Just In
Don't Miss
- Finance
దారుణంగా పతనమైన బిట్‌కాయిన్, మార్చి నుండి ఇదే వరస్ట్
- Movies
HIT2 అప్డేట్.. ప్రాజెక్ట్ నుంచి విశ్వక్ సేన్ అవుట్!.. కొత్త హీరో ఎవరంటే?
- News
ఆ తపన ఉన్నా శరీరం సహకరించలేదు: చిన్నప్పుడు చీరాలలో: ఆ యుద్ధ విద్యలకు ప్రోత్సాహం: పవన్
- Sports
హైదరాబాద్‌లోనూ ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించండి.. బీసీసీఐకి కేటీఆర్ రిక్వెస్ట్!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాటా హ్యారియర్ ఇప్పుడు కొత్త ఇంజన్ వేరియంట్లలో.. విడుదల ఎప్పుడంటే?
టాటా మోటార్స్ తమ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ టాటా హ్యారియర్ మీద సరికొత్త ప్రయోగం చేస్తోంది. ఇప్పటి వరకూ కేవలం డీజల్ ఇంజన్ వేరియంట్లలో మాత్రమే లభించే హ్యారియర్ ఎస్‌యూవీ ఇకపై పెట్రోల్ వేరియంట్లలో కూడా లభించనుంది. భారత ప్రభుత్వం తప్పనిసరి చేసిన బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా సరికొత్త పెట్రోల్ ఇంజన్‌ను డెవలప్ చేస్తోంది.

రష్‌లేన్ తాజాగ ప్రచురించిన ఓ కథనంలో టాటా హ్యారియర్ పెట్రోల్ వెర్షన్ ఎస్‌యూవీ ఫోటోలను రివీల్ చేసింది. పలు పరికరాలతో ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తుండంగా ఈ ఫోటోలను సేకరించారు. బీఎస్6 డీజల్ ఇంజన్-ఆటోమేటిక్ వెర్షన్ విడుదలకు సిద్దమైన నేపథ్యంలో పెట్రోల్ వెర్షన్‌ను కూడా లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉంది.

టాటా మోటార్స్ దేశీయంగా విక్రయించే మోడళ్లలో శక్తివంతమైన పెద్ద పెట్రోల్ ఇంజన్ ఒక్కటి కూడా లేదు. ఇప్పటి వరకూ టాటా వద్ద ఉన్న ఏకైక పెద్ద పెట్రోల్ ఇంజన్ 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో లభించే ఈ ఇంజన్ గరిష్టంగా 119బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

అయితే, ఈ ఇంజన్ టాటా లైనప్‌లో ఉన్న పెద్ద ఎస్‌యూవీలైన టాటా హ్యారియర్ మరియు టాటా హెక్సా మోడళ్లకు ఏ మాత్రం సరిపోదు. ఈ నేపథ్యంలో 150బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే సరికొత్త నాలుగు సిలిండర్ల 1.5-లీటర్ల పెట్రోల్ ఇంజన్‌ను అభివృద్ది చేస్తున్నారు.

ఏప్రిల్ 01, 2020 నుండి అమల్లోకి రానున్న బీఎస్6 ఉద్గార నియమాల కారణంగా, డీజల్ వెహికల్ సేల్స్ నానాటికీ పడిపోతూనే ఉన్నాయి. అంతే కాకుండా డీజల్ వేరియంట్లకు డిమాండ్ కూడా తగ్గిపోతోంది. ఇందుకు టాటా నెక్సాన్ సేల్స్ అత్యుత్తమ ఉదాహరణ, మొత్తం విక్రయాల్లో 70 శాతం సేల్స్ పెట్రోల్ వేరియంట్ల నుండే నమోదవుతున్నాయి.

టాటా హ్యారియర్‌కు ప్రధాన పోటీగా ఉన్న ఎంజీ హెక్టార్ ఎస్‌యూవీ సేల్స్ పరిశీలిస్తే, 50 శాతం సేల్స్ పెట్రోల్ వేరియంట్ల నుండే వస్తున్నాయి. దీంతో టాటా మోటార్స్ హ్యారియర్ ఎస్‌యూవీని పెట్రోల్ వెర్షన్‌లో ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది.

ప్రస్తుతానికి టాటా హ్యారియర్ నెలవారీ సేల్స్ 700 యూనిట్లుగా ఉన్నాయి. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ పరిచయంతో సేల్స్ రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. దీనికి తోడు ప్రస్తుతం 5-సీటర్ వెర్షన్‌లో మాత్రమే లభించే హ్యారియర్ ఎస్‌యూవీని 7-సీటర్ వెర్షన్‌లో గ్రావిటాస్ పేరుతో తీసుకొస్తోంది.

టాటా హ్యారియర్ పెట్రోల్ వేరియంట్ పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదలైతే, విపణిలో ఉన్న ఎంజీ హెక్టార్ 1.5-లీటర్ పెట్రోల్, జీప్ కంపాస్ 1.4-లీటర్ పెట్రోల్ మరియు అతి త్వరలో విడుదల కానున్న కొత్త తరం మహీంద్రా ఎక్స్‌యూవీ500 2.0-లీటర్ టుర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ మోడళ్లకు ధీటైన పోటీనివ్వనుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
టాటా మోటార్స్ మార్కెట్లోకి విడుదల చేసే మోడళ్లను సేల్స్ పరంగా అభివృద్ది బాట పట్టించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇంజన్, ట్రాన్స్‌మిషన్ మరియు ఫీచర్ల పరంగా పోటీదారులను ఎదుర్కుంటూనే కస్టమర్లను చేరువవుతోంది. అందుకు టాటా హ్యారియర్ పెట్రోల్ ఒక చక్కటి ఉదాహరణ. మరి టాటా హ్యారియర్ పెట్రోల్ పర్ఫామెన్స్ వెర్షన్ కోసం ఎదురుచూస్తున్నారా..? మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్స్ ద్వారా మాతో పంచుకోండి.
Source: Rushlane