పెరిగిన టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 ధర - డీటేల్స్

దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ, చెన్నైకి చెందిన టీవీఎస్ మోటార్ కంపెనీ తమ ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిల్ అపాచీ ఆర్ఆర్310 ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. భారత మార్కెట్లో ఈ ఏడాది ఆరంభంలో టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 బైక్‌ను బిఎస్6 నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసిన తర్వాత దీని ధరలు పెరగడం ఇదే మొదటిసారి.

పెరిగిన టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 ధర - డీటేల్స్

కొత్త టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 మోటార్‌సైకిల్‌ను కొనాలనుకు కస్టమర్లు ఇప్పుడు అదనంగా రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. తాజా ధర పెంపు తర్వాత ప్రస్తుతం ఈ మోటార్‌సైకిల్ ధర రూ.2.45 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

పెరిగిన టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 ధర - డీటేల్స్

టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 బిఎస్6 మోడల్‌‌ను దాని మునపటి వెర్షన్‌తో పోల్చుకుంటే అనేక మార్పులతో అప్‌డేట్ చేశారు. ఇందులో కొత్తగా టీవీఎస్ స్మార్ట్ కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన 5-ఇంచ్ టిఎఫ్‌టి కలర్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, థ్రోటల్-బై-వైర్, బ్లూటూత్ కనెక్టివిటీ మరియు గ్లైడ్ త్రూ టెక్నాలజీ ప్లస్ (జిటిటి), మిష్లెన్ రోడ్5 టైర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:అమెజాన్ పే ద్వారా కార్ & బైక్ భీమా మరింత సులభం, ఎలాగో తెలుసా ?

పెరిగిన టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 ధర - డీటేల్స్

టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310లో ఇదివరకటి 312సిసి సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌నే బిఎస్6 వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేశారు. ఈ ఇంజన్ ఇప్పుడు 9700 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 33.5 శక్తిని మరియు 7700 ఆర్‌పిఎమ్ వద్ద 27.3 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్ అసిస్ట్ క్లచ్‌తో సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

పెరిగిన టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 ధర - డీటేల్స్

ఈ మోటార్‌సైకిల్‌లో నాలుగు రైడింగ్ మోడ్స్ (రెయిన్, అర్బన్, స్పోర్ట్ మరియు ట్రాక్) ఉంటాయి. ఇది కేవలం 2.93 సెకన్లలోనే గంటకు 0 నుండి 60 కి.మీ వేగాన్ని, అలాగే 7.17 సెకన్లలో గంటకు 0 నుండి 100 కి.మీ వేగాన్ని చేరుకోగలదు. ఈ స్పోర్ట్స్ బైక్ గరిష్ట వేగం గంటకు 160 కి.మీగా ఉంటుందని టీవీఎస్ పేర్కొంది.

MOST READ:240 ఇంచ్ చక్రాలతో కొత్త రికార్డ్ సృష్టించిన కార్ [వీడియో]

పెరిగిన టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 ధర - డీటేల్స్

ఇందులో అప్‌డేట్ చేసిన ఫీచర్లు మరియు పరికరాలు కాకుండా, మునపటి బిఎస్4 మోడళ్లలో ఉపయోగించిన అనేక విడిభాగాలను కొత్త బిఎస్6 వెర్షన్‌లో కూడా క్యారీ చేశారు. ఇందులో ఆర్‌టి-స్లిప్పర్ క్లచ్, బై-ఎల్ఈడి ట్విన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఆర్‌టి-ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, సస్పెన్షన్ మరియు బ్రేకింగ్ సెటప్ ఉన్నాయి.

పెరిగిన టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 ధర - డీటేల్స్

కొత్త టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 బిఎస్6 ట్రేల్లిస్ ఫ్రేమ్‌పై తయారు చేశారు. దీని ముందు భాగంలో యుఎస్‌డి (అప్ సైడ్ డౌన్) ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఇందులో ఇరువైపులా డిస్క్ బ్రేక్స్ ఉంచాయి, ఇవి డ్యూయెల్-ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి.

MOST READ:రెండవసారి పెరిగిన టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధర, ఈసారి ఎంతో తెలుసా?

పెరిగిన టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 ధర - డీటేల్స్

టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 భారత టూవీలర్ మార్కెట్లో కెటిఎమ్ ఆర్‌సి390, యమహా ఆర్3 మరియు కవాసకి నింజా400 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంగి. అయితే, ఈ జపనీస్ మోటార్‌సైకిళ్లలో ఇంకా బిఎస్6 వెర్షన్లు మన మార్కెట్లో విడుదల కాలేదు.

పెరిగిన టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 ధర - డీటేల్స్

టీవీఎస్ బ్రాండ్‌కి సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, టీవీఎస్ మోటార్ కంపెనీ తమ కస్టమర్ల కోసం ఈ ఏడాది వరుసగా రెండవసారి కూడా తమ మోటార్‌సైకిల్ ఫ్రీ సర్వీస్ మరియు వారంటీ కాలాన్ని పొడిగించింది. దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా తమ వాహనాల ఉచిత సర్వీస్ మరియు వారంటీ ప్రామాణికతను పెంచాలని కంపెనీ నిర్ణయించింది.

MOST READ:ఇండియన్ ఎయిర్ పోర్స్ లో చేరనున్న రాఫెల్ ఫైటర్ జెట్స్ ; ఎందుకో తెలుసా

పెరిగిన టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 ధర - డీటేల్స్

టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 ధర పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 స్పోర్ట్స్ బైక్ ధరను భారత మార్కెట్లో బిఎస్6 అప్‌గ్రేడ్ తర్వాత తొలిసారిగా పెంచారు. ప్రస్తుతం ద్విచక్ర వాహనాలకు పెరిగిన డిమాండ్‌ను మరియు ఈ బైక్ ప్రైస్ బ్రాకెట్‌ను పరిగణలోకి తీసుకుంటే పెరిగిన ధర స్వల్పమే అనిపిస్తుంది. ఈ ధరల పెరుగుదల స్వల్పంగానే ఉంది కాబట్టి, ఇది మోటార్‌సైకిల్ అమ్మకాలను ప్రభావితం చేయదని మా అభిప్రాయం.

Most Read Articles

English summary
TVS Motor Company has announced a price hike on its flagship motorcycle, the Apache RR310 in the Indian market. The motorcycle receives its first price increase after the BS6 update earlier this year. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X