వెస్పా నుంచి రానున్న కొత్త 'రేసింగ్ సిక్స్టీస్' స్కూటర్; సెప్టెంబర్ 1న విడుదల

ఇటాలియన్ ప్రీమియం స్కూటర్ బ్రాండ్ వెస్పా భారత మార్కెట్లో మరో కొత్త లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. "వెస్పా రేసింగ్ సిక్స్టీస్" పేరిట కంపెనీ ఓ కొత్త స్కూటర్‌ను సెప్టెంబర్ 1, 2020వ తేదీన ఆన్‌లైన్ ఈవెంట్ ద్వారా విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

వెస్పా నుంచి రానున్న కొత్త 'రేసింగ్ సిక్స్టీస్' స్కూటర్; సెప్టెంబర్ 1న విడుదల

వెస్పా రేసింగ్ సిక్స్టీస్ స్కూటర్‌ను కంపెనీ విక్రయిస్తున్న వెస్పా ఎస్ఎక్స్ఎల్ 150 మోడల్ ఆధారం చేసుకొని తయారు చేయబడిన లిమిటెడ్ ఎడిషన్ మోడల్. వెస్పా తొలిసారిగా ఈ స్కూటర్‌ను ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ ఇప్పటికే భారత మార్కెట్లోకి ప్రవేశించాల్సి ఉంది, అయితే, కరోనావైరస్ మహమ్మారి దీని విడుదల జాప్యమైంది.

వెస్పా నుంచి రానున్న కొత్త 'రేసింగ్ సిక్స్టీస్' స్కూటర్; సెప్టెంబర్ 1న విడుదల

లిమిటెడ్ ఎడిషన్ వెస్పా రేసింగ్ సిక్స్టీస్ స్కూటర్ రెడ్ కలర్ రేసింగ్ స్ట్రైప్స్ మరియు వైట్ పెయింట్ కలర్‌తో లభ్యం కానుంది. ఫ్రంట్ ఫెండర్, ఆప్రాన్ మరియు వెనుక బాడీ ప్యానెళ్ల నుండి స్కూటర్ యొక్క మొత్తం పొడవునా ఈ రెడల్ కలర్ స్ట్రైప్స్ ఉంటాయి. దీనికి మరింత స్టైల్‌ను జోడించడానికి, ఇందులో బంగారు రంగు అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు.

MOST READ: కవాసకి వల్కాన్ ఎస్ బిఎస్6 క్రూయిజర్ విడుదల; ధర, ఫీచర్లు

వెస్పా నుంచి రానున్న కొత్త 'రేసింగ్ సిక్స్టీస్' స్కూటర్; సెప్టెంబర్ 1న విడుదల

ఈ లిమిటెడ్ ఎడిషన్ రేసింగ్ సిక్స్టీస్ స్కూటర్‌లో పైన పేర్కొన్న మార్పుల మినహా వేరే ఏ ఇతర మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ఇంజన్ విషయానికి వస్తే, స్టాండర్డ్ ఎస్ఎక్స్ఎల్ 150 స్కూటర్‌లోని ఇంజన్‌నే ఇందులోనూ ఉపయోగించనున్నారు.

వెస్పా నుంచి రానున్న కొత్త 'రేసింగ్ సిక్స్టీస్' స్కూటర్; సెప్టెంబర్ 1న విడుదల

వెస్పా రేసింగ్ సిక్స్టీస్ స్కూటర్‌లోని 150 సిసి సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్ 7600 ఆర్‌పిఎమ్ వద్ద 10.3 బిహెచ్‌పి శక్తిని మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

MOST READ: స్కొడా ర్యాపిడ్ టిఎస్ఐ ఆటోమేటిక్ బుకింగ్స్ ప్రారంభం; త్వరలోనే విడుదల

వెస్పా నుంచి రానున్న కొత్త 'రేసింగ్ సిక్స్టీస్' స్కూటర్; సెప్టెంబర్ 1న విడుదల

ఈ లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్ ముందు వైపు 11 ఎంహెచ్ చక్రాలను 200 ఎంఎం డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. అలాగే, వెనుక భాగంలో 10 ఇంచ్ చక్రాలు మరియు 140 ఎంఎం డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఇది సింగిల్-ఛానల్ ఏబిఎస్ సిస్టమ్‌ను సపోర్ట్ చేస్తుంది.

వెస్పా నుంచి రానున్న కొత్త 'రేసింగ్ సిక్స్టీస్' స్కూటర్; సెప్టెంబర్ 1న విడుదల

ఇక స్టాండర్డ్ ఎస్ఎక్స్ఎల్ 150 స్కూటర్‌లో లభించే అన్ని ఫీచర్లు, పరికరాలు ఈ లిమిటెడ్ ఎడిషన్‌లోనూ లభ్యం కానున్నాయి. ఇందులో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ముందు భాగంలో విండ్ డిఫ్లెక్టర్, అండర్-సీట్ స్టోరేజ్‌లో యుఎస్‌బీ ఛార్జర్ మరియు సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ: భారత్‌లో హోండా హార్నెట్ 2.0 విడుదల - ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

వెస్పా నుంచి రానున్న కొత్త 'రేసింగ్ సిక్స్టీస్' స్కూటర్; సెప్టెంబర్ 1న విడుదల

వెస్పా రేసింగ్ సిక్స్టీస్‌లో కాంట్రాస్ట్ వైట్ స్టిచింగ్‌తో కూడిన బ్లాక్ లెదర్ సీట్ అప్‌హోలెస్ట్రీ ఉంటుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ పరిమిత సంఖ్యలో మాత్రమే లభ్యం కానుంది. ప్రత్యేక పెయింట్ స్కీమ్‌తో రానున్న ఈ మోడల్ ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షిస్తుందని వెస్పా ఆశిస్తోంది.

వెస్పా నుంచి రానున్న కొత్త 'రేసింగ్ సిక్స్టీస్' స్కూటర్; సెప్టెంబర్ 1న విడుదల

వెస్పా రేసింగ్ సిక్స్టీస్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రస్తుతం మార్కెట్లో స్టాండర్డ్ వెస్పా ఎస్ఎక్స్ఎల్ 150 ధర రూ.1.25 లక్షలు, ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఈ ధరను పరిగణలోకి తీసుకుంటే, త్వరలో విడుదల కానున్న ఈ కొత్త వెస్పా రేసింగ్ సిక్స్టీస్ మోడల్ ధర మరింత అధికంగా ఉండే అవకాశం ఉంది.

Most Read Articles

Read more on: #వెస్పా #vespa
English summary
Piaggio has announced the launch date for the Vespa Racing Sixties scooter in the Indian market. The new limited-edition Vespa Racing Sixties scooter is said to be launched via an online event on the 1st September 2020. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X