టివిఎస్ అపాచీ 200 టూరింగ్ కిట్ కేవలం రూ. 11,360 మాత్రమే

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహనతయారీ సంస్థ అయిన టివిఎస్ తయారు చేసే ద్విచక్ర వాహనాలలో టివిఎస్ అపాచీ 200 ఒకటి. ఈ టివిఎస్ బైక్ చూడటానికి చాలా స్టైల్ గా ఉండటంతో పాటు శక్తివంతమైన ఇంజిన్ ని కలిగి ఉంటుంది. ఇది సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారికీ చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ బైక్ లో ఉన్న ఉపకరణాలు ఎక్కువ దూరం ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.

టివిఎస్ అపాచీ 200 టూరింగ్ కిట్ కేవలం రూ. 11,360 మాత్రమే

కోయంబత్తూర్ కి చెందిన లువియా ఇండస్ట్రీస్ టివిఎస్ అపాచీ 200 కోసం కోసం కొత్త టూరింగ్ కిట్ తీసుకు రావడం జరిగింది. ఈ టూరింగ్ కిట్ పర్యటన కోసం ప్రసిద్ధ కాంపాక్ట్ డిస్ప్లేస్‌మెంట్ తో మోటార్‌సైకిల్‌ను సిద్ధం చేస్తుంది. టివిఎస్ అపాచీ 200 కొత్త టూరింగ్ కిట్ వల్ల వాహనానికి అదనపు బరువు మోయవలసిన అవసరం ఉండదు. వీటిని సులభంగా వాహనానికి అమర్చవచ్చు.

టివిఎస్ అపాచీ 200 టూరింగ్ కిట్ కేవలం రూ. 11,360 మాత్రమే

టివిఎస్ అపాచీ 200, 4 వి కోసం టూరింగ్ కిట్ లో ఫ్యూయల్ ట్యాంక్ మరియు ఇంజిన్‌ను రక్షించడానికి అడ్వెంచర్ గార్డ్, పొడవైన విండ్‌షీల్డ్, విండ్‌షీల్డ్ కోసం ఒక నంబర్ ప్లేట్ రీ-లొకేటర్, ఫాగ్ లాంప్ మౌంట్స్, పిలియన్ బ్యాక్‌రెస్ట్, రియర్ లగేజ్ ర్యాక్, జెర్రికాన్స్ మరియు అల్యూమినియం పన్నీర్ బాక్స్‌లు, టూల్‌బాక్స్ మరియు జెర్రికాన్‌లను ఉంచగల పన్నీర్ మౌంట్‌లు ఉంటాయి.

టివిఎస్ అపాచీ 200 టూరింగ్ కిట్ కేవలం రూ. 11,360 మాత్రమే

టివిఎస్ అపాచీ 200 పూర్తి లువియా టూరింగ్ యాక్సెసరీస్ కిట్ నలుపు రంగులో లభిస్తుంది. దీని ధర రూ. 11,360. కేవలం నలుపు రంగులో మాత్రమే కాకుండా వివిధ రంగులలో కూడా ఎంచుకోవచ్చు. ఈ ఉపకరణాలకు లైఫ్ టైం వారంటీ కూడా ఉంటుంది. ఈ టూరింగ్ కిట్ కోసం కోయంబత్తూరు వెళ్ళవలసిన అవసరం లేదు. ఈ ఉత్పత్తులు లువియా వెబ్‌సైట్ www.lluvia.in లో ఆర్డర్ పెట్టుకున్నట్లైతే ఇంటికి చేరుస్తారు.

టివిఎస్ అపాచీ 200 టూరింగ్ కిట్ కేవలం రూ. 11,360 మాత్రమే

ఈ టూరింగ్ కిట్ తో టివిఎస్ అపాచీ 200 చాల భిన్నంగా కనిపిస్తుంది. అంతే కాకుండా ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. 197.75 సిసి ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌తో నడిచే మోటార్‌సైకిల్‌లో యాంత్రిక మార్పులు లేవు. మునుపటిలాగే ఉంటుంది. శక్తి మరియు టార్క్ అవుట్‌పుట్‌లో కూడా ఎటువంటి మార్పు ఉండదు. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. అపాచీ 200 బైక్ గంటకి 128 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

టివిఎస్ అపాచీ 200 టూరింగ్ కిట్ కేవలం రూ. 11,360 మాత్రమే

టివిఎస్ అపాచీ 200 లో టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ / ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ మరియు రైడ్ డేటా అనలిటిక్స్, డ్యూయల్-ఛానల్ ఎబిఎస్‌తో ముందు మరియు వెనుక డిస్క్ బ్రేక్‌లు, పిరెల్లి టైర్లతో షాడ్ చేసిన 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన పూర్తి డిజిటల్ డాష్‌బోర్డ్‌ వంటి వాటిని కలిగి ఉంటుంది. ఇండైన మార్కెట్లో బిఎస్-6 టివిఎస్ అపాచీ 200 ధర రూ. 1.25 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

టివిఎస్ అపాచీ 200 టూరింగ్ కిట్ కేవలం రూ. 11,360 మాత్రమే

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టివిఎస్ అపాచీ 200 బైక్ కి లువియా టూరింగ్ కిట్ ఒక కొత్తదనాన్ని తీసుకు వస్తుంది. ఇది చూడటానికి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ టూరింగ్ కిట్ లోని ఉపకారణాలకు లైఫ్ టైం వారాంటీ కూడా లభిస్తుంది. అంతే కాకుండా ఈ కిట్ వివిధ రంగులలో కూడా లభ్యమవుతాయి. ఇది సుదూరప్రాంతాలకు ప్రయాణించడానికి మరింత అనుకూలంగా ఉంటుంది.

Source: rushlane

Most Read Articles

English summary
TVS Apache 200 Adventure Touring mod-job at Rs 11,360. Read in Telugu.
Story first published: Friday, February 28, 2020, 12:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X