుంది. మార్చి 2 న హైదరాబాద్, మార్చి 5 న చెన్నై, మార్చి చివరి నాటికి ముంబైలో షోరూంలను ప్రారంభిస్తుంది అని కంపెనీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.

భారతదేశంలో రివాల్ట్ ఇంటెల్లికార్ప్ కొత్త సేల్స్ పాయింట్స్ ఇవే

ప్రతి కంపెనీ తన ఉత్పత్తి సామర్త్యాన్ని పెంచుకోవాలి ఆలోచిస్తుంది. తమ మోటార్ సైకిల్స్ కి మార్కెట్లో మంచి డిమాండ్ ని కూడా కలిగి ఉండటానికి ప్రయాత్నాలు చేస్తుంది. ఇప్పటికే రివాల్ట్ కంపెనీ ఆర్‌వి 400 మోడల్ యొక్క వెయిటింగ్ పీరియడ్ 5 నెలల నుంచి 3 నెలలకు తగ్గించింది.

భారతదేశంలో రివాల్ట్ ఇంటెల్లికార్ప్ కొత్త సేల్స్ పాయింట్స్ ఇవే

రివాల్ట్ ఇంటెలికార్ప్ వ్యవస్థాపకుడు 'రాహుల్ శర్మ' మాట్లాడుతూ భారతదేశంలో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ బాగా జరుగుతూ ఉంది. ఈ క్రమంలో చాలా సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టాయి. ఇదే విధంగా రివాల్ట్ సంస్థ కూడా తమ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి కృషి చేస్తుందని చెప్పారు. ఈ వాహనాలకు వెయిటింగ్ పీరియడ్ కూడా ఇప్పుడు తగ్గించామని తెలిపారు.

భారతదేశంలో రివాల్ట్ ఇంటెల్లికార్ప్ కొత్త సేల్స్ పాయింట్స్ ఇవే

రివాల్ట్ ఆర్‌వి 300, 2.7 kWh లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 60 వి శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు పూర్తి ఛార్జీతో 180 కిలోమీటర్లు దూరం ప్రయాణించగలదు. ఈ వాహనం యొక్క బ్యాటరీ ఛార్జ్ చేయడానికి మూడు గంటలు పడుతుంది.

భారతదేశంలో రివాల్ట్ ఇంటెల్లికార్ప్ కొత్త సేల్స్ పాయింట్స్ ఇవే

ఆర్‌వి 300 మోటార్ సైకిల్ స్టాండర్డ్, ఎకో మరియు స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లతో వస్తుంది. ఇందులో జియో ఫెన్సింగ్, మానిటర్ రైడింగ్ స్టైల్, రియల్ టైమ్ బ్యాటరీ కంసుంప్షన్, 4 జి కనెక్టివిటీ, సిక్స్-వే అడ్జస్టబుల్ ఫుట్ పెగ్స్ మరియు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

భారతదేశంలో రివాల్ట్ ఇంటెల్లికార్ప్ కొత్త సేల్స్ పాయింట్స్ ఇవే

రివాల్ట్ ఆర్‌వి 300 ను నెలకు రూ. 2,999 ధర గల సబ్స్క్రిప్సన్ ప్లాన్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ప్లాన్ లో అన్ లిమిటెడ్ బ్యాటరీ స్విచింగ్, మూడేళ్లపాటు అన్ లిమిటెడ్ మెయింటెనెన్స్ మరియు ఇన్సూరెన్స్, వారంటీ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. 4 జీ కనెక్టివిటీ కావలనుకుంటే మూడేళ్లకు అదనంగా రూ. 5 వేలు చెల్లించాల్సి ఉంటుంది.

భారతదేశంలో రివాల్ట్ ఇంటెల్లికార్ప్ కొత్త సేల్స్ పాయింట్స్ ఇవే

రివాల్ట్ ఆర్‌వి 400 విషయానికి వస్తే ఇది 3.24 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 72 వి శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు పూర్తి ఛార్జీతో 150 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. బ్యాటరీ ఛార్జ్ చేయడానికి నాలుగున్నర గంటలు పడుతుంది, మరియు బ్యాటరీ స్విచ్ స్టేషన్లలో మార్చుకోవచ్చు.

