రాయల్ ఎన్‌ఫీల్డ్ 'మీటియోర్' బ్రోచర్ లీక్; అన్ని వివరాలు వెల్లడి!

రాయల్ ఎన్‌ఫీల్డ్ భారత మార్కెట్ కోసం "మీటియోర్" అనే కొత్త మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. థండర్‌బర్డ్ 350 స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు వస్తున్న ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350కి సంబంధించి తాజాగా బ్రోచర్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. దీన్నిబట్టి చూస్తుంటే, అతి త్వరలోనే ఈ మోడల్ మార్కెట్లో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 'మీటియోర్' బ్రోచర్ లీక్; అన్ని వివరాలు వెల్లడి!

రష్‌లేన్ లీక్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ మోటార్‌సైకిల్ బ్రోచర్ వివరాలను గమనిస్తే, ఇది విభిన్న వేరియంట్లు, కలర్ ఆప్షన్లు మరియు ఫీచర్లతో లభ్యం కానున్నట్లు తెలుస్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 'మీటియోర్' బ్రోచర్ లీక్; అన్ని వివరాలు వెల్లడి!

ముందుగా వేరియంట్ల వివరాలను గమనిస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ ఫైర్‌బాల్, స్టెల్లార్ మరియు సూపర్‌నోవా అనే మూడు వేరియంట్లలో లభ్యం కానుంది. వేరియంట్ల పేర్లతో పాటుగా ప్రతి వేరియంట్ కలర్ ఆప్షన్లు, వివరాలను కూడా ఈ బ్రోచర్ తెలియజేస్తుంది.

MOST READ: భారత్‌లో హోండా హార్నెట్ 2.0 విడుదల - ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

రాయల్ ఎన్‌ఫీల్డ్ 'మీటియోర్' బ్రోచర్ లీక్; అన్ని వివరాలు వెల్లడి!

లీకైన చిత్రాల ప్రకారం, బేస్ వేరియంట్ అయిన ‘ఫైర్‌బాల్' ట్రిప్పర్ నావిగేషన్, సింగిల్ కలర్ ట్యాంక్, బాడీ గ్రాఫిక్స్ మరియు డెకాల్స్, కలర్ రిమ్ టేప్ మరియు బ్లాక్-అవుట్ కాంపోనెంట్స్ మరియు మెషిన్డ్ ఫిన్స్‌తో కూడిన ఇంజన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫైర్‌బాల్ కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇది ఎల్లో అండ్ రెడ్ కలర్స్‌లో లభిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 'మీటియోర్' బ్రోచర్ లీక్; అన్ని వివరాలు వెల్లడి!

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 మిడ్ వేరియంట్ అయిన ‘స్టెల్లార్'లో ట్రిప్పర్ నావిగేషన్, బాడీ-కలర్ కాంపోనెంట్స్, ప్రీమియం బ్యాడ్జ్‌లు, క్రోమ్-ఫినిష్డ్ ఎలిమెంట్స్‌తో కూడిన ఎగ్జాస్ట్ కవర్ మరియు హ్యాండిల్‌బార్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్టెల్లార్ వేరియంట్‌లో పిలియన్ రైడర్స్ కోసం బ్యాక్‌రెస్ట్ ఉంటుంది. ఇది మెటాలిక్ రెడ్, మ్యాట్ బ్లాక్ మరియు మెటాలిక్ బ్లూ కలర్లలో లభిస్తుంది.

MOST READ: భారత్‌లో ఆడి ఆర్ఎస్ క్యూ8 విడుదల, ధర తెలిస్తే షాక్ అవుతారు!

రాయల్ ఎన్‌ఫీల్డ్ 'మీటియోర్' బ్రోచర్ లీక్; అన్ని వివరాలు వెల్లడి!

టాప్-ఎండ్ వేరియంట్ అయిన ‘సూపర్‌నోవా'లో పైన పేర్కొన్న ఫీచర్లతో పాటుగా ప్రీమియం డ్యూయెల్-టోన్ పెయింట్ కలర్, ప్రీమియం సీట్ అప్‌హోలెస్ట్రీ, విండ్‌స్క్రీన్, క్రోమ్ ఇండికేటర్స్, మెషిన్డ్ వీల్స్ మరియు ట్రిప్పర్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది బ్రౌన్ మరియు బ్లూ డ్యూయెల్-టోన్ పెయింట్ కలర్ ఆప్షన్లతో లభిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 'మీటియోర్' బ్రోచర్ లీక్; అన్ని వివరాలు వెల్లడి!

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350లో పైన పేర్కొన్న ఫీచర్లతో పాటుగా ఇందులోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు అనలాగ్ స్పీడోమీటర్ మధ్య కొత్త డిజిటల్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిజిటల్ డిస్‌ప్లేలో ట్రిప్ మీటర్లు, ఇంధన స్థాయిలు, సర్వీస్ ఇండికేటర్, గడియారం మొదలైన సమాచారాన్ని రైడర్‌కు తెలియజేస్తుంది.

MOST READ: భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ 'మీటియోర్' బ్రోచర్ లీక్; అన్ని వివరాలు వెల్లడి!

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ సెకండరీ డిజిటల్ క్లస్టర్‌తో వస్తుంది, ఇది కలర్ టిఎఫ్‌టి స్క్రీన్‌ను కలిగి ఉంటుంది మరియు టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను కూడా అందిస్తుంది. కొత్త మీటియరో 350 బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని కూడా సపోర్ట్ చేస్తుంది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 'మీటియోర్' బ్రోచర్ లీక్; అన్ని వివరాలు వెల్లడి!

ఇంజన్ పరంగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రస్తుత 350సీసీ ఇంజన్‌ను నిలిపివేసి మరింత ఆధునికమైన 349సిసి ఎస్‌ఓహెచ్‌సి పవర్ యూనిట్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఇంజన్ మీటియోర్ 350 మోడల్ ద్వారా పరియచం కానుంది. ఆ తరువాత అన్ని భవిష్యత్ మోడళ్లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ ఇంజన్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇంజన్ పవర్, టార్క్ వివరాలు తెలియాల్సి ఉంది.

MOST READ: కొత్త 2020 హోండా జాజ్ విడుదల - ధర, ఫీచర్లు, మార్పులు, వివరాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ 'మీటియోర్' బ్రోచర్ లీక్; అన్ని వివరాలు వెల్లడి!

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 బ్రోచర్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 బ్రోచర్ ఈ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన దాదాపు అన్ని వివరాలను తెలియజేసింది. ఇది థండర్‌బర్డ్ మోడళ్ల మాదిరిగానే ఆధునిక-క్లాసిక్ డిజైన్ థీమ్‌ను కలిగి ఉంటుంది. ఇది ఈ సెగ్మెంట్లోని బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్, జావా 300 మరియు జావా ఫోర్టీ-టూ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Source: Rushlane

Most Read Articles

English summary
Royal Enfield is all set to introduce their all-new Meteor 350 motorcycle in the Indian market. The new Royal Enfield Meteor 350 once launched is expected to replace the current Thunderbird 350 lineup. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X