డీలర్ల వద్దకు యమహా ఎఫ్‌జీ25, ఎఫ్‌జీఎస్25, త్వరలో డెలివరీలు

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా గడచిన నెలలో భారత మార్కెట్లో తమ కొత్త బిఎస్6 యమహా ఎఫ్‌జెడ్25 మరియు యమహా ఎఫ్‌జెడ్ఎస్25 మోటార్‌సైకిళ్లను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ రెండు మోడళ్లలో ఇంజన్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా కొద్దిపాటి కాస్మోటిక్ అప్‌డేట్స్ కూడా ఉన్నాయి.

డీలర్ల వద్దకు యమహా ఎఫ్‌జీ25, ఎఫ్‌జీఎస్25, త్వరలో డెలివరీలు

ఇప్పుడిప్పుడే ఈ రెండు మోడళ్లు డీలర్‌షిప్ కేంద్రాలను చేరుకుంటున్నాయి. యూట్యూబ్‌లో ఎమ్ఆర్‌డి వ్లాగ్స్ ఇటీవల పోస్ట్ చేసిన వీడియో ప్రకారం, ఈ రెండు మోటార్‌సైకిళ్లను డీలర్‌షిప్‌లో ప్రదర్శించడాన్ని చూడొచ్చు. త్వరలోనే ఈ బిఎస్6 మోటార్‌సైకిల్ డెలివరీలు దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి.

డీలర్ల వద్దకు యమహా ఎఫ్‌జీ25, ఎఫ్‌జీఎస్25, త్వరలో డెలివరీలు

దేశీయ మార్కెట్లో బిఎస్6 కంప్లైంట్ యమహా ఎఫ్‌జెడ్25 ధర రూ.1,52,100 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించారు. ఇకపోతే యమహా ఎఫ్‌జెడ్ఎస్25 బిఎస్6 మోడల్ ధర రూ.1,57,100 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. బిఎస్4 మోటార్‌సైకిళ్లతో పోల్చుకుంటే వీటి ధరలు రూ.15,000 అధికంగా ఉన్నప్పటికీ, ఇవి ఈ సెగ్మెంట్లో సరసమైన మోటార్‌సైకిళ్లుగా నిలుస్తాయి.

MOST READ:బైక్ డ్రైవ్స్ చేసిన యువతికి 20,500 జరిమానా, ఎందుకో మీరే చూడండి

డీలర్ల వద్దకు యమహా ఎఫ్‌జీ25, ఎఫ్‌జీఎస్25, త్వరలో డెలివరీలు

ఈ రెండు మోటార్‌సైకిళ్లలో చేసిన అప్‌డేట్స్ విషయాకని వస్తే, ఇవి రెండూ కూడా మోనోటోన్ ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్‌ఈడి హెడ్‌లైట్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్, టెయిల్ లైట్స్, ఇంజన్ కౌల్ మరియు సైడ్ స్టాండ్ ఇంజన్ కట్-ఆఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ రెండు మోడళ్లలో ప్రధానమైన వ్యత్యాసం ఏంటంటే, పొడవైన వైజర్, హ్యాండిల్ గ్రిప్స్‌పై బ్రష్ గార్డ్స్ మరియు గోల్డ్ ఫినిషింగ్‌తో కూడిన అల్లాయ్ వీల్స్.

డీలర్ల వద్దకు యమహా ఎఫ్‌జీ25, ఎఫ్‌జీఎస్25, త్వరలో డెలివరీలు

ఈ రెండు మోడళ్లలో ఒకేరకమైన బిఎస్6 కంప్లైంట్ 249 సిసి ఎయిర్-కూల్డ్, సింగిల్ ఓవర్ హెడ్ కామ్‌షాఫ్ట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 20.5 బిహెచ్‌పి శక్తిని మరియు 10.2 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:నకిలీ చెక్కుతో 1 కోటి విలువైన లగ్జరీ కారు కొన్న మహిళ ; తర్వాత ఎం జరిగిందంటే

