భారత్‌లో విడుదలైన 2021 డుకాటి ఎక్స్‌డియావెల్; ధర, ఫీచర్లు & పూర్తి వివరాలు

ఇటాలియన్‌ సూపర్‌బైక్ తయారీ సంస్థ డుకాటీ భారత మార్కెట్లో తన కొత్త 2021 ఎక్స్‌డియావెల్(XDiavel) బైక్ లాంచ్ చేసింది. ఈ కొత్త ఎక్స్‌డియావెల్ బైక్ ప్రారంభ ధర ఎక్స్ షో రూమ్ ప్రకారం రూ. 18 లక్షలు. ఈ బైక్ స్పెషల్ కలర్ స్కీమ్‌లతో లభిస్తుంది. డుకాటి ఎక్స్‌డియావెల్ బుకింగ్స్ ఇప్పుడు దేశీయ మార్కెట్లో ప్రారంభమయ్యాయి. డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

కొత్త 2021 డుకాటి ఎక్స్‌డియావెల్ బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి డార్క్ మరియు బ్లాక్ స్టార్ వేరియంట్స్. వీటి ధరల విషయానికి వస్తే డార్క్ వేరియంట్ ధర రూ. 18 లక్షలు కాగా, బ్లాక్ స్టార్ వేరియంట్ ధర రూ. 22.60 లక్షలు.

డుకాటి ఎక్స్‌డియావెల్ బైక్ యొక్క డార్క్ వేరియంట్ డార్క్ స్టీల్త్, కార్బన్ బ్లాక్ ఫ్రేమ్ మరియు మాట్టే బ్లాక్ వీల్స్ కలిగి ఉంటుంది. అదేవిధంగా బ్లాక్ స్టార్ వేరియంట్ డేడికేటెడ్ బ్లాక్ స్టార్ గ్రాఫిక్స్, గ్లోస్ బ్లాక్ ఫ్రేమ్ మరియు గ్లోస్ బ్లాక్ వీల్స్ కలిగి ఉంటాయి. ఈ రేడు వేరియంట్లు అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉండి, చాలా స్టైలిష్ గా మరియు ఆకర్షణీయంగా ఉంటాయి.

కొత్త డుకాటీ ఎక్స్‌డియావెల్ బైక్‌లో టెస్టాస్ట్రెట్టా డివిటి 1,262 సిసి ఎల్-ట్విన్ ఇంజన్ అమర్చారు. యూరో 5 కాలుష్య నియమాలకు అనుగుణంగా ఈ ఇంజిన్ నవీకరించబడింది. ఈ ఇంజిన్ 9,500 ఆర్‌పిఎమ్ వద్ద 158 బిహెచ్‌పి మరియు 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 130 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మునుపటి మోడల్ కంటే 8 బిహెచ్‌పి ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త ఎక్స్‌డియావెల్ ప్రస్తుతం దేశంలో విక్రయించబడుతున్న 2021 డియావెల్ మోటార్‌సైకిల్ ఆధారంగా రూపొందించబడింది. అయితే, ఈ బైక్ కొత్త గ్రాఫిక్స్‌తో సహా అనేక మార్పులు పొందుతుంది. ఇది వాహనదారులు ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

ఈ కొత్త బైక్ లో 18 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, సింగిల్-పీస్ హ్యాండిల్‌బార్, ఎల్ఈడీ లైటింగ్, సింగిల్ సైడెడ్ స్వింగార్మ్, అల్లాయ్ వీల్స్, ట్విన్-బారెల్ ఎగ్సాస్ట్ మరియు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు ఎక్స్‌డియావెల్ డార్క్ స్టార్ వేరియంట్ హై-గ్రిప్ స్వెడ్ ఫాబ్రిక్‌ను కలిగి ఉంటుంది, కావున బైక్ యొక్క స్పోర్టినెస్‌ను మరింత పెంచుతుంది.

డుకాటి ఎక్స్‌డియావెల్ అదే 3.5 ఇంచెస్ TFT డిస్‌ప్లేను కలిగి ఉంది. రెండు వేరియంట్‌లలో కంపెనీ అందించే ఫీచర్‌ల కోసం బ్లూటూత్ ఎనేబుల్డ్ కన్సోల్ ఉంటుంది. డార్క్ స్టార్ట్ బ్రాండ్ యొక్క డుకాటి మల్టీమీడియా సిస్టమ్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో మూడు రైడింగ్ మోడ్స్ అందుబాటులో ఉంటాయి. అవి స్పోర్ట్, టూరింగ్ మరియు అర్బన్ మోడ్స్. వీటితో పాటు ఐఎంయు బేస్డ్ కార్నర్ ఏబీఎస్, డుకాటి ట్రాక్షన్ కంట్రోల్, డుకాటీ పవర్ లాంచ్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటివి కూడా ఉన్నాయి.

కొత్త ఎక్స్‌డియావెల్ బైక్ బరువు 247 కిలోలు. ఎక్స్‌డియావెల్ బైక్ ఎమ్ 50 బ్రేక్‌లకు బదులుగా దాని S మోడల్ నుండి బ్రెంబో ఎమ్ 4.32 కాలిపర్‌లను పొందుతుంది.

ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో 50 మిమీ యుఎస్డి పోర్క్ మరియు వెనుక భాగంలో మోనోషాక్ ఉంటుంది. అదేవిధంగా ఈ బైక్ అద్భుతమైన బ్రేకింగ్ సెటప్ కూడా పొందుతుంది. ముందు భాగంలో 320 మిమీ డ్యూయెల్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో 265 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది.డుకాటి భారతదేశంలో మంచి ఆదరణ పొందుతోంది. ఈ క్రమంలోనే కంపెనీ దేశీయ మార్కెట్లో మరో మోటార్‌సైకిల్‌ని విడుదల చేసింది.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త డుకాటి ఎక్స్‌డియావెల్ బైక్, ట్రయంఫ్ రాకెట్ 3 మరియు హార్లే డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

కొత్త 2021 డుకాటి ఎక్స్‌డియావెల్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం వల్ల మంచి ఆదరణ పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దేశీయ మార్కెట్లో ఈ బైక్ ఎలాంటి అమ్మకాలను నమోదు చేస్తుందో తెలుసుకోవడానికి కొంత కాలం వేచి చూడాలి.

Most Read Articles

English summary
2021 ducati xdiavel launched in india at rs 18 lakh specs features variants other details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X