రాయల్ ఎన్‌ఫీల్డ్ కస్టమర్ల కోసం సరికొత్త మొబైల్ యాప్ - కంప్లీట్ డీటేల్స్

మేడ్ ఇన్ ఇండియా ప్రీమియం మోటార్‌సైకిల్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ భారత మార్కెట్లో తమ కస్టమర్లుమరియు భవిష్యత్ కస్టమర్ల కోసం కంపెనీ ఓ కొత్త మొబైల్ యాప్‌ను విడుదల చేసింది. ఈ మొబైల్ యాప్ ఐఓఎస్ మరియు ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కస్టమర్ల కోసం సరికొత్త మొబైల్ యాప్ - కంప్లీట్ డీటేల్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త మైబల్ యాప్ సాయంతో కొత్త మోటార్‌సైకిళ్ల ఆన్‌లైన్ బుకింగ్ మరియు సర్వీస్ అపాయింట్‌మెంట్‌ను బుక్ చేసుకోవటం వంటి సేవలు పొందవచ్చు. సర్వీస్ అపాయింట్‌మెంట్ కోసం కస్టమర్లు అందుబాటులో ఉన్న, తమకు నచ్చిన తేదీని మరియు సమయాన్ని ఎంచుకోవచ్చు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కస్టమర్ల కోసం సరికొత్త మొబైల్ యాప్ - కంప్లీట్ డీటేల్స్

సర్వీస్ కోసం కస్టమర్ తమ మోటార్‌సైకిల్‌ను సర్వీస్ సెంటర్‌లో వదిలివెళ్లే, వాహన సర్వీస్ యొక్క స్థితి గురించి కస్టమర్ ఈ యూప్ సాయంతో దశల వారీగా అప్‌డేట్ తెలుసుకోవచ్చు. ఈ సదుపాయం ద్వారా కస్టమర్‌లు తమ రోజును ప్లాన్ చేసుకోవటానికి మరియు రద్దీ లేకుండా తమ మోటారుసైకిల్‌ను సర్వీస్ చేయించుకోవటానికి సహకరిస్తుంది.

MOST READ:డీలర్‌షిప్ చేరుకున్న ఆడి ఆర్‌ఎస్ క్యూ 8 ఎస్‌యూవీ, డెలివరీ ఎప్పుడంటే

రాయల్ ఎన్‌ఫీల్డ్ కస్టమర్ల కోసం సరికొత్త మొబైల్ యాప్ - కంప్లీట్ డీటేల్స్

ఈ యాప్‌లో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ నుండి రాబోయే రైడ్స్ అండ్ ఈవెంట్‌లను అన్వేషించడానికి మరియు వాటి కోసం నమోదు చేసుకోవటానికి ఇది సహకరిస్తుంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా, కస్టమర్లు తమ స్వంత రైడ్స్ లేదా రూట్‌ను కూడా ఇందులో సృష్టించుకోవచ్చు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కస్టమర్ల కోసం సరికొత్త మొబైల్ యాప్ - కంప్లీట్ డీటేల్స్

ఈ కొత్త యాప్ ద్వారా రాయల్ ఎన్‌ఫీల్డ్ కమ్యూనిటీలో భాగం కావచ్చు. భవిష్యత్ కస్టమర్లు తమకు నచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ను పరిశోధించడానికి మరియు బుక్ చేసుకోవడానికి ఈ యాప్‌లో సౌలభ్యం ఉంటుంది. ప్రస్తుతం బ్రాండ్ విక్రయించే అన్ని మోడళ్లను ఈ కొత్త అప్లికేషన్‌లో లిస్ట్ చేయబడ్డాయి.

MOST READ:కొడుకు కార్లు తీసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి, ఎందుకో తెలుసా ?

రాయల్ ఎన్‌ఫీల్డ్ కస్టమర్ల కోసం సరికొత్త మొబైల్ యాప్ - కంప్లీట్ డీటేల్స్

ఈ యాప్ ద్వారా కస్టమర్లు తమకు నచ్చిన స్టోర్‌ను ఎంచుకోవటం, సదరు స్టోర్ నుండే బైక్ డెలివరీ తీసుకోవటం వంటివి చేయవచ్చు. అంతేకాకుండా కస్టమర్లు ఆన్‌లైన్‌లో తమకు నచ్చిన వాహనాన్ని బుక్ చేసుకోవటం కోసం వివిధ రకాల పేమెంట్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో, ఈ కొత్త యాప్ కస్టమర్లకు కాంటాక్ట్‌లెస్ కొనుగోలు అనుభవాన్ని అందిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కస్టమర్ల కోసం సరికొత్త మొబైల్ యాప్ - కంప్లీట్ డీటేల్స్

ఈ యాప్‌లో కొన్ని డిఐవై (డు ఇట్ యువర్‌సెల్ఫ్) గైడ్‌లు కూడా ఉన్నాయి. ఇవి వినియోగదారుని తదుపరి రైడ్ కోసం సిద్ధం చేస్తుంది లేదా మోటార్‌సైకిల్‌లో తలెత్తే చిన్నపాటి సమస్యలకు పరిష్కరాన్ని చూపించడంలో సహాయపడుతుంది. అదనంగా, యూజర్లు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కోసం వెంటనే సంప్రదించడానికి కూడా ఈ యాప్‌ను ఉపయోగించవచ్చు.

MOST READ:దుమ్ము రేపుతున్న కొత్త మహీంద్రా థార్ ఆఫ్-రోడ్ క్యాపబిలిటీస్ వీడియో

రాయల్ ఎన్‌ఫీల్డ్ కస్టమర్ల కోసం సరికొత్త మొబైల్ యాప్ - కంప్లీట్ డీటేల్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, కంపెనీ ఓ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌పై పనిచేస్తుందని సమాచారం. భారత్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ మార్కెట్లో వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, ఓ కొత్త ఎలక్ట్రిక్ మోడల్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ఈ విభాగంలో కాలు మోపాలని రాయల్ ఎన్‌ఫీల్డ్ భావిస్తోంది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కస్టమర్ల కోసం సరికొత్త మొబైల్ యాప్ - కంప్లీట్ డీటేల్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త మొబైల్ యాప్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రవేశపెట్టిన కొత్త మొబైల్ అప్లికేషన్ వినియోగదారులకు తమ మోటార్‌సైకిల్ సర్వీస్ అపాయింట్‌మెంట్‌ను బుక్ చేసుకోవడాన్ని మరింత సులువు చేస్తుంది. అంతే కాకుండా, కొత్త కస్టమర్లు తమకు నచ్చిన మోడళ్ల గురించి తెలుసుకోవటానికి, వాటిని బుక్ చేసుకోవటానికి ఇది సహకరిస్తుంది.

MOST READ:కొడుకు పరీక్ష రాయించడానికి 105 కి.మీ సైకిల్ పై తీసుకెళ్లిన తండ్రి

Most Read Articles

English summary
Tamil Nadu-based two-wheeler manufacturer, Royal Enfield has launched a new mobile app for customers and prospective buyers in the Indian market. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X