డీలర్ల వద్దకు యమహా ఎఫ్‌జీ25, ఎఫ్‌జీఎస్25, త్వరలో డెలివరీలు

ఈ రెండు మోటార్‌సైకిళ్ళ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో సెవే-వే అడ్జస్టబల్ మోనోక్రాస్ సస్పెన్షన్ ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 282 మిమీ డిస్క్ మరియు వెనుక భాగంలో 220 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇవి రెండూ కూడా డ్యూయెల్ ఛానల్ ఏబిఎస్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా కలిగి ఉంటాయి.

డీలర్ల వద్దకు యమహా ఎఫ్‌జీ25, ఎఫ్‌జీఎస్25, త్వరలో డెలివరీలు

యమహా ఎఫ్‌జెడ్25 రేసింగ్ బ్లూ మరియు మెటాలిక్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే ఎఫ్‌జెడ్ఎస్25 మాత్రం డార్క్ మ్యాట్ బ్లూ, పాటినా గ్రీన్ మరియు వైట్ వెర్మిలియన్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

MOST READ:ప్రమాదంలో ఒక కాలు కోల్పోయినప్పటికీ 165 కి.మీ సైక్లింగ్ చేసాడు, ఎందుకో తెలుసా

డీలర్ల వద్దకు యమహా ఎఫ్‌జీ25, ఎఫ్‌జీఎస్25, త్వరలో డెలివరీలు

యమహా ఎఫ్‌జెడ్ 25 మరియు ఎఫ్‌జెడ్ఎస్ 25 మోటార్‌సైకిళ్లు ఈ విభాగంలో కెటిఎమ్ డ్యూక్ 250, సుజుకి జిక్సెర్ 250, హస్క్వార్నా సావర్ట్‌పిలెన్ మరియు విట్‌పిలెన్ మరియు ఇటీవలే విడుదలైన బజాజ్ డొమినార్ 250 మోడళ్లతో పోటీ పడతాయి. ఒక్క ఏడాది సమయంలో 250 సిసి విభాగంలో మూడు కొత్త మోడళ్లు చేర్చబడ్డాయి. ప్రస్తుతం ఈ విభాగం భారతదేశంలో అత్యంత పోటీగా మారుతోంది.

డీలర్ల వద్దకు యమహా ఎఫ్‌జీ25, ఎఫ్‌జీఎస్25, త్వరలో డెలివరీలు

యమహా ఎఫ్‌జెడ్25, ఎఫ్‌జెడ్ఎస్25 బిఎస్6 విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

యమహా ఎఫ్‌జెడ్25, ఎఫ్‌జెడ్ఎస్25 మోటార్‌సైకిళ్లు ఈ విభాగంలో ధర పరంగా అందుబాటులో ఉంటాయి. హై క్వాలిటీ ఫినిషింగ్‌తో అత్యుత్తమ సౌకర్యాన్ని మరియు రిలాక్స్డ్ రైడ్‌ను అందించడంలో ఈ మోటార్‌సైకిళ్లు అద్భుతంగా అనిపిస్తాయి. భారతీయ మార్కెట్లో 250 సిసి విభాగంలో ఎక్కువ మోడళ్లు వచ్చి చేరుతున్నాయి. ఈ విభాగంలో స్క్రాంబ్లర్ మరియు కేఫ్-రేసర్ మోటార్‌సైకిళ్ళు కూడా ఉన్నాయి.

MOST READ:ఇది చూసారా.. హ్యుందాయ్ షోరూమ్ రిసెప్షనిస్ట్‌గా వీధి కుక్క

Image Courtesy: MRD Vlogs/YouTube

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
The Yamaha FZ 25 and the FZS 25 BS6 motorcycles have been launched recently in the Indian market. Both motorcycle receive a few cosmetic updates and an updated engine the complies with the latest emission norms. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X