భారత్ కోసం ట్రైయంప్ బడ్జెట్ బైక్ - ట్రైడెంట్

బ్రిటీష్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రైయంప్ భారత మార్కెట్లో సరసమైన ధరకే ఓ అద్భుతమైన బడ్జెట్ ఫ్రెండ్లీ మోటార్‌సైకిల్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. మిడ్-సైజ్ (500-700సిసి) విభాగంలో ట్రైయంప్ ఈ కొత్త మోటార్‌సైకిల్‌ను పరిచయం చేవచ్చని తెలుస్తోంది.

భారత్ కోసం ట్రైయంప్ బడ్జెట్ బైక్ - ట్రైడెంట్

తాజాగా, హెచ్‌టి ఆటో ప్రచురించిన ఓ కథనం ప్రకారం, ట్రైయంప్ ట్రైడెంట్ పేరుతో ఈ కంపెనీ ఓ కొత్త మోటార్‌సైకిల్‌ను భారత్ కోసం తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రైయంప్ మోటార్‌సైకిల్స్ గడచిన ఆగస్ట్ నెలలో తమ కొత్త ట్రైడెంట్ డిజైన్ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది.

భారత్ కోసం ట్రైయంప్ బడ్జెట్ బైక్ - ట్రైడెంట్

ఈ కాన్సెప్ట్ ఆధారంగా చేసుకొని, ఇందులో మిడ్-కెపాసిటీ ట్రిపుల్-సిలిండర్ ట్రైడెంట్ స్ట్రీట్‌ఫైటర్‌ను కంపెనీ డెవలప్ చేస్తున్నట్లు సమాచారం. భారత మార్కెట్లో ట్రైయంప్ చాలా వేగంగా తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది. ఇదే సమయంలో, భారత్ మార్కెట్ నుండి ట్రైయంప్ బ్రాండ్‌కు మంచి ఆదరణ కూడా లభిస్తోంది.

MOST READ:ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి అక్కడ వాటర్ టాక్సీ సర్వీస్.. ఎక్కడో తెలుసా ?

భారత్ కోసం ట్రైయంప్ బడ్జెట్ బైక్ - ట్రైడెంట్

ఈ నేపథ్యంలో, భారతదేశం వంటి మార్కెట్లను టార్గెట్‌గా చేసుకొని ట్రైయంప్ ట్రైడెంట్ కాన్సెప్ట్ ఆధారంగా కంపెనీ అందులో ఓ ప్రొడక్షన్ వెర్షన్‌ను తయారు చేసే అవకాశం ఉంది. ట్రైయంప్ ట్రైడెంట్‌ను బ్రాండ్ యొక్క ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ఎంట్రీ లెవల్ మోడల్‌గా పరిచయం చేయవచ్చని తెలుస్తోంది.

భారత్ కోసం ట్రైయంప్ బడ్జెట్ బైక్ - ట్రైడెంట్

ఇదే గనుక జరిగితే, ట్రైడెంట్ మోటార్‌సైకిల్‌తో ట్రైయంప్ ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షించడానికి మరియు ఈ విభాగంలో కవాసాకి జెడ్650 వంటి మోడళ్లతో పోటీ పడటానికి ఇది సహాయపడుతుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ట్రైయంప్ ట్రైడెంట్ భారత మార్కెట్‌కు రావచ్చని అంచనా.

MOST READ:బిఎండబ్ల్యు సూపర్ బైక్ డిజైన్ కాపీ కొట్టిన చైనా.. ఈ బైక్ ఎలా ఉందో మీరే చూడండి

భారత్ కోసం ట్రైయంప్ బడ్జెట్ బైక్ - ట్రైడెంట్

ఈ విషయంపై ట్రైయంప్ మోటార్‌సైకిల్స్ ఇండియా బిజినెస్ హెడ్ షూబ్ ఫారూక్ హెచ్‌టి ఆటోతో మాట్లాడుతూ.. "ఈ మోటార్‌సైకిల్‌ను మా శ్రేణిలో అతి తక్కువ ధర కలిగిన ఉత్పత్తిగా ఉంచాలని మేము చూస్తున్నాము. ప్రస్తుతం మా ప్రోడక్ట్ లైనప్‌లో ఎంట్రీ లెవల్ మోడల్ అయిన స్ట్రీట్ ట్విన్ ప్రారంభ ధర రూ.7.45 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కాబట్టి, కొత్త మోటార్‌సైకిల్‌ను దీని కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంచాలని చూస్తున్నామని" అన్నారు.

