ఆప్రిలియా ఆర్ఎస్ 660 మరియు ట్యూనో 600 బైక్స్ కోసం బుకింగ్స్ ప్రారంభం

పియాజియో గ్రూపుకు చెందిన ప్రముఖ ఇటాలియన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆప్రిలియా త్వరలోనే రెండు సరికొత్త స్పోర్ట్స్ బైక్‌లను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఆప్రిలియా ఆర్‌ఎస్ 660 మరియు ఆప్రిలియా ట్యూనో 660 మోడళ్లను కంపెనీ భారత్‌లో విడుదల చేయనుంది.

ఆప్రిలియా ఆర్ఎస్ 660 మరియు ట్యూనో 600 బైక్స్ కోసం బుకింగ్స్ ప్రారంభం

దేశీయ విపణిలో ఇప్పటికే ఈ రెండు మోడళ్ల కోసం బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ఆటోకార్ఇండియా నివేదిక ప్రకారం, పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క సీఈఓ మరియు ఎమ్‌డి డియెగో గ్రాఫి ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు.

ఆప్రిలియా ఆర్ఎస్ 660 మరియు ట్యూనో 600 బైక్స్ కోసం బుకింగ్స్ ప్రారంభం

ఈ రకమైన ఉత్పత్తుల కోసం కొనుగోలుదారుల ఆసక్తిని అర్థం చేసుకోవటానికి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న తమ డీలర్లు ఈ మోడళ్ల కోసం బుకింగ్‌లను స్వీకరిస్తున్నారని, 2021 ద్వితీయ త్రైమాసికంలో యూరప్ నుండి వీటిని దిగుమతి చేసుకుంటామని ఆయన తెలిపారు.

MOST READ:మనవరాలు చదువు కోసం ఉంటున్న ఇల్లు అమ్మేసిన 74 ఏళ్ల రియల్ హీరో

ఆప్రిలియా ఆర్ఎస్ 660 మరియు ట్యూనో 600 బైక్స్ కోసం బుకింగ్స్ ప్రారంభం

అధిక దిగుమతి సుంఖాల కారణంగా, భారత మార్కెట్లో ఈ రెండు మోటార్‌సైకిళ్ల ధరలు సాధారణ ధరల కంటే ఎన్నో రెట్లు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, పియాజియో ముందుగా కస్టమర్ల ఆసక్తిని అర్థం చేసుకొని, వాటి డిమాండ్‌కు అనుగుణంగా దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది.

ఆప్రిలియా ఆర్ఎస్ 660 మరియు ట్యూనో 600 బైక్స్ కోసం బుకింగ్స్ ప్రారంభం

ఆప్రిలియా ఇటీవలే తమ కొత్త ట్యూనో 660 మిడిల్ వెయిట్ మోటార్‌సైకిల్ యొక్క అధికారిక వీడియోను కూడా విడుదల చేసింది. ఆప్రిలియా ట్యూనో 660 మరియు ఆప్రిలియా ఆర్ఎస్ 660 సూపర్‌స్పోర్ట్ రెండూ కూడా ఒకే ఫ్యామిలీకి చెందినవి.

MOST READ:మీ వాహనంపై ఈ స్టిక్కర్ ఉందా.. ఉంటే వెంటనే తీసెయ్యండి.. లేకుంటే ?

ఆప్రిలియా ఆర్ఎస్ 660 మరియు ట్యూనో 600 బైక్స్ కోసం బుకింగ్స్ ప్రారంభం

ఈ ఏడాది మధ్య భాగం నాటికి కంపెనీ రెండు మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేయవచ్చని అంచనా. ఈ రెండు మోటార్‌సైకిళ్లను సిబియు (కంప్లీట్లీ బిల్ట్-అప్ యూనిట్) రూట్‌లో పూర్తిగా విదేశాల్లో తయారైన మోడల్‌ను భారత్‌కు దిగుమతి చేసుకోనుంది.

ఆప్రిలియా ఆర్ఎస్ 660 మరియు ట్యూనో 600 బైక్స్ కోసం బుకింగ్స్ ప్రారంభం

ఆప్రిలియా ఆర్ఎస్ 660 స్పోర్టీ మరియు అగ్రెసివ్‌గా కనిపించే స్పోర్ట్స్ బైక్. ఈ బైక్‌లోని ఎల్‌ఈడి డిఆర్‌ఎల్ లైట్లు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. రేసింగ్ పనితీరు కోసం ఇది మంచి ఏరోడైనమిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అధిక వేగం వద్ద కూడా ఇది మంచి బ్యాలెన్స్‌ను అందిస్తుంది.

MOST READ:కారులో ఆహారపదార్థాలు నిల్వచేస్తే వచ్చే సమస్యలేంటో మీకు తెలుసా.. అయితే ఇది చూడండి

ఆప్రిలియా ఆర్ఎస్ 660 మరియు ట్యూనో 600 బైక్స్ కోసం బుకింగ్స్ ప్రారంభం

ఈ బైక్‌లో ఎల్‌ఈడి డిఆర్‌ఎల్ లైట్‌తో సహా మొత్తం మూడు భాగాల ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్ సెటప్ ఉంటుంది. దీని సైడ్ ప్రొఫైల్ చాలా షార్ప్‌గా కనిపిస్తుంది. ఫ్యూయెల్ ట్యాంక్‌పై డిజైన్ చేసిన క్రీజ్ లైన్స్ ఈ మోటార్‌సైకిల్ మొత్తం రూపానికి మరింత అందాన్ని జోడిస్తాయి.

ఆప్రిలియా ఆర్ఎస్ 660 మరియు ట్యూనో 600 బైక్స్ కోసం బుకింగ్స్ ప్రారంభం

ఇక ఆప్రిలియా ట్యూనో 660 విషయానికి వస్తే, ఇది కూడా చూడటానికి ఆప్రిలియా ఆర్ఎస్ 660 సూపర్‌స్పోర్ట్ మాదిరిగానే ఉంటుంది. అయితే, ముందు వైపు దీని ఫెయిరింగ్ సగం వరకే ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ హాఫ్-ఫెయిరింగ్ ఇంజన్ భాగాన్ని కవర్ చేయకుండా మంచి స్పోర్టీ రూపాన్ని అందిస్తుంది.

MOST READ:డ్రైవింగ్ లైసెన్స్‌లోని ఈ చిత్రం భలే విచిత్రం..చూసారా..!

ఆప్రిలియా ఆర్ఎస్ 660 మరియు ట్యూనో 600 బైక్స్ కోసం బుకింగ్స్ ప్రారంభం

ఈ రెండు మోటార్‌సైకిళ్లు ఒకే రకమైన 660సిసి పారలల్ ట్విన్ ఇంజన్‌ను కలిగి ఉంటాయి. ఈ ఇంజన్ గరిష్టంగా 100 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ బైక్‌లలో పెద్ద ఇంజన్ ఉన్నప్పటికీ, వాటి బరువు మాత్రమే 165 కిలోలుగానే ఉంటాయి. వీటిని 650సిసి విభాగంలోనే తేలికైన మోటార్‌సైకిళ్లుగా కూడా పరిగణిస్తారు.

Most Read Articles

English summary
Aprilia RS 660 And Tuono 660 Bookings Open; Launch Expected By Mid 2021. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X