డీలర్ వద్దకు చేరుకున్న కొత్త 2021 బజాజ్ పల్సర్ 180.. పూర్తి వివరాలు

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో, తన 2021 పల్సర్ 180 ను భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ కొత్త బజాజ్ పల్సర్ 180 బైక్ ఇప్పుడు డీలర్లను చేరుకోవడం ప్రారంభించింది. డీలర్లను చేరుకున్న బజాజ్ పల్సర్ 180 గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

డీలర్ వద్దకు చేరుకున్న కొత్త 2021 బజాజ్ పల్సర్ 180.. పూర్తి వివరాలు

2021 కొత్త పల్సర్ 180 బైక్ సెమీ ఫైర్డ్ 180 ఎఫ్ బైక్‌తో విక్రయించే అవకాశం ఉంది. ఇది చూడటానికి క్లాసిక్ ఫ్యామిలీ స్టైలింగ్ తో ఉంది. కొత్త పల్సర్ 180 బైక్‌కు ఫ్యూయల్ ట్యాంక్ ఎక్స్‌టెన్షన్స్, టెయిల్‌పీస్ మరియు బెల్లీ పాన్‌లో ప్రత్యేకమైన కాంట్రాస్ట్ డెకాల్స్ లభిస్తాయి.

డీలర్ వద్దకు చేరుకున్న కొత్త 2021 బజాజ్ పల్సర్ 180.. పూర్తి వివరాలు

హెడ్‌ల్యాంప్ హౌసింగ్ కొద్దిగా వక్రీకృతమై ఉంది కాని చెప్పుకోదగ్గ మార్పులు మాత్రం లేవు. కొత్త బజాజ్ పల్సర్ బైక్ యొక్క డిజి-అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కన్సోల్ 220 ఎఫ్ మోడల్ నుండి తీసుకోబడింది. ఈ కొత్త బైక్‌లో బ్లూ బ్యాక్‌లిట్ డిజిటల్ డిస్‌ప్లే కూడా ఉంటుంది. ఇందులో బైక్ వేగం, ఫ్యూయెల్ కెపాసిటీ, ​​ఫ్యూయెల్ సిస్టం, డిస్టెన్స్, సైడ్-స్టాండ్ అలెర్ట్, ఓడోమీటర్ సర్వీస్ రిమైండర్ వంటి మరెన్నో ఉన్నాయి.

MOST READ:పెట్రో ధరలకు రెక్కలొచ్చాయ్.. ఇక సామాన్యుడి వాహనం కదిలేనా ?

డీలర్ వద్దకు చేరుకున్న కొత్త 2021 బజాజ్ పల్సర్ 180.. పూర్తి వివరాలు

బజాజ్ పల్సర్ సిరీస్‌లోని మోడళ్లు ఇప్పటికే అప్డేట్ చేయబడిఅయితున్నాయి. అయితే ఈ కొత్త 2021 పల్సర్ 180 బైక్‌ యొక్క స్పెసిఫికేషన్లలో గణనీయమైన మార్పులు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఇది మునుపటి మోడల్ అదిరిగానే ఉండే అవకాశం ఉంటుంది.

డీలర్ వద్దకు చేరుకున్న కొత్త 2021 బజాజ్ పల్సర్ 180.. పూర్తి వివరాలు

కొత్త బజాజ్ పల్సర్ 180 బైక్‌లో 178.6 సిసి ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 17 బిహెచ్‌పి శక్తిని మరియు 14.52 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడుతుంది.

MOST READ:వారెవ్వా.. జైలు నుంచి విడుదలైన గ్యాంగ్‌స్టర్‌కి 300 కార్లతో స్వాగతం చెప్పిన అభిమానులు

డీలర్ వద్దకు చేరుకున్న కొత్త 2021 బజాజ్ పల్సర్ 180.. పూర్తి వివరాలు

2021 బజాజ్ పల్సర్ 180 బైక్ సస్పెన్షన్ సెటప్ విషయానికొస్తే, దీని ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. అదే విధంగా బ్రేకింగ్ సిస్టమ్ విషయంలో, ఈ బైక్ యొక్క ముందు మరియు వెనుక భాగంలో డిస్క్ బ్రేకింగ్ అమలు చేయబడుతుంది. ఇది భద్రతలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

డీలర్ వద్దకు చేరుకున్న కొత్త 2021 బజాజ్ పల్సర్ 180.. పూర్తి వివరాలు

బజాజ్ పల్సర్ 180 లో ఇప్పుడు 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ అమర్చారు. కొత్త బజాజ్ పల్సర్ 180 బైక్ డీలర్లను చేరుకోబోతున్నందున త్వరలో భారత మార్కెట్లో విడుదల కానుంది. సాధారణంగా బజాజ్ పల్సర్ కి దేశీయ మార్కెట్లో ఎక్కువ అభిమానులు ఉన్నారు. అయితే ఈ బైక్ ఏవిధంగా ప్రజాదరణ పొందుతుందో వేచి చూడాలి.

MOST READ:ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్న సూపర్ ఉమెన్ వీడియో

Image Courtesy: AUTO TRAVEL TECH

Most Read Articles

English summary
2021 Bajaj Pulsar 180 At Dealer Showroom. Read in Telugu.
Story first published: Thursday, February 18, 2021, 12:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X