రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. ఎప్రిలియా నుంచి రెండు కొత్త బైకులు వచ్చేశాయ్

భారత మార్కెట్లో ఎప్రిలియా కంపెనీ తన ఆర్‌ఎస్‌ 660, ట్యూనో 660 బైకులను విడుదల చేసింది. ఇందులో ఎప్రిలియా ఆర్‌ఎస్‌ 660 ధర రూ. 13.39 లక్షలు కాగా, ఎప్రిలియా ట్యూనో 660 ధర రూ. 13.09 లక్షల వరకు ఉంటుంది. ఎప్రిలియా ఆర్‌ఎస్ 660, ట్యూనో 660 బుకింగ్స్ దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే గత నెలలో ప్రారంభించబడింది. అయితే కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో ఇంకా అప్డేట్ చేయలేదు.

రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. ఎప్రిలియా నుంచి రెండు కొత్త బైకులు వచ్చేశాయ్

ఎప్రిలియా ఆర్‌ఎస్ 660 బైక్ ట్రిపుల్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఇడి డిఆర్‌ఎల్, ఎల్‌ఇడి టైల్ లైట్స్, స్పోర్టి ఫెయిరింగ్, మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, యుఎస్‌డి ఫ్రంట్ ఫోర్క్ కలిగిఉండటం వల్ల చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. ఈ బైక్‌లో హ్యాండిల్‌బార్ మరియు రియర్ సెట్ ఫుట్‌పెగ్‌పై క్లిప్ మరియు సౌకర్యవంతమైన సీటు కూడా ఇవ్వబడింది.

రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. ఎప్రిలియా నుంచి రెండు కొత్త బైకులు వచ్చేశాయ్

ఎప్రిలియా ట్యూనో 660 దాని ఆర్ఎస్ 660 వలె అదే ప్లాట్‌ఫారమ్‌లో రూపొందించబడింది. కానీ ఈ రెండు బైకుల డిజైన్ కొంత డిఫరెంట్ గా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఫెయిరింగ్ డిజైన్ కూడా బిన్నంగా ఉంటుంది. ఈ బైక్ సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ కలిగి ఉంటుంది. ఈ హ్యాండిల్ బార్ కారణంగా, ట్యూనో 660 యొక్క రైడింగ్ ఎర్గోనామిక్స్ ఆర్ఎస్ 660 తో పోలిస్తే కొద్దిగా సౌకర్యంగా ఉంటుంది.

MOST READ:విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించిన పిల్లి.. ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజమే

రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. ఎప్రిలియా నుంచి రెండు కొత్త బైకులు వచ్చేశాయ్

రెండు బైక్‌లలో 659 సిసి, ప్యారలల్ ట్విన్ ఇంజన్ కలిగి, రెండూ వేర్వేరు అవుట్‌పుట్‌లను కలిగి ఉన్నాయి. ట్యూనో 660 ఇంజిన్ 95 బిహెచ్‌పి పవర్ మరియు 67 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.అయితే ఇందులో ఆర్ఎస్ 660 కొంచెం శక్తివంతమైనదనే చెప్పాలి. ఇది 100 బిహెచ్‌పి పవర్ మరియు 67 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది, క్లచ్‌లెస్ అప్ అండ్ డౌన్ షిఫ్ట్‌ల కోసం క్విక్‌షిఫ్టర్ ఇవ్వబడింది.

రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. ఎప్రిలియా నుంచి రెండు కొత్త బైకులు వచ్చేశాయ్

అప్రిలియా ఆర్ఎస్660 మరియు ట్యూనో 660 లలో డిజిటల్ టిఎఫ్‌టి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ లెవల్ ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ఎబిఎస్, యాంటీ వీలీ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ మరియు రైడింగ్ మోడ్స్ ఉంటాయి.

MOST READ:త్వరపడండి.. అక్కడ ఒక కేజీ కేక్ కొంటె ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ

రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. ఎప్రిలియా నుంచి రెండు కొత్త బైకులు వచ్చేశాయ్

ఎప్రిలియా ట్యూనో 660 కాన్సెప్ట్ బ్లాక్, ఇరిడియం గ్రే మరియు యాసిడ్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండగా, ఆర్ఎస్ 660 అపెక్స్ బ్లాక్, లావా రెడ్ మరియు యాసిడ్ గోల్డ్ కలర్స్ లో అందుబాటులో ఉంది. ఈ రెండు బైక్‌లను సిబియు మార్గం కింద భారత్‌కు తీసుకువస్తారు.

రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. ఎప్రిలియా నుంచి రెండు కొత్త బైకులు వచ్చేశాయ్

ఈ కొత్త బైక్‌లలో పెద్ద ఇంజన్ ఉన్నప్పటికీ, వాటి బరువు 165 కిలోలు మాత్రమే ఉంటాయి. ఇవి 650 సిసి విభాగంలో తేలికైన బైక్‌లుగా పరిగణించబడతాయి. ఈ బైక్ కావాలనుకునే వినియోగదారులు అమౌంట్ చెల్లించిన 8 వారాల తరువాత డెలివరీ చేస్తారు. భారత మార్కెట్లో విడుదలైన ఈ బైకులకు ఎటువంటి రెస్పాన్స్ ఉంటుందో వేచి చూడాలి. ఇవి చూడటానికి చాలా స్టైలిష్ గా ఉన్నాయి.

MOST READ:మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతకు 5 లీటర్ల పెట్రోల్ గిఫ్ట్‌గా ఇచ్చారు, ఎందుకో తెలుసా!

Most Read Articles

English summary
Aprilia RS 660 & Tuono 660 Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X