భారతదేశంలో రివాల్ట్ ఇంటెల్లికార్ప్ కొత్త సేల్స్ పాయింట్స్ ఇవే

ఆర్‌వి 400 రైడింగ్ మోడ్‌లతో వస్తుంది. రిమోట్ స్టార్టింగ్, జియో-ఫెన్సింగ్, ఆర్టిఫీషియల్ ఎగ్జాస్ట్ నోట్ సిస్టం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్, రియల్ టైమ్ బ్యాటరీ కంసుంప్షన్, స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్, 2 వే అడ్జస్టబుల్ ఫుట్ పెగ్‌లు , మరియు 4 జి కనెక్టివిటీ ఇందులో ఉంటాయి. మై రివోల్ట్ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్, ట్రిప్స్ మానిటర్, జియో-ఫెన్సింగ్, లొకేట్ యువర్ బైక్ ఫ్యూచర్ వంటి అనేక లక్షణాలను అందిస్తుంది.

భారతదేశంలో రివాల్ట్ ఇంటెల్లికార్ప్ కొత్త సేల్స్ పాయింట్స్ ఇవే

రివాల్ట్ ఆర్‌వి 400 ను రెండు సబ్స్క్రిప్సన్ ప్రణాళికల ద్వారా కొనుగోలు చేయవచ్చు. అవి బేస్డ్ మరియు ప్రీమియం ప్లాన్స్. బేస్ ప్లాన్ నెలకు రూ. 3,499 ఖర్చు అవుతుంది మరియు అన్ లిమిటెడ్ బ్యాటరీ మార్పిడి, అన్ లిమిటెడ్ నిర్వహణ, ఇన్సూరెన్స్ మరియు ఐదేళ్ల ఉత్పత్తి వారంటీని అందిస్తుంది. 4 జీ కనెక్టివిటీ కోసం మూడేళ్లకు అదనంగా రూ .5 వేలు చెల్లించాలి.

భారతదేశంలో రివాల్ట్ ఇంటెల్లికార్ప్ కొత్త సేల్స్ పాయింట్స్ ఇవే

ప్రీమియం ప్లాన్‌కు నెలకు రూ. 3,999 ఖర్చవుతుంది. ఇందులో కూడా అన్ లిమిటెడ్ బ్యాటరీ మార్పిడి, అన్ లిమిటెడ్ నిర్వహణ, ఇన్సూరెన్స్, ఐదేళ్ల ఉత్పత్తి వారంటీ, ఇమ్మొబిలైజర్, రిమోట్ కీ, పుష్ స్టార్ట్ బటన్ మరియు ఎగ్జాస్ట్ నోట్ సిమ్యులేటర్‌ను అందిస్తుంది.

భారతదేశంలో రివాల్ట్ ఇంటెల్లికార్ప్ కొత్త సేల్స్ పాయింట్స్ ఇవే

ఈ ప్లాన్‌లో వన్-టైమ్ టైర్ రీప్లేస్‌మెంట్ మరియు 4 జి కనెక్టివిటీ కూడా ఉన్నాయి.ఆర్‌వి 300 ధర రూ. 1.11 లక్షలు మరియు ఆర్‌వి 400 ధర రూ. 1.30 లక్షలు (ఎక్స్‌షోరూమ్).

భారతదేశంలో రివాల్ట్ ఇంటెల్లికార్ప్ కొత్త సేల్స్ పాయింట్స్ ఇవే

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రివాల్ట్ ఇంటెల్లికార్ప్ ఎలక్ట్రిక్ వాహన తయారీలో మంచి అభివృద్ధిని సాధిస్తోంది. ఈ ఏడాది భారతదేశంలో మరికొన్ని నగరాల్లో ఈ వాహనాలను విస్తరింపచేయడం హర్షించదగ్గ విషయం. ఎట్టకేలకు ఈ సంవత్సరంలో మరికొన్ని నగరాల్లో రివాల్ట్ ఇంటెల్లికార్ప్ తన షోరూంలను ఏర్పాటు చేస్తుంది.

Most Read Articles

English summary
Revolt Intellicorp To Expand Presence In India: Ahmedabad, Hyderabad, Chennai & Mumbai On List. Read in Telugu.
Story first published: Wednesday, February 26, 2020, 14:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X