భారత్ కోసం ట్రైయంప్ బడ్జెట్ బైక్ - ట్రైడెంట్

"అయితే, ఈ ధరపై వచ్చే అక్టోబర్ లేదా నవంబర్ నాటికి ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. కాని, ఈ మోటార్‌సైకిల్‌కు మాత్రం మేము చాలా అగ్రెసివ్‌గా, సరసమైన ధరను ప్రకటించే అవకాశం ఉంద"ని ఆయన అన్నారు.

MOST READ:సాధారణ ఇన్నోవా డ్రైవర్‌ని సన్మానించిన టయోటా డీలర్.. ఎందుకో తెలుసా ?

భారత్ కోసం ట్రైయంప్ బడ్జెట్ బైక్ - ట్రైడెంట్

వచ్చే ఏడాది ఆరంభంలో ఈ కొత్త మోటార్‌సైకిల్ భారత మార్కెట్లో విడుదల కావచ్చని ఫరూక్ సూచించారు. "ఇది మాకు చాలా ముఖ్యమైన ఉత్పత్తి ఎందుకంటే దీని కోసం మేము చాలా కష్టపడుతున్నాము. వచ్చే ఫిబ్రవరి లేదా మార్చి నాటికి ఇది మన మార్కెట్లో విడుదల కావాలని నేను ఆశిస్తున్నాను" అని అన్నారు.

భారత్ కోసం ట్రైయంప్ బడ్జెట్ బైక్ - ట్రైడెంట్

కొత్త 2021 ట్రైయంప్ ట్రైడెంట్ సమతుల్యమైన రైడింగ్ అనుభూతి కోసం ట్యూన్ చేయబడిన సరికొత్త ఛాస్సిస్‌పై నిర్మించనున్నారు. ట్రైడెంట్‌ను బెస్ట్-ఇన్-క్లాస్ టెక్నాలజీతో తయారు చేయనున్నట్లు కంపెనీ ఓ సందర్భంలో వెల్లడించింది.

MOST READ:700 కి.మీ ప్రయాణించినా పరీక్ష రాయడానికి నిరాకరించబడిన విద్యార్థి.. కారణం ఏంటో తెలుసా

భారత్ కోసం ట్రైయంప్ బడ్జెట్ బైక్ - ట్రైడెంట్

ట్రైయంప్ ట్రైడెంట్ ట్రిపుల్-సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉండి, ట్రిపుల్ మోటార్ యొక్క ప్రయోజనాలను మిడిల్‌వెయిట్ వర్గానికి పరిచయం చేయనుంది. ట్రైయంప్ తమ ట్రైడెంట్ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన టెక్నికల్ వివరాలను వెల్లడించకపోయినప్పటికీ, ఇది తక్కువ డౌన్ టార్క్ మరియు టాప్ ఎండ్ పవర్ యొక్క సంపూర్ణ సంతులనాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

భారత్ కోసం ట్రైయంప్ బడ్జెట్ బైక్ - ట్రైడెంట్

ట్రైయంప్‌కు సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, కంపెనీ ఇటీవలే భారత మార్కెట్‌లో తమ కొత్త లగ్జరీ మోటార్‌సైకిల్ 'రాకెట్ 3 జిటి'ని విడుదల చేసింది. దేశీయ విపణిలో ట్రైయంప్ రాకెట్ 3జిటి ధర రూ.18.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది. ఈ మోటార్‌సైకిల్ కోసం బుకింగ్‌లను ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

భారత్ కోసం ట్రైయంప్ బడ్జెట్ బైక్ - ట్రైడెంట్

ట్రైయంప్ ట్రైడెంట్ మోటార్‌సైకిల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత మార్కెట్లో ట్రైయంప్ తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. ట్రైడెంట్‌తో ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షించాలని మరియు కవాసాకి జెడ్ 650 వంటి మోడళ్లతో పోటీ పడాలని ట్రైయంప్ మోటార్‌సైకిల్స్ భావిస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ట్రైడెంట్ ఇండియాకు వచ్చే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
British two-wheeler brand Triumph Motorcycles plans to launch a new and most affordable motorcycle for Indian market. Company has revealed the new Trident design concept in August and it is expected to arrive in India by March next year. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X