ట్రైయంప్ బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్ విడుదల: ధర, ఫీచర్లు

బ్రిటీష్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రైయంప్, భారత మార్కెట్లో ఓ సరికొత్త మోడల్‌ను విడుదల చేసింది. కొత్త 2020 ట్రైయంప్ బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్ మోడల్‌ను కంపెనీ దేశీయ విపణిలో ప్రవేశపెట్టింది. మార్కెట్లో 2020 ట్రైయంప్ బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్ ధర రూ.11.33 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది.

ట్రైయంప్ బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్ విడుదల: ధర, ఫీచర్లు

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బిఎస్6కి అప్‌డేట్ చేయబడిన ఈ కొత్త ట్రైయంప్ బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్ ధర దాని బిఎస్4 వెర్షన్ ధరతో సమానంగా ఉంది. ఈ 2020 మోడల్ ఇయర్‌లో కొత్త బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్ మునుపటి వాటితో పాటు కొత్త రంగుల్లో లభ్యం కానుంది. ఇందులో కోబాల్ట్ బ్లూ, జెట్ బ్లాక్ మరియు డ్యూయెల్ టోన్ ఫ్యూజన్ వైట్ మరియు బ్లాక్ కలర్స్ ఉన్నాయి.

ట్రైయంప్ బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్ విడుదల: ధర, ఫీచర్లు

స్పీడ్‌మాస్టర్ కంపెనీ అందిస్తున్న బోన్‌విల్ మోడ్రన్-క్లాసిక్ లైనప్‌లో ట్రైయంప్ బ్రాండ్‌కు ప్రధానమైన మోడల్‌గా నిలుస్తుంది. ఇందులో 1200 సిసి లిక్విడ్-కూల్డ్ పారలల్ ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 6100 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 79 బిహెచ్‌పి శక్తిని మరియు 4000 ఆర్‌పిఎమ్ వద్ద 107 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్-అసిస్టెడ్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:బిఎస్ 6 హోండా యునికార్న్ ఇప్పుడు మరీ కాస్ట్లీ, ఎంతో తెలుసా?

ట్రైయంప్ బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్ విడుదల: ధర, ఫీచర్లు

ట్రైయంప్ బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్ రెట్రో లుక్స్‌తో బాబర్ తరహా డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడి టర్న్-సిగ్నల్ ఇండికేటర్స్ మరియు ఓవల్ ఆకారంలో ఉన్న ఎల్‌ఈడి టెయిల్ లాంప్స్‌తో గుండ్రటి ఆకారంలో ఉన్న ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు ఇందులో ఉన్నాయి. రెట్రో రూపానికి మరింత అందాన్ని జోడించే ఇంధన ట్యాంక్ మరియు సింగిల్-పాడ్ సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లు కూడా ఇందులో ఉన్నాయి.

ట్రైయంప్ బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్ విడుదల: ధర, ఫీచర్లు

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లోని ఎల్‌సిడి డిజిటల్ డిస్‌ప్లే రైడర్‌కు ఓడోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఫ్యూయల్ గేజ్, రేంజ్ టు ఎంప్టీ ఇండికేటర్, సర్వీస్ ఇండికేటర్, క్లాక్, రెండు ట్రిప్ మీటర్లు, సగటు మరియు ప్రస్తుత ఇంధన వినియోగం, ట్రాక్షన్ కంట్రోల్ స్థితి వంటి వివిధ సమాచారాన్ని అందిస్తుంది.

MOST READ:ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన మహీంద్రా థార్ : వివరాలు

ట్రైయంప్ బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్ విడుదల: ధర, ఫీచర్లు

ట్రైయంప్ బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్‌లో ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో డ్యూయెల్-ఛానల్ ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, రెండు రైడింగ్ మోడ్స్ (రోడ్ అండ్ రైన్), రైడ్-బై-వైర్ థ్రోటల్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ట్రైయంప్ బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్ విడుదల: ధర, ఫీచర్లు

ఇది ట్విన్ సైడెడ్ స్వింగ్-ఆర్మ్‌తో పాటుగా ట్యూబ్యులర్ స్టీల్ క్రాడెల్ ఛాస్సిస్‌ను కలిగి ఉంటుంది. ఇక ఇందులోని సస్పెన్షన్ విషయానికి వస్తే, ఇందులో ముందు వైపు కెవైబి 41 మిమీ క్యాట్రిడ్జ్ ఫోర్కులు మరియు వెనుక వైపు ప్రీ-లోడెడ్ అడ్జస్ట్‌మెంట్‌తో పాటుగా కెవైబి మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి.

MOST READ:భారత్‌లో రెనాల్ట్ డస్టర్ టర్బో పెట్రోల్ లాంచ్ ; ధర & ఇతర వివరాలు

ట్రైయంప్ బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్ విడుదల: ధర, ఫీచర్లు

బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో బ్రెంబో నుండి సేకరించిన 310 మిమీ ఫ్లోటింగ్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో నిస్సిన్ నుండి సేకరించిన 255 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇవి రెండూ ఏబిఎస్‌ను స్టాండర్డ్‌గా సపోర్ట్ చేస్తాయి. ఈ బైక్ రెండు చివర్లలో 16 ఇంచ్ స్పోక్ వీల్స్ కలిగి ఉంటుంది.

ట్రైయంప్ బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్ విడుదల: ధర, ఫీచర్లు

ట్రైయంప్ బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్ భారత మార్కెట్లో హ్యార్లే డేవిడ్సన్ 1200 కస్టమ్ మోటార్‌సైకిల్‌కు పోటీగా నిలుస్తుంది. ఇది అమెరికన్ మోటార్‌సైకిల్ స్పీడ్‌మాస్టర్ కంటే తక్కువ ధర కలిగి ఉన్నప్పటికీ, ఇది కొన్ని ఎలక్ట్రానిక్ రైడర్స్ అసిస్ట్ ఫీచర్లను కోల్పోతుంది.

MOST READ:భారీగా తగ్గిన వోల్వో ఎక్స్‌సి టి4 ఆర్-డిజైన్ పెట్రోల్ వేరియంట్ ధర - వివరాలు

ట్రైయంప్ బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్ విడుదల: ధర, ఫీచర్లు

ట్రైయంప్ బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ట్రైయంప్ మోటార్‌సైకిల్స్, బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్ విషయంలో ధర పరంగా అద్భుతం చేసిందనే చెప్పాలి. కేవలం బిఎస్4 ధరకే కొత్త 2020 ట్రైయంప్ బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ బాబర్ స్టైల్ మోటార్‌సైకిల్‌లో ఫార్వర్డ్-సెట్ ఫుట్‌పెగ్స్, వైడ్ హ్యాండిల్‌బార్, వెల్ కుషన్డ్ సీట్స్ ఉండటం వలన ఇవి రైడర్‌కు రిలాక్స్డ్ రైడింగ్ పొజిషన్‌ను ఆఫర్ చేయటంలో సహకరిస్తాయి.

Most Read Articles

English summary
British-based two-wheeler manufacturer, Triumph Motorcycles has launched the 2020 Bonneville Speedmaster motorcycle in the Indian market. The updated motorcycle is priced at Rs 11.33 lakh, ex-showroom (India). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X