త్వరలో రానున్న కొత్త సుజుకి GSX-S1000 బైక్; ఇప్పుడు కొత్త డిజైన్ & కొత్త స్టైల్

సుజుకి మోటార్ కార్పొరేషన్ తన కొత్త సుజుకి జిఎస్ఎక్స్-ఎస్ 1000 బైక్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త సుజుకి జిఎస్ఎక్స్-ఎస్ 1000 బైక్‌లో అప్‌డేటెడ్ ఇంజిన్, పుల్ రీడిజైన్ మరియు అనేక కొత్త ఫీచర్లతో సహా చాలా మార్పులు చేయబడ్డాయి. ఈ కొత్త సుజుకి జిఎస్ఎక్స్-ఎస్ 1000 బైక్ జూన్ నెలలో యూరోపియన్ మార్కెట్లలో విడుదల కానుంది.

త్వరలో రానున్న కొత్త సుజుకి GSX-S1000 బైక్; ఇప్పుడు కొత్త డిజైన్ & కొత్త స్టైల్

సుజుకి జిఎస్ఎక్స్-ఎస్ 1000 ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన 1,000 సిసి బైకులలో ఒకటి. ఇది వాహనదారునికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది మంచి పనితీరుని అందిస్తుంది. బ్రాండ్ యొక్క మునుపటి మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త బైక్ చాలా అప్డేట్స్ పొందింది.

త్వరలో రానున్న కొత్త సుజుకి GSX-S1000 బైక్; ఇప్పుడు కొత్త డిజైన్ & కొత్త స్టైల్

కొత్త సుజుకి జిఎస్ఎక్స్-ఎస్ 1000 బైక్ యొక్క అప్డేటెడ్ డిజైన్ చాలా స్టైలిష్ గా ఉండి వాహనదారులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ బైక్‌లోని కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ సెటప్‌కు ఇప్పుడు సరికొత్త రూపాన్ని ఇవ్వడం జరిగింది.

MOST READ:రూ. 10 కోట్ల విలువైన కారులో ప్రయాణించిన యూట్యూబర్ ఏం చెప్పాడంటే?

త్వరలో రానున్న కొత్త సుజుకి GSX-S1000 బైక్; ఇప్పుడు కొత్త డిజైన్ & కొత్త స్టైల్

ఈ కొత్త బైక్ లోని ఫ్యూయెల్ ట్యాంక్ మునుపటి కంటే చాలా భిన్నమైన డిజైన్‌ను కలిగి ఉంది. దీని ఫలితంగా ఈ బైక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. రియర్ ఎండ్‌లో కొత్త కౌలింగ్ మరియు ఎల్‌ఈడీ టెయిల్ లాంప్ చాలా స్టైలిష్‌గా ఉంది.

త్వరలో రానున్న కొత్త సుజుకి GSX-S1000 బైక్; ఇప్పుడు కొత్త డిజైన్ & కొత్త స్టైల్

ఈ 2021 సుజుకి జిఎస్ఎక్స్-ఎస్ 1000 మునుపటి మోడల్ మాదిరిగానే 999 సిసి, ఇన్-లైన్ ఫోర్-సిలిండర్ ఇంజిన్‌ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 11,000 ఆర్‌పిఎమ్ వద్ద 150.19 బిహెచ్‌పి మరియు 9,250 ఆర్‌పిఎమ్ వద్ద 105 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో సుజుకి ఇంటెలిజెంట్ రైడ్ సిస్టమ్ ఉంది.

MOST READ:మారుతి సుజుకి మాజీ ఎండి 'జగదీష్ ఖత్తర్' మృతి; వివరాలు

త్వరలో రానున్న కొత్త సుజుకి GSX-S1000 బైక్; ఇప్పుడు కొత్త డిజైన్ & కొత్త స్టైల్

ఇది ఎలక్ట్రానిక్ త్రాటల్ కంట్రోల్ తో ఎగ్జాస్ట్ ఇన్-టెక్ సిస్టం కలిగి ఉంది. ఈ బైక్ యొక్క త్రాటల్ రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంతే ఇప్పుడు ఈ బైక్ యొక్క త్రాటల్ రెస్పాన్స్ మునుపటి మోడల్ కంటే ఎక్కువగా ఉంటుంది.

త్వరలో రానున్న కొత్త సుజుకి GSX-S1000 బైక్; ఇప్పుడు కొత్త డిజైన్ & కొత్త స్టైల్

ఈ బైక్ యొక్క ఇంజిన్ ఇప్పుడు బిఎస -6 మరియు యూరో 5 కాలుష్య నియమాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయబడుతోంది. ఈ బైక్‌లో ట్రాక్షన్ కంట్రోల్, కార్నింగ్ ఎబిఎస్, ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ వంటి అధునాతన ఫీహార్స్ కలిగి ఉంటుంది.

MOST READ:అలెర్ట్: కర్ణాటకలో 14 రోజుల కఠిన ఆంక్షలతో కరోనా లాక్‌డౌన్

త్వరలో రానున్న కొత్త సుజుకి GSX-S1000 బైక్; ఇప్పుడు కొత్త డిజైన్ & కొత్త స్టైల్

సుజుకి జిఎస్ఎక్స్-ఎస్ 1000 బైక్ కొత్త నవీకరణలతో చాలా ఆకర్షణీయమైన రూపంతో మరియు ప్రస్తుతం తరానికి కచ్చితంగా సరిపోయే విధంగా ఉంటుంది. సుజుకి మోటార్ సైకిల్ కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి కొత్తగా అప్‌డేట్ చేసిన జిఎస్‌ఎక్స్-ఎస్ 1000 బైక్‌ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
All-New Suzuki GSX-S1000 Unveiled. Read in Telugu.
Story first published: Tuesday, April 27, 2021, 17:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X