టీవీఎస్ కంపెనీ అమ్మకాల హవా.. భారీగా పెరిగిన నవంబర్ సేల్స్, ఎంతో తెలుసా ?

దేశీయ మార్కెట్లో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ 2020 నవంబర్ నెలలో తన అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. విడుదలైన గణాంకాల నివేదికల ప్రకారం, గత నెలలో కంపెనీ మునుపటికంటే 21 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు తెలిసింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

టీవీఎస్ కంపెనీ అమ్మకాల హవా.. భారీగా పెరిగిన నవంబర్ సేల్స్, ఎంతో తెలుసా ?

2020 నవంబర్ నెలలో కంపెనీ 322,709 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది, ఇది గత ఏడాది ఇదే నెలలో అమ్మకాల కంటే 21 శాతం అధికంగా ఉంది, అంటే మునుపటి ఏడాది ఇదే నెలలో దీని అమ్మకాలు 266,582 యూనిట్లు. మొత్తం అమ్మకాలలో గత నెలలో భారత మార్కెట్లో విక్రయించిన టూ వీలర్స్ మరియు త్రీ వీలర్స్ వెహికల్స్ ఉన్నాయి.

టీవీఎస్ కంపెనీ అమ్మకాల హవా.. భారీగా పెరిగిన నవంబర్ సేల్స్, ఎంతో తెలుసా ?

ద్విచక్ర వాహన విభాగంలో గత నెలలో 311,519 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. 2019 నవంబర్ లో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 249,350 ఉన్నాయి. మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు దాని వృద్ధి 25 శాతం పెరిగింది. గత నెలలో 247,789 యూనిట్లను నమోదు చేసిన తరువాత టివిఎస్ యొక్క దేశీయ ద్విచక్ర వాహన అమ్మకాలు 30 శాతం వృద్ధిని నమోదు చేశాయి, 2019 నవంబర్ లో ఇది 191,222 యూనిట్లు నమోదు చేసింది.

MOST READ:ఒకే కారుని 77 సంవత్సరాలు ఉపయోగించాడు.. ఇంతకీ అతడెవరో తెలుసా ?

టీవీఎస్ కంపెనీ అమ్మకాల హవా.. భారీగా పెరిగిన నవంబర్ సేల్స్, ఎంతో తెలుసా ?

2020 నవంబర్‌లో విక్రయించిన 247,789 యూనిట్ల ద్విచక్ర వాహనాల్లో, మోటారుసైకిల్ అమ్మకాలు 133,531 యూనిట్లు నమోదు చేయగా, స్కూటర్ అమ్మకాలు 106,196 యూనిట్లుగా ఉన్నాయి. దేశీయ మార్కెట్లో మోటారుసైకిల్ మరియు స్కూటర్ అమ్మకాలు రెండూ నవంబర్ 2019 లో తమ అమ్మకాలతో పోలిస్తే ఒక్కొక్కటి 26 శాతం వరకు పెరిగాయి.

టీవీఎస్ కంపెనీ అమ్మకాల హవా.. భారీగా పెరిగిన నవంబర్ సేల్స్, ఎంతో తెలుసా ?

టివిఎస్ మోటార్ కంపెనీకి మొత్తం ఎగుమతి అమ్మకాలు దాని వార్షిక అమ్మకాలలో దాదాపు ఒకే విధంగా ఉన్నాయి, 2020 నవంబర్ నెలలో 74,074 యూనిట్ల అమ్మకాలు, 2019 లో ఇదే నెలలో 74,060 యూనిట్లు అమ్మకాలు జరిగాయి.

MOST READ:పబ్‌జి ప్రేమికుల కోసం తయారైన కొత్త హెల్మెట్స్.. చూసారా !

టీవీఎస్ కంపెనీ అమ్మకాల హవా.. భారీగా పెరిగిన నవంబర్ సేల్స్, ఎంతో తెలుసా ?

మొత్తానికి ద్విచక్ర వాహనాల ఎగుమతులు 10 శాతం పెరిగి 58,128 యూనిట్ల నుండి 63,730 యూనిట్లకు చేరుకున్నాయి. నివర్ తుఫాను కారణంగా 2020 నవంబర్ నెలలో ఎగుమతులు కొంతవరకు ప్రభావితమయ్యాయని కంపెనీ తెలిపింది. అంతే కాకుండా 2020 లో ఇది నెల చివర దాని కార్యకలాపాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

టీవీఎస్ కంపెనీ అమ్మకాల హవా.. భారీగా పెరిగిన నవంబర్ సేల్స్, ఎంతో తెలుసా ?

ఇక కంపెనీ యొక్క త్రీ-వీలర్ అమ్మకాల విషయానికి వస్తే మునుపటి నెల అమ్మకాలలు కొంతవరకు తగ్గాయనే చెప్పాలి. 2019 నవంబర్‌లో ఇదే కాలంలో 17,232 యూనిట్లకు చేరుకోగా, 2020 నవంబర్‌లో మాత్రం కంపెనీ 11,190 యూనిట్లను నమోదు చేసింది.

MOST READ:రూ. 1.26 కోట్ల రూపాలకు అమ్ముడైన 118 సంవత్సరాల పాత వెహికల్ నెంబర్.. ఎందుకో తెలుసా

టీవీఎస్ కంపెనీ అమ్మకాల హవా.. భారీగా పెరిగిన నవంబర్ సేల్స్, ఎంతో తెలుసా ?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :

కరోనా మహమ్మారి ప్రభావంతో టీవీఎస్ మోటార్ కంపెనీ 2020 మధ్యలో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్న తరువాత దేశీయ మార్కెట్లో నెలవారీ మరియు వార్షిక అమ్మకాల పరంగా త్వరగా కోలుకుని ట్రాక్‌లోకి వచ్చింది. ఈ వేగాన్ని 2020 డిసెంబర్ నెలలో మరియు కొత్త సంవత్సరంలో కూడా కొనసాగించాలని కంపెనీ భావిస్తోంది.

Most Read Articles

English summary
Bike Sales Report For November 2020. Read in Telugu.
Story first published: Wednesday, December 2, 2020, 9